మహబూబ్‌నగర్

కన్వీనర్లతో టిడిపి ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 6: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుల నియామాకంతో పాటు కార్యవర్గం సైతం ఏర్పాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావించారు. కానీ పార్టీ అధినేత సూ చనమేరకు ఇక్కడి నాయకుల సలహామేరకు పార్టీని ముందుకు నడిపించేందుకు గాను ముందుగా జిల్లాల కన్వీనర్లే శ్రేయస్కారమని భావించి అధిష్టానం టిడిపి జిల్లా కన్వీనర్లుగా నియమించింది. తెలుగుదేశం పార్టీ ఆ విర్భాం నుండి ఈ ప్రాంతంలో మంచిక్యాడర్ ఉంది. జిల్లాల విభజన జరిగిపోయినందునా పార్టీని అయా జి ల్లాలో బలోపేతం చేసి 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్న తెలుగుదేశం నేతలు ముందుగా అయా జిల్లాల కన్వీనర్లను నియమించింది. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాకు తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు, నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్‌గా డాక్టర్ శ్రీనివాసులు, వనపర్తి జి ల్లా కన్వీనర్‌గా రాములు, జోగులాంబ గద్వాల జిల్లా కన్వీనర్‌గా రామచంద్రారెడ్డిలను నియమించారు. శనివారం రాత్రి రాష్ట్ర పార్టీ వీరి పేర్లను ప్రకటించడంతో జిల్లాల కన్వీనర్లుగా నియామాకమైన వారి అభిమానులు రోడ్లపైకి వచ్చి టపాకాయాలు కాల్సి సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం అయా జిల్లాల కన్వీనర్లకు పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిము లు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభం తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే సభ్యత్వాలలో మహబూబ్‌నగర్ జిల్లా ముందంజలో ఉంటుందని అన్నారు. అదేవిధంగా తాను ఇదివరకే జిల్లా అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పని చేశానని నా సేవలు ఉమ్మడి పాత మహబూబ్‌నగర్ జిల్లా ప్రజ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ జెండాను ఎగురవేయడానికి శాయశక్తుల కృషి చేయడం జరుగుతుందని బక్కని నర్సిములు తెలిపారు. అదేవిధంగా వనపర్తి జిల్లా కన్వీనర్ రాములు మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను పా ర్టీకి పూర్తిగా న్యాయం చేస్తానని ము ఖ్యంగా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం కోసం పనిచేయడం జరుగుతు ందని అన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీని వదిలివెళ్లిన కింది స్థాయి కార్యకర్తలను కూడా తిరిగి పా ర్టీలోకి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కన్వీనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీకి పూర్వవైభం తీసుకవస్తామని పార్టీ సభ్యత్వాన్ని ఎక్కువ మొత్తంలో చేయిస్తామని తెలిపారు. అందరి కలుపుకుని పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. నాగర్‌కర్నూల్ టిడిపి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసి 2019 ఎన్నికల నాటికి నాలుగు నియోజకవర్గాలలో పార్టీకి పూర్వవైభం తెస్తానని అన్నారు. జిల్లాలో పార్టీకి కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని కానీ గ్రామిణ ప్రాంతాలలో ఉన్న క్యాడర్ పార్టీకి కోసం పని చేస్తున్నారని తెలిపారు. సభ్యత్వాలు చేయిస్తూనే ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలు నిర్వహించి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా ప్ర స్తుతం నియామాకం చేసినా కన్వీనర్లకు మాత్రం పార్టీని ముందుకు తీసుకెళ్లాడానికి ఎన్నో అండంకులు ఉన్నాయని వేలాది మంది కార్యకర్తలు పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరడంతో వారిలో కొంతైనా సొంత గూటికి తీసుకువస్తేనే తెలుగుదేశం పార్టీకి నాలుగు జిల్లాల్లో పూర్వవైభం వస్తుందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో మళ్లీ పసుపు రంగు జెండాలను ఎగురు వేస్తున్నారు.