మహబూబ్‌నగర్

రైతు ప్రయోజనం కోసం తక్కువ ఫ్రీమియంతో అధిక భీమా సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 2: భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రైతు ప్రయోజనాల కోసం తక్కువ ప్రిమియంతో అధిక భీమా మొత్తం రైతులు పొందడానికి పంటల భీమా పథకం రైతులు సక్రమంగా వినియోగించుకోవడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో పంటల భీమా పథకంపై వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ రైతులకు పంటల భీమా పథకం కింద పేర్కొన విపత్తులకు భీమా సౌకర్యం ఉంటుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఖరీఫ్ 2016 నుండి ప్రతిష్టాత్మకంగా నమోదు చేయుటకు ప్రధానమంత్రి ఫసల్‌భీమా యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వేరుశనగ పంట రైతులకు చెల్లించాల్సిన ప్రిమియం ఎకరాకు రూ.270 భీమా మొత్తం రూ.18000 ఉంటుందనని అలాగే శనగకు రూ.210 పొద్దుతిరుగుడుకు రూ.195 జూన్నకు రూ.150 వరికి రూ.420ల ఫ్రిమియం చెల్లించాల్సి ఉంటుందని ఎకరా శనగకు రూ.14000 జొన్నకు రూ.10000 పొద్దుతిరుగుడుకు రూ.13000 వరికి 28000 భీమా పొందే అవకాశం ఉందన్నారు. రైతు ఫ్రిమియం కట్టాల్సిన ఆఖరు తేదీ డిసెంబర్ 31 అయినందునా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించి భీమా కంపెనీ వారికి జనవరి 15వ తేదీలోపు భీమా చేసిన డిడిలు సంబంధిత పత్రాలను భీమా కంపెనీలకు పంపాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ప్రీ నంబర్‌కు సంప్రదించే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించిందని ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాలని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 150 తేదీలోగా శనగ, మొక్కజొన్న, వేరుశనగ పంటలు వేసుకున్న రైతుల జాబితా మండల, గ్రామాల వారిగా తయారు చేసి పంటలకు సంబందించిన ఎరువులు, క్రిమికీటకాల బారిన పడకుండా రైతులకు తగిన మెలువకులు తెలియజేయాల్సన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని అన్నారు. గ్రామాల్లో విసృత్తంగా ప్రచారం చేయాలని తెలిపారు. జిల్లాలోని 26 మండలాల్లోని 500 గ్రామాల రైతులకు పూర్తి సమాచారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కిషాన్ క్రెడీట్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గౌతం, వ్యవసాయశాఖ అధికారిణి సూచిత్ర తదితరులు పాల్గొన్నారు.