మహబూబ్‌నగర్

రద్దు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 28: రూ.1000, 500 నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు పడుతున్న బాధలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆక్రోశ్ దివాస్ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ ఆద్వర్యంలో మంగళవా రం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణు లు మమబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి ధర్నాకు దిగారు. అదేవిధంగా కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు నివారించడంతో అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోది ఏకపక్ష నిర్ణయంతో దేశ ప్రజలంతా ఇబ్బందుల్లోకి పడ్డారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలో ఆర్థికసంక్షోభం నెలకొందని ద్వజమెత్తారు. సామాన్యుల కష్టాలు ప్రధానమంత్రికి తెలియడం లేదని ప్రధానమంత్రికి సామాన్యులంటే గిట్టదని పెద్ద నోట్ల రద్దు కార్పోరేట్ సంస్థలకు అండగా నిలిచేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో నోట్ల రద్దుపై విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సింది పోయి తప్పించుకుంటున్నారని ఎద్దెవా చేశారు. నోట్లు రద్దు చేసిన ఇంతవరకు దేశం లో ఎక్కడ కోట్ల రుపాయల నల్లదనం ఎందుకు బయటపడలేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినిపోయిందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారులు కుదేలున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1000,500నోట్లను రద్దు చేసిన ప్రధానమంత్రి ప్రజలకు అందుబాటులో చిల్లరను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బ్యాంకింగ్ సౌక ర్యం తక్కువగా ఉందని ముందే తెలియదా అంటూ ప్రశ్నించారు. నగదు ఉపసంహరణలో ఎన్నో అంక్షలు పెట్టడం అదేవిధంగా రద్దు అయిన నోట్లపై రోజుకో విధానం ప్రకటిస్తుండడంతో ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ మాట్లాడుతూ ముందుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాం తాల్లో ఆసరా పించన్ తీసుకుంటున్న వృద్దులకు ఇద్దరికి కలిపి రూ.2000నోటు ఇవ్వడం సిగ్గుచెటన్నారు. దింతో కేంద్ర ప్రభుత్వం వృద్దుల మధ్య పంచాయితీ పెట్టిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆమర్, పటేల్ వెంకటేష్, చంద్రకుమార్‌గౌడ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

వ్యాధుల నుండి కాపాడాలి
పాన్‌గల్, నవంబర్28: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచాలని డిఎంఎంఓ జిల్లా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటి డిఎం అండ్ హెచ్‌ఓ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగిన తల్లులకు, పిల్లలకు వ్యాధి నిరోదక టీకాలను 100శాతం ఇవ్వాలని, ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి సలహ కమిటి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రి అభివృద్ధిలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. డాక్టర్ మారుతి నందన్‌గౌడ్, సిహెచ్ ఓ భాస్కర్ పాల్గొన్నారు.

నగదు రహీత వర్క్‌షాప్
వనపర్తి, నవంబర్28: నగదు రహీత లావాదేవిలపై ఈనెల 30వ తేదిన వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట తహశీల్ధార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు నగ దు లావాదేవిలలో ఇబ్బందులను తొలగించేందుకు ముందుగా జిల్లా అధికారులకు నగదు రహీత లావాదేవిలపై వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నగదు రహీత లావాదేవిలపై జిల్లా అధికారులు వారి సూచనలు, సలహాలు అందజేయవచ్చని ఆమె తెలిపారు. నగదు రహీత లావాదేవిలలో భాగంగా బ్యాంకులు కూడా మైక్రో ఏటిఎంలను పాసు మిషన్లను ప్రవేశ పెడుతున్నాయని ఆమె తెలిపారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఒక్కొక్కరు ముఖ్యమైన ఐదుగురు లేదా సంస్థలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే రంగాలలో ముందుగా ఈ విధానాన్ని అమలు చేయాలని తరువాత దశల వారిగా దీనిని అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. పౌర సరఫరాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కిరాణం షాపులు, చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారు కూరగాయలు, పాలు తదితర రంగాలలో ఎంపిక చేయాలని ఆమె సూచించారు. నగదు రహీత లావాదేవిలలో భాగంగా క్రెడిడ్, డెవిడ్ కార్డులను వినియోగించాలని, అందరికి బ్యాంకు ఖాతలు ఉండేలా బ్యాంకులు కూడా ఖాతలను ఎక్కువ చేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు.

కరెంట్ షాక్‌తో రైతు మృతి
కోస్గి, నవంబర్ 28: విద్యుత్ వైర్లు సరిచేయబోయి ఓ రైతు మృతి చెందిన సంఘటన సోమవారం కోస్గి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గుమాల్ గ్రామానికి చెందిన నారాయణ(28) తన పొలంలో వేరుశనగ పంటను సాగుచేశాడు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కొనసాగుతున్న పనులలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఈ సంఘటన జరిగి వారం రోజులు అయినప్పటికిని ఎవరు పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల పొలాలకు చెందిన మరికొంత మంది రైతుల సహయంతో విద్యుత్ స్తంబం, వైర్లు సమకూర్చుకుని వైర్లు బిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే గల హైటెన్షన్ వైర్ల వల్ల విద్యుత్ షాక్‌కు గురై రైతు నారాయణ స్తంబంపై నుండి పడిపోయాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు, తోటి రైతులు కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆప్పటికే నారాయణ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. దాంతో కోపోదృక్తులైనా నారాయణ శవంతో రోడ్డు విస్తరణ పనుల కాంట్రాక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కోస్గి పోలీసులు జోక్యం చేసుకుని మృతుడి తండ్రి నర్సప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పూలేకు నివాళ్లు అర్పించిన అధికారులు
వీపనగండ్ల, నవంబర్28: మహాత్మాజ్యోతిరావుపూలే 126వ వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ సుధాకర్‌లాల్, డిఆర్‌డివో వెంకటయ్యగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి బైరెడ్డి సింగారెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి సింగారెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావుపూలే జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి, ఆయనను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.

కొనసాగుతున్న హాకీ క్రీడలు
కొడంగల్, నవంబర్ 28: కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు అట్టహసంగా కొనసాగుతున్నాయి. హాకీ జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం పోటీలను లాంచనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని పోటీ పడుతున్నారు. ఈ క్రీడలు 29వ తేది వరకు కొనసాగుతాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని ఎంపిక చేసి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక చేస్తారు.

విందులో పాల్గొన్న సిఎం కెసిఆర్
మక్తల్, నవంబర్ 28: మండల కేంద్రంలోని మక్తల్ పట్టణంలో సోమవా రం జరిగిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తనయుడు చిట్టెం చాణిక్యరెడ్డి, అనుషల పెళ్లి రిస్సెప్షెన్ వేడుకలకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుఅనంతరం జరిగిన విందులో పాల్గొన్నారు. రిస్సెప్షెన్ వేదిక వద్ద నూతన వధూవరులను ఆశీర్వదించిన సిఎం కెసిఆర్ అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో నేరుగా ఎమ్మెల్యే చిట్టెం నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో సిఎం కెసిఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి సతీమణి చిట్టెం సుచరితారెడ్డి బందువులు విందులో పాల్గొన్నారు. అనంతరం సిఎం కెసిఆర్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఇంటి నుండి నేరుగా హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లారు.

ఖాతాదారులకు మెరుగైన సేవలు
ఆంధ్రాభ్యాంకు జోనల్ మేనేజర్ లీలాధర్
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 28: రూ.1000,500నోట్ల రద్దు వల్ల ప్రజ లు, ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆంధ్రాబ్యాంకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ లీలాధర్ అన్నారు. సోమవారం ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంద్రాబ్యాం కు సేవలు 1923వ సంవత్సరంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బోగరాజు, పట్టాబిసీతారామయ్య గారిచే గ్రామీణాబివృద్ధే ప్రాథమిక లక్ష్యం గా స్థాపించడం జరిగిందన్నారు. నేడు ఆంధ్రాబ్యాంకులో రూ.3.30 కోట్ల వ్యాపారంతో దేశ ప్రజల అవసరాలను తీరుస్తూ 2841శాఖలు, 3778 ఎటిఎంలు, 20 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించబడి రెండు కోట్ల ఖాతాదారులకు సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. గత 94 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తూ ప్రొత్సహిస్తున్న ప్రజలు, ఖాతాదారులందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్‌ఎస్‌ఎన్‌రెడ్డి, చీఫ్ మేనేజర్లు పరందాములు, శ్యాములు, మనిక్యరావు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కుమారుని రిస్సెప్షెన్ వేడుక
మక్తల్, నవంబర్ 28: మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డి కుమారుని రిస్సెప్షెన్ వేడుక ఘనం గా జరిగింది. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని నారాయణపేటకు వెళ్లే క్రాస్‌రోడ్డువద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి కుమారుడైన చిట్టెం చాణిక్యరెడ్డి, అనుషల పెళ్లి రిస్సెప్షెన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో చేరుకోగానే జిల్లా మంత్రు లు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపి జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపి మంద జగన్నాథం, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, డిఐజి అకున్ సబర్వాల్, ఎస్పీ రేమా రాజేశ్వరీ, మార్కెట్ చైర్మన్ పి.నర్సింహగౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక బస్సులో పెళ్లి రిస్సెప్షెన్ మండపం వద్దకు చేరుకున్నా రు. అక్కడ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆయ న సతీమణి చిట్టెం సుచరితలు సిఎం కెసిఆర్‌కు ఘనస్వాగతం పలికి వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదిక వద్దకు చేరుకున్న సిఎం కెసిఆర్ నూతన వదువరులైన చిట్టెం చాణిక్యరెడ్డి, అనుషలకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. చిట్టెం కుటుంబ సభ్యులతోపాటు పెళ్లికూతురు అనుష బందువులతోను కలసి సిఎం కెసిఆర్ ఫోటోలు దిగారు. అనంతరం రిస్సెప్షెన్ వేడుకకు హాజరైన ప్రజలకు రెండు చేతులతో నమస్కరించి అభివాదం చేశారు.
నూతన వదువరులు సిఎం కెసిఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కెసిఆర్ రాక సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరితో పాటు డిజిపి అకున్ సబర్వాల్ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

బిజెపి నాయకుల అరెస్ట్‌కు నిరసనగా రాస్తారోకో
ధన్వాడ, నవంబర్ 28: నారాయణపేట డివిజన్ కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్ర, జిల్లా,మండల నాయకులను పోలీసులు అరెస్ట్‌కు నిరసనగా సోమవారం మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో మరికల్ మండల బిజెపి అధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భం గా మరికల్ మండల బిజెపి అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మఖ్తల్ మండల కేంద్రంకు వస్తు న్న సందర్భంగా పోలీసులు బిజెపి నాయకులను ఆరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆరెస్టు చేసిన నాగూరావునామాజి, రతంగ్‌పాండ్‌లతోపాటు పేట డివిజన్ బిజెపి నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయనప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విడుదల చేయానియాడల బిజెపి అధ్వర్యం లో ఆందోళన కార్యక్రమంను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇందిరాగాంధీ చౌరస్తాలో బిజెపి నాయకులు రాస్తారోకో చేయడంతో మహబూబ్‌నగర్-రాయిచూర్‌కు వేళ్లే వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో మరికల్ పోలీసులు రాస్తారోకో వద్దకు చేరుకున్నారు. బిజెపి నాయకులను ఆరెస్ట్ చేసినవారిని విడుదల చేసేవరకు రోడ్డుపైనుండి కదిలేదేలేదని బైటాయించండంతో మరికల్ పోలీసులు రోడ్డుపై కుర్చున్న ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

నల్లధనం వెలికితీయడంలో మోదీ విఫలం
నాగర్‌కర్నూల్, నవంబర్ 28: పెద్దనోట్లను రద్దు చేసి సామాన్య, మధ్య తరగతి జనానికి ఇబ్బంది పెట్టారే తప్పనల్లధనం వెలికి తీయడంలో మోదీ విఫలమయ్యారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లధనం వెలికితీయడానికి పెద్దనోట్లు రద్దు చేసి కేంద్రం ముందుగా కార్పోరేట్ సంస్థల ఆస్తులపై విచారణ కమిటీలను వేయాలని డిమాండ్ చేశారు. వందరోజుల్లో నల్లధనం వెలికితీస్తానని ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి రెండున్నరఏళ్లు కావస్తున్న ఆ పని చేయలేక, తప్పుడు నిర్ణయాలలో ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మణెమ్మ, ఎంపిపి శాంతమ్మ, సిపిఎం నాయకులు రామయ్య, నవీన్, మధు, వైకాపా నేతలు జిల్లా అధ్యక్షులు భగవంత్‌రెడ్డి, శేఖర్, గోపాల్, ప్రజా సంఘాల నాయకులు శివ, కుర్మయ్య, కౌన్సిలర్ కావలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి భరత్, సిపిఐ నాయకులు వంకేశ్వరం శ్రీనివాసులు, పి.స్వామి, ఖాజా, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు కృష్ణ, నిరంజన్, ధర్మయ్య, శివ, శేఖర్ పాల్గొన్నారు.

ఘనంగా పూలే వర్ధంతి
ఊట్కూర్, నవంబర్ 28: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి 126వ వర్ధంతి సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జోగిని వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వినర్ హజమ్మ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే మహరాష్టల్రోని సితార్ జిల్లాలో ఏప్రిల్ 11,1827న జన్మించి నవంబర్ 28-1890లో మరణించారని అన్నారు. జ్యోతిరావు పూలే బలుగు బలహీన వర్గాల చైతన్యం కోసం అక్షరాస్యత కోసం, సాంఘీక దూరాచారాల నిర్మూలన కోసం, కులవివక్షత నిర్మూలన కోరకు ఎంతో కృషి చేశారని ఆమె తెలిపారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. విద్య లేనివారు సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోలేరని ఆమె అన్నారు. అంజనేయులు, నారాయణ, బాలప్ప, అంజప్ప, వెంకటయ్య, నర్సిములు, శంకర్, ప్రకాష్, సాయిలు, తదితరలు పాల్గొన్నారు.
విపక్షాల బంద్ విఫలం