మహబూబ్‌నగర్

క్రీడల అభివృద్ధికి సిఎం ప్రత్యేక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, నవంబర్ 15: క్రీడల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వివరించారు. మంగళవారం బాలానగర్ మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో క్రీడలను ప్రారంభించారు. అనంతరం బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర బాలికల స్విస్తిక్ కార్యక్రమం (ఆర్‌బిఎస్‌కె) పథకాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో అవసరపడుతాయని అన్నారు. క్రీడల్లో గెలుపుఓటములను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్పోరేట్ స్థాయికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టిందని వివరించారు. పేద విద్యార్థుల కోసమే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మున్ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30పడకల ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర బాలల స్విస్తిక్ కార్యక్రమంలో భాగంగా జిరో నుండి 18సంవత్సరాలు నిండిన బాలబాలికలకు ఉచితంగా వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య తెలంగాణ సాధించమే ప్రభుత్వ ధ్యేయమని, వైద్యశాఖలో అనేక కొత్తమార్పులు తీసుకువస్తున్నట్లు వివరించారు. గర్భిణి స్ర్తిలు ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి ప్రసూతి చేయించుకోవాలని, అలాచేస్తే వారికి బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కాశిరెడ్డినారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సిఎం కెసిఆన్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. క్రీడపట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా పిఇటిలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భాగ్యమ్మ, జడ్పిటిసి సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపిటిసి సభ్యుడు లక్ష్మణ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రావు, మహిపాల్‌రెడ్డి, వెంకట్‌చారి, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.