మహబూబ్‌నగర్

రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగనూర్, నవంబర్ 8: భీమాలో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్‌లో భూ ములు కోల్పోయిన పునరావాస రైతులకు పం టనష్ట పరిహారం చెల్లించుటలో ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని, రైతులకు ఎలాంటి స మాచారం లేకుండా సంగంబండ రిజర్వాయర్‌లో నీటిని నిర్లక్ష్యం చేయడం మూలంగా రై తులు వేసుకున్న పంటలన్ని పూర్తిగా నష్టం వాటిల్లిందని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవా రం ఆయన మండలంలోని పునరావాస గ్రా మాలైన నేరడగాం, ఉజ్జెల్లి గ్రామాలలో పర్యటించి అక్కడి పరిస్థితులపై ప్రజలతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 2005 సంవత్సరంలో 2010లో సంగంబండ రిజర్వాయర్ క్రింద ఉన్న నేరడగాం గ్రామాన్ని ముంపుగ్రామంగా జిఓ విడుదల చేయడం జరిగింది. కాగా ఆగ్రామంలో ఇంత వరకు పునరావాసానికి సంబంధించి ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడం సోచనీయమని అన్నారు. సంగంబండ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తమ గ్రామంలో దాదాపు 70 శాతం ఇళ్లు కూలిపోయే దశలో ఉన్నాయని, అలాగే ప్రాజెక్టులోని నీటి నుండి విషసర్పాలు, తేళ్లు, ఈగలు, దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పటికి ఈప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇట్టి విషయాన్ని సంబంధిత ఇరిగేషన్ మంత్రి హరిష్‌రావుకు విన్నవించినప్పటికి ఆయన స్పందించలేక పోవడంతో ఈ విషయంపై తాను అసెంబ్లీలో చర్చిస్తానని అన్నారు. అలాగే ఉజ్జెలి గ్రామాన్ని 2005లో పునరావాస గ్రామంగా ప్రకటించినప్పటికి 11 సంవత్సరాల కాలయాపనతో ఇంత వరకు సరైన నష్టపరిహారాన్ని ఎందుకు చెల్లించలేదని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత పాత జిఓ ఆదారంగా ఎకరా పొలానికి కేవలం రూ.50 వేలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. 2013 జిఓ ప్రకారం ఉజ్జెల్లి పునరావాస గ్రామ ప్రజలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సంగంబండ ప్రాజెక్టులో నీటిని విడుదల నిలుపుదల చేయడం మంచిదైనప్పటికి ప్రాజెక్టులో భూ ములు కోల్పోయిన రైతులకు నీటిని నిలుపుదల చేస్తామని ఒక్క మాటకూడా చెప్పకుండా నీటిని నిలుపుదల చేయడంతో రైతులు వేసుకున్న పంటలన్ని ప్రాజెక్టులో కొట్టుకపోవడంతో వారి పరిస్థితి పూర్థిగా దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులందరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పునరావాస గ్రామంలో అన్ని వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, బడి, గుడి, వై ద్యశాల వంటివి సత్వరమే నిర్మింప చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలోని పేద ప్రజలందరికి డబుల్ బెడ్‌రూములు కట్టించి ఇస్తామన్న సిఎం కెసిఆర్ సర్వం కోల్పోయిన పునరావాస గ్రామ ప్రజలు ఎందుకు కట్టించడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే వారికి డబుల్ బెడ్‌రూములు కట్టించి ఇవ్వాలని కోరారు. నేరడగాం, ఉజ్జెల్లి గ్రామాలకు చెందిన పునరావస రైతుల వి షయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇరిగేషన్ మంత్రిని కలసి సమస్యల సాధనకై కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన సంగంబండ రిజర్వాయర్ బండ్‌ను పరిశీలించారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి శా ంతకుమార్, కార్యవర్గ సభ్యులు కొండయ్య, జిల్లా అధ్యక్షులు రతన్‌పాండ్‌రెడ్డి, నింగిరెడ్డి, భాస్కర్, సోమశేఖర్‌గౌడ్, జయనందన్‌రెడ్డి, విద్యాసాగర్, క్రిష్ణయ్య, కనకరాజ్, ఉజెనప్ప, నర్సప్ప, మారెప్ప పాల్గొన్నారు.