మహబూబ్‌నగర్

నిండుతున్న చెరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 3: ఎంజికెఎల్‌ఐ మూడో లిప్టు మొదటి పంపుద్వారా పారుతున్న నీటితో డివిజన్ పరిధిలోని అనేక చెరువుల్లోకి నీరుచేరి నిండుతున్నాయి. దీనితో యాసంగీ పంటలపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నారు. చాలా మంది రైతులు చెరువుల కింద ఉన్న భూములలో వరిపంటను వేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే చెరువు సమీపంలో ఉన్న రైతులు వేరుశనగ విత్తనాలను విత్తుకోగా, చాలా మంది రైతులు వరినారుపైరు వేసుకున్నారు. చాలా ఏళ్ల తరువాత చెరువులు నిండటంతో ఆయా చెరువుల కిం ద ఉన్న భూములు సాగుకు నోచుకోవడంలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కెఎల్‌ఐ ద్వారా వస్తున్న నీటితో ముందుగా చెరువులు, కుంటలను నింపుతుండటంతో వాటి కింద ఉన్న ఆయకట్టుదారులలో ఆనందం నెలకొంది. ఖరీఫ్‌లో ఆశించిన వానలు పడకపోవడంతో పంటలు ఎండిపోయి నిరాశలో ఉన్న రైతులకు ఈ యాసంగి సీజన్ కొం తమేర ఉత్సాహపరుస్తుంది. చెరువులు, కుంటలలోకి భా రీగా నీరువచ్చి నిండుతున్నప్పటికి, తూముల నుంచి ఆయకట్టుకు పారే పాటు కాలువలు పూర్తిగా పూడ్చుకొని పోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. చెరువుల్లోకి నీరు రాకపోవడంతో వాటి కింద ఉన్న ఆయకట్టుకు నీరుపారేవిధంగా ఉన్న పాటు కాలువలు పూర్తిగా పూడ్చుకొని పో యాయి. ప్రస్తుతం రైతులకు ఇదే వేధిస్తున్నది. చెరువులు, కుంటలను నిండుతుండటంతో సాగునీటిపారుదల శాఖాధికారులు వాటి కింద ఉన్న పాటు కాలువలను సరిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.. యాసంగిసాగుకు అవసరమైన నీటిని అందించేందుకు వీలుగా అధికారులు పాటు కాలువలను మరమ్మత్తులు చేయాలని అంటున్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకున్నట్లైతే రైతులకు ఎంతో ప్రయోజనం చేసినవారవుతారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనే దాదాపు 40 చెరువులు నిండగా, మరో వా రంలో ఇంకా 20 చెరువులు నిండుతాయని అధికారులు తెలిపారు. ఈ చెరువుల కింద రైతులు యాసంగి పంటను సాగుచేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయ బోర్లు రీచార్జీకావడంతో రైతులు వేరుశనగ పంటను భారీగా విత్తుకున్నారు. కెఎల్‌ఐ ద్వారా నీరువస్తుండటంతో రైతులలో ఆనందవ్యక్తమవుతున్నది. ఇట్టి నీటిని వినియోగించుకునేందుకు వీలుగా పాటు కాలువల మరమ్మత్తు పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని రైతులు కోరుతున్నారు.