మహబూబ్‌నగర్

నూటికి నూరుశాతం నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హన్వాడ, నవంబర్ 18: మండల పరిధిలోని సల్లోనిపల్లి గ్రామంలో స్వచ్చ్భారత్ మీషన్ పథకం కింద గ్రామంలో నూటికి నూరుశాతం మరుగుదొడ్లను నిర్మించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం సల్లోనిపల్లి గ్రామంలో కలెక్టర్‌తో పాటు ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు పర్యటించి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 336 మరుగుదోడ్ల నిర్మాణాన్ని 48 గంటల్లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఏ ఇంటిని చూసిన మరుగుదొడ్డి నిర్మాణంతోనే దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సల్లోనిపల్లి 6గామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని, 336 మరుగుద్లొను 48 గంటల్లో నిర్మించి ప్రజలకు అందుబాటులో తెవడమంటే గొప్పవిషయమన్నారు. జిల్లా నలుమూలల నుండి సల్లోనిపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ నిర్మాణం చేసిన మరుగుదొడ్లను పరిశీలించే విధంగా నాందిగా ఉండాలన్నారు. జ్రలు గ్రామస్థులు మరుగుదొడ్ల వాడకాన్ని విస్మరించకూడదని, గతంలో మాదిరిగా ఇతర వస్తువులు పెట్టుకునేందుకు వీటిని ఉపయోగించకూడదన్నారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని మహి ళ సంఘాల సభ్యులు మరుగుదొడ్ల ప్రాముఖ్యతను మరిచిపోవద్దని సూచించారు. లబ్దిదారుడి నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదోడ్ల నిర్మాణానికి మేస్ర్తిలు, కూలీలకు చెల్లింపులు ఏ విధంగా కూలీడబ్బులు చెల్లిస్తున్నారనే విషయంలో వారిని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లకు తీసిన గుంతల్లో అమర్చిన రింగులు సరిగ్గా లేవని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్డిని 6/4 సైజులో నిర్మించుకుంటే మరుగుదొడ్డితో పాటు స్నానపు గది కూడా నిర్మాణం అవుతుందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామ పరిధిలోని పలుగుతాండను సందర్శించి అక్కడ నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సల్లోనిపల్లి గ్రామంలో నిర్మాణంలో మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెసి శివకుమార్‌నాయుడు, ఆర్డిఓ మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ జ్యోతి, ఎంపిడిఓ నటరాజ్, స్థానిక సర్పంచ్ భారతమ్మ, ఎంపిటిసి శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.

దళారులదే పైచేయ

మహబూబ్‌నగర్, నవంబర్ 18: పెద్ద నోట్ల మార్పిడిని దళారులు సోమ్ము చేసుకుంటున్నారు. జనం కొందరు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాం కుల్లో జమ చేస్తుంటే మరి కొందరు చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు. దిన్ని దళారుల దందాగా మార్చుకుంటున్నారు. పెద్ద నోట్లల్లో రూ.1000కి రూ.200, రూ.500నోటుకు రూ.50 నుండి 100 వరకు కమీషన్ తీసుకుంటున్నారని చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్న వారు చెబుతున్నారు. ఇంకా కరెన్సీ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శుక్రవారం జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లోని కొన్ని బ్యాంకుల దగ్గర రద్ది తగ్గుముఖం పట్టినట్లు కనబడింది. అయితే ఏటిఎం దగ్గర మాత్రం భారిగానే క్యూలో జనం నిలబడ్డారు. ఏటిఎంల దగ్గర జనం రద్ది తగ్గాలంటే అన్ని ఎటి ఎంలలో డబ్బులు తీసుకునే విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుండేదని ప్రజలు వాపొతున్నారు. ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ బ్యాం కుల దగ్గర మాత్రం యదాతథంగా రద్ది ఉంది. మిగితా బ్యాంకుల దగ్గర రద్ది తగ్గుముఖం పట్టింది. పట్టణ కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రద్ది కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటల వరకే గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల దగ్గర జనం క్యూలైన్‌లో నిలబడుతున్నారు. అయితే రూ.2000నోట్లు చేతికి అందిన చిల్లర దొరకకా జనం ఎందుకు రూ.2000నోట్లు తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లోకి తీసుకెళ్తే చిల్లర లేక అవస్థలకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా దళారులు ఇదే అదునుగా బావిస్తూ అమాయక ప్రజలతో దండుకునే విధంగా వ్యుహాలు రచించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ఆమాంతంగా రూ.100 ఒక్కసారిగా విలువ పెరిగింది. రూ.50,20,10 నోట్లను గతంలో చిన్నచూపు చూసేవారంత ప్రస్తుతం వాటి విలువ తెలియడంతో అవాక్కవుతున్నారు. కొందరు ఎప్పటికి పెద్ద నోట్లను జేబులో పెట్టుకుని ఉండేవారు ప్రస్తుతం అవి చెల్లుబాటు కాకపోవడంతో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, ఏటిఎంలలో రూ.2000,100నోట్లు వస్తుండడం ఇంకా ప్రజలకు ఉపశమనం లభించలేదు. నూతనంగా రూ.500నోట్లు వస్తే తప్పా. ప్రజల కష్టాలు తీరవని జనం బావిస్తున్నారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.500నోట్లు రాకపోవడంతో రూ.2000నోటు తీసుకుని జేబులో పెట్టుకుని చుస్తూ మురిసిపోవడమే తప్పా. మరోకటి లేకుండా పోయిందని ప్రజలు పలువిదాలుగా చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ సంస్థల్లోని పన్నులు చెల్లించే కార్యాలయాలకు మాత్రం ఆదాయం ఆమాంతంగా పెరిగింది. బకాయి ఉన్న పన్నులను జనం చెల్లిస్తున్నారు. రద్దు అయిన రూ.1000, 500నోట్లను పన్నులకు చెల్లిస్తుండడంతో ఆయా కార్యాలయాల్లోని పెండింగ్ బకాయిలు తొలగిపోతున్నాయి. ఈ నెల 24వ తేది వరకు ఇలాంటి అవకాశాన్ని కల్పించడంతో జనం తమ దగ్గర ఉన్నటువంటి నోట్లను మార్చుకునేందుకు ఇలాంటి అవకాశం దొరకడంతో కొంత ఉపశమనం లబిస్తుంది. కాకపోతే మార్పిడి విషయంలో కేవలం రూ.2000మాత్రమే బ్యాంకుల నుండి ఇస్తుండడంతో ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ కష్టాలు తొలిగేది ఎప్పుడోనని అందరు చర్చించుకుంటున్నారు.

కమాండెంట్ కంట్రోల్ ద్వారా ప్రత్యేక నిఘా
కొడంగల్, నవంబర్ 18: క్షణాల్లో సమాచారం తెలుసుకోవడానికి కామాండెంట్ కంట్రోల్ రూం ఏర్పా టు చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో రోడ్డు ప్రమాదాల నివారణకు కొడంగల్‌లో నిర్మించిన హైవే పోలీస్ స్టేషన్‌ను మంత్రి నాయిని నరసింహరెడ్డి, రవా ణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిలు శు క్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డ్డితో కలిసి హోంమంత్రి మాట్లాడు తూ రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకుగాను హైవే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా హైదరాబాద్ - బిజాపూ ర్ ప్రధాన రోడ్డు వెంబడి అధిక ప్రమాదాలు జరుగుతుండడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఈ ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్లు పని చేస్తాయని తెలిపారు. ట్రాఫీక్ నిబంధనాలను పాటించకుండా వాహనాలను నడిపితే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 120 కిలో మీటర్ల దూరం వరకు డెమో కారిడార్లను గుర్తించి వాటికి గాను వాహనాలు, ఆధునాతన సామాగ్రి, సిబ్బందిని సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. వాటికి గాను రూ.6.33కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. పోలీసు అకాడమి నుండి కర్ణాటకలోని బిజాపూర్‌కు వెళ్లె రహదారి పొడవున పోలీసు పెట్రోలింగ్ ఉంటుందని తెలిపారు. ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రమాదంలో ఉన్న క్షతగాత్రులను ఆసపత్రుల్లో చేర్చేవిధంగా పోలీసులు కృషి చేస్తారని తెలిపారు. పోలీసు విధి నిర్వహణప కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా కితాబు ఇచ్చారని అన్నారు. పోలీసులు ప్రజల సమన్వయంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని పెర్కోన్నారు. అందుకు గాను ప్రజలు సహకరించాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు గాను హైదరాబాద్ - బిజాపూర్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ముక్యమంత్రి కృషి చేసి గొప్ప చరిత్ర సృష్టించారని ఆయన అన్నారు. నరుూం కేసులో నింధితులుగా ఎవరు ఉన్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ప్రస్తుతం ఆ కేసు సీట్ దర్వాప్తులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, డిఐజి అకున్ సబర్వాల్, ఐజీలు కృష్ణ ప్రసాద్, మల్లారెడ్డి, నాగిరెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.

ఏమి కష్టాలు
ధన్వాడ, నవంబర్ 18: కూలీపనులు వదులుకోని ప్రతి రోజు బ్యాంకుల చుట్టు తీరుగావాల్సిన పరిస్థితి ఏర్పాడిందని ప్రజలు, బ్యాంక్ ఖాతాదారులు, వ్యాపారులు వాపోతున్నారు. బ్యాంకుల వద్ద తమతమ వద్ద ఉన్న రూ.500ల, రూ.1000ల నోట్లు పట్టుకోని గంటపాటు పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పాడిందని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఈ కష్టాలు ఏమి దేవుడా అంటూ ప్రజలు, ఖాతాదారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ధన్వాడ మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు వద్ద పాత రూ.500లు,రూ.1000ల నోట్లు పట్టుకోని క్యూలో నిలబడలేక బ్యాంక్ ముందు ఖాతాదారులు బైటాయించారు.

రాష్టస్థ్రాయి సాఫ్ట్‌బాల్‌కు విద్యార్థులు
ధన్వాడ, నవంబర్ 18: మరికల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్టస్థ్రాయి సాఫ్ట్‌బాల్ క్రీడలకు ఎంపిక అయిన్నట్లు పాఠశాల ప్రధానోపాద్యాయురాలు అపర్ణ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల ప్రధానోపాద్యాయురాలు అపార్ణ మాట్లాడుతూ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు గాయిత్రి, రోషినిలు అండర్ 17లో ఎంపిక అయిన్నట్లు ఆమె తెలిపారు. రాష్టస్థ్రాయి సాఫ్ట్‌బాల్ క్రీడలు నల్గోండ జిల్లా కేంద్రంలో ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా సాఫ్ట్‌బాల్ రాష్టస్థ్రాయి అండర్ 14లో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు వరలక్ష్మీ,స్వాతి, గీతాలు ఎంపిక అయిన్నట్లు ఆమె తెలిపారు. ఈ క్రీడలు ఈనెల 27, 28న నిజామబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈసమావేశంలో పాఠశాల పిఇటి సుగుణ తదితరులు పాల్గొన్నారు.

బాలల హక్కులను కాపాడాలి
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 18: బాలల హక్కులను కాపాడడంతో పాటు వారి జీవితాల్లో ఉత్తేజాన్ని నింపి భవిష్యత్తుపై ఆశ కల్పించడంతో పాటు సమాజమంతా ఏకతాటిపై నిలబడేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. శుక్రవారం పోలీసుశాఖ చైల్డ్ హెల్ప్ లైన్ సంయుక్తంగా నిర్వహించనున్న బాల్యానికి రక్ష అనే గొడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యం ఎంతో ఆహ్లదకరంగా, స్వేచ్చగా ఉంటుందో దేశ భవిష్యత్తు అం తగా అభివృద్ది వైపు ప్రయాణిస్తుందన్నారు. సమాజంలో బాలల మేదా సంపత్తిని గుర్తించి వారి ఆలోచనలకు విలువనిస్తూ పదునుపెట్టే శాస్ర్తియత కరువైందని ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమ యం కూడా తక్కువై పోయిందని ఆమె ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొందరు పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై సమాజంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కళాశాలలో విద్యార్థిని పట్ల లైంగిక వేదింపులకు గురి చేస్తే ఫోక్స్ చట్టం ప్రకారం నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫోక్స్ చట్టంపై పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ డైరెక్టర్ చంద్రశేఖర్, కో- ఆర్డినేటర్ నరసింహులు, సభ్యురాలు ఉమాదేవి, రాధ, పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్ పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ నుండి ఎన్‌ఎస్‌యుఐలో చేరిక
కల్వకుర్తి,నవంబర్ 18: ఎస్‌ఎప్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు 50 మంది కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యుఐలో స్థానిక ఎమ్మెత్యే చల్లా వంశీచంద్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం చేరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివకుమార్,మల్లేష్,మహేష్,లింగం,అరుణ్, తదితరులు ఉన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా

మహబూబ్‌నగర్, నవంబర్ 18: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ కళాశాలల విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. మహబూబ్‌నగర్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. టిఎన్‌ఎస్‌ఎఫ్, శివసేన విద్యార్థి సంఘం, బిసి విద్యార్థి సంఘం ఆద్వర్యంలో చేపట్టిన ధర్నాకు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున హజరయ్యారు. మహబూబ్‌నగర్ పట్టణంలో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం తమ చదువులకు సహకరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్నా చౌక్‌కు చేరుకున్న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. గంటల తరబడి ధర్నా చౌక్ దగ్గరకు ధర్నాకు దిగడంతో అటు వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, శివసేన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు నాగరాజులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను బాగస్వామ్యం చేసిన కెసిఆర్ తెలంగాణ వచ్చాక విద్యార్థులను విస్మరించారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా బకాయి ఉన్న రూ.3వేట కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ స్కాలర్ షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. డిసెంబర్ 20వ తేదిలోపు విడుదల చేయకపోతే హైదరాబాద్‌ను లక్షలాది మందితో దిగ్భందిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆగ్రహానికి కెసిఆర్ గురికాకముందే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతున్న విద్యారంగ సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన టిడిపి మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జి ఎన్‌పి వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దిగిరావాలంటే ఇక విద్యార్థులు తమ ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాల ర్ షిప్‌లను తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను విస్మరించడం ఘోరమైన తప్పిదమని ఆరోపించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తుందని ప్రభు త్వం అలాంటి నిర్ణయానికి పూనుకుంటే కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థులకు అండగా నిలిచి పోరాటం చేస్తామని తెలిపారు.
బిజెపి జిల్లా నాయకులు గడ్డం గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తుందని ఫీజు రియింబర్స్‌మెంట్ అందక చదువులు మధ్యలో ఆపాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, కిరణ్, వెంకటేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
కల్వకుర్తి, నవంబర్ 18: పట్టణ కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్బంగా క్రీడకారులతో మాట్లాడుతూ ఈ వాలీబాల్ పోటీలలో క్రీడ స్పూర్తితో అడి జాతీయ స్థాయి పోటీలలో గెలుపొందాలని క్రీడకారులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పిఇటి యాదయ్య, క్రీడకారులు, కాంగ్రెస్ నాయకులు శ్రీరాములు, షాకీర్, ఖాదీర్ తదితరులు ఉన్నారు.

మంత్రులకు ఘన స్వాగతం
బొంరాస్‌పేట, నవంబర్ 18: తొలిసారి కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర హొం శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి స్వాగ తం పలికారు. కొడంగల్ శివారులో బండ ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా నిర్మించిన హైవే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వెళుతున్న ఇరువురు మంత్రులను మెట్లకుంట పరిధిలోని బుర్రితండా చెక్‌పోస్టు దగ్గర శుక్రవారం శాలువాలు, పూల మాలలతో సత్కరించారు. టిఆర్‌ఎస్ మహిళ విభాగం నాయకులు మం గళ హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలికారు. విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రమణారెడ్డి, ఎల్లప్ప, శేఖర్‌గౌడ్ తదితరులున్నారు.

కొత్తనోట్లపై గీత పడితే చెల్లవు
మక్తల్, నవంబర్ 18: కొత్తగా ఇస్తున్న నోట్లపై గతంలో మాధిరిగా పెన్ను, పెన్సిల్‌లతో పిచ్చిరాతలు ఉంటే మాత్రం ఆలాంటి నోట్లు చెల్లనేరవంటో ఆర్‌బిఐ శాఖ బ్యాంకుల ముందు బ్యానర్లతో ప్రచారం చేస్తుండటంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన రూ.2000, 500 లతోపాటు కొత్తగా వచ్చే నోట్లపై ఎలాంటి పిచ్చి గీత లు ఉండరాదన్న నిబంధనలు ఆర్‌బిఐ ప్రకటించడం తో ఇప్పటికే చాలా మంది వ్యాపారులు కొత్తనోట్లపై డినామినేషన్‌కై పెన్నుతో రాసి ఉంచుకోవడం జరిగిం ది. ఇలా రోజుకో నిబంధనలు రావడంతో ప్రజలకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిరక్ష్యరాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని పాటించడం మళ్లీ అధికాదు కొత్త నిబంధన వచ్చిందంటే వాటికై పరుగులు తీయడం ఇలా చదువుకున్న వారి కాళ్లా ఏళ్ళపడి నగదు బదిలీకానీ, విత్‌డ్రాలు కానీ చేసుకోవడంతో పడుతున్న కష్టాలు కోకోల్లలని చెప్పక తప్పదు.