మహబూబ్‌నగర్

మిషన్ భగీరథలో నిర్లక్ష్యం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వాటార్‌గ్రీడ్, ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులతో జిల్లాలో చేపట్టిన మిషన్ భగీరథ పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. పనులు జరిగే చోట ఒక రోజు ముందుగానే మెటీరియల్ సిద్ధంగా ఉంచుకుంటే త్వరితగతిన పనులు పూర్తవుతాయన్నారు. నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్లితే సకాలంలో పూర్తవుతాయని ఆమె అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను మిషన్ భగీరథ పనుల విషయంలో ఇంజనీర్లు నిర్లక్ష్యం వహించరాదని ఆమె హెచ్చరించారు. మండలాల వారిగా కలెక్టర్ పనుల పురోహితిపై సమీక్షిస్తూ ప్రస్తుతం పని చేస్తున్న జాయింట్ మిషన్లు, వేస్తున్న పైపులైన్లు, సామాగ్రి అందుబాటు, కొరత, పైపులైన్ల తవ్వకాల పనులు, పనులకు అవసరమయ్యే అదనపు సామాగ్రి తదితర వివరాలను ఇంజనీరింగ్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పనులపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పైపులైన్ పనులతో పాటు ఇంటెక్‌వెల్ పనులు, గ్రామాల్లో అంతర్గతంగా చేపట్టిన పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, గుట్టలలో పైపులైన్లు వేసే పనులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆమె అన్నారు. పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు మండలాల వారిగా తెలియజేస్తూ ఇంకా 20 జాయింటింగ్ మిషన్లు అవసరమని, ఇంటెక్‌వెల్స్ వద్ద స్థల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇంజనీర్లు దయాకర్, జగన్‌మోహన్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.