మహబూబ్‌నగర్

మద్దతు ధరతో కందులు కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, డిసెంబర్15: మదనాపురం మార్కె ట్ యార్డులో గురువారం మార్కెట్ చైర్మన్ రాజేశ్వరమ్మ కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మదనాపురం మార్కెట్ యార్డులో మొట్టమొదటి సారిగా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ఇవి రైతులకు ఎంతో దోహదపడుతుందని క్వింటాల్‌కు రూ.5,050 ధర ఉందని దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్ యార్డులో కందులను విక్రయించాలన్నారు. ప్రభుత్వం రైతులకు బరోసానిస్తూ వారి స ంక్షేమం కోసం పాటుపడుతుందని ఆమె అ న్నారు. ఎపిఎం విజయభాస్కర్, నారాయణ, శ్రీ నివాస్, విండో చైర్మన్లు రావుల సురేంద్రనాథ్‌రెడ్డి, గినె్న శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచు భాగ్యమ్మ, ఎంపిటిసి వెంకట్‌నారాయణ, నాయకులు భీంరెడ్డి, ప్రశాంత్, కటికెశ్రీను, రామన్‌గౌడ్, మోహన్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలకృష్ణ, జగదీష్, సాయులు తదితరులు పాల్గొన్నారు.
నర్వలో..
నర్వ: గ్రామల్లో పండించిన కందులను కొనుగోలును ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌లో ప్ర భుత్వం మద్దతు ధరకు విక్రయించాలని మార్కెట్ కమిటి చైర్మన్ శేఖర్ యాదవ్ అన్నారు. గురువారం మండలంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కందికి క్వింటాల్‌కు రూ.5.050లు కొనుగోలు చేస్తుందని, 11శాతం ఎండిన కందులను మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.
అదే విధంగా రైతులు తమ పట్టపాసుపుస్తకంతో బ్యాంకు అకౌంట్ బుక్‌ను తీసుకొస్తే 5 రోజుల్లో రైతు ఖాతలో డబ్బులను జమ చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామాల్లో దళారుల వద్ద కందులు విక్రయించి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు.

పేట ఆసుపత్రికి
రూ.1.70కోట్ల
నారాయణపేటటౌన్, డిసెంబర్ 15: నారాయణపేట ఏరియా ఆసుపత్రి అభివృద్దికి అన్నీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. గురువారం ఆయన నారాయణపేటలో విలేకరులతో మాట్లాడుతూ గత 2015వ సంవత్సరంలో ఆసుపత్రి భవనాన్ని సుందరీకరించేందుకు రూ. 1.70 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందని, అయితే గడువు దాటిపోవంతో ఖర్చులు పెరిగిన దృష్ట్యా మరోమారు ప్రతిపాదనలు సిద్దం చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో మాడల్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఇందుకు సంబందించి పర్యవేక్షించేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.