మహబూబ్‌నగర్

పాలిహౌస్ నిర్మాణాల్లో అంతర్‌పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 15: పాలిహౌస్ నిర్మాణాల్లో అంతర్ పంటలు వేసుకొని రైతులు లాభాలు గడించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో రైతు శేఖర్ పాలిహౌస్‌ను పరిశీలించారు. అక్కడి నుండి షాద్‌నగర్ పట్టణంలోని పట్టుపరిశ్రమ శాఖలో పట్టుదారం తయారుచేసే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 129ఎకరాల్లోనే పాలిహౌజ్‌లు ఉండేవని, ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఎకరాలకు పైగా పాలిహౌస్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఎస్సీ, ఎస్టి రైతులకు 90శాతం సబ్సిడిపై పాలిహౌస్‌లు ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పాలిహౌజ్ నిర్మాణాల్లో అంతర్‌పంటలను సాగుచేసుకుంటే రైతులు ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వెయ్యి గజాల పాలిహౌస్ నిర్మాణంలో అంతర్‌పంటలుగా టమాట, కల్బంద, ఆకు కూరలల పంటలను సాగుచేస్తే రైతులు ఎన్నో లాభాలు గడించే అవకాశాలు ఉంటాయని సూచించారు. పంటలను సాగుచేసేందుకు నీళ్లు ఉన్న ప్రతి రైతుకు పాలిహౌజ్‌ను నిర్మించుకునేందుకు అధిక మొత్తంలో సబ్సిడి ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎన్నో సబ్సిడి పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, వాటన్నింటిని అర్హులైన రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పంటల సాగులపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఏ సీజన్‌లో ఏ పంట వేస్తే రైతులు లాభాలు పొందుతారో అవే పంటలు రైతులతో వేయించేందుకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. నీటిని వృధా చేయకుండా డ్రిప్ పద్దతిలో పంటలను సాగుచేస్తే మరింత ఖర్చు తగ్గి పంటలు బాగా పండుతాయని వివరించారు. పట్టు దారానికి మార్కెట్‌లో మంచి ధర ఉందని, రైతులు మల్బరీ తోటలను సాగుచేసేందుకు కృషి చేయాలని అన్నారు.