మహబూబ్‌నగర్

భూ నిర్వాసితులైన రైతులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాజిపేట, డిసెంబర్ 2: వట్టెం రిజర్వాయర్‌లో భూములు కోల్పొతున్న పోతిరెడ్డిపల్లి గ్రామ రైతులకు న్యాయం చేస్తామని, రెండునెలల్లో పరిహారం చెల్లిస్తామని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వెంకయ్యపల్లి గ్రామ శివారులో గల బిజిఆర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో భూములు కోల్పొతున్న రైతులతో సమావేశమయ్యారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని, ఎవ్వరు కూడా ఆందోళన పడవద్దన్నారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేందుకు రైతులు సహకరించాలన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త జివో ప్రకారం నష్టపరిహారం అందిస్తామన్నారు. బ్లాస్టింగ్‌లతో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడి బ్లాస్టింగ్‌ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఇన్‌చార్జీ తహశిల్దార్ నుస్రత్ సుల్తానా, సర్పంచ్ రుక్కమ్మ, నాయకులు జెట్టి వెంకటేశ్, వేణుగోపాల్‌గౌడ్, జైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.