మహబూబ్‌నగర్

పేదల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రనుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందని అందులో భాగంగానే క్రైస్తవుల్లో ఉన్న పేద ప్రజలందరికి ప్రభుత్వం తరపున బట్టలను పంపిణీ చేస్తున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని ఎంబిపి హైస్కూల్‌లో సేమీ క్రిస్మస్‌వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కేక్‌ను కట్‌చేసి విద్యార్థులకు తినిపించారు. అక్కడే ఉన్న ఫాస్టర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా చిన్నారులకు సైతం దుస్తువులను పంపిణీ చేసిన అనంతరం అక్కడే పేదల కోసం ఒక రోజు భోజనాన్ని యాచకులకు, వికలాంగులకు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి స్వయంగా వడ్డించారు. వారు తినేవరకు అక్కడి నుండి వెళ్లకపోవడంతో కొందరు యాచక మహిళలు, పుట్‌పాత్‌పై నిత్యం జీవనం గడుపుతున్నవారు వచ్చి ఎమ్మెల్యే కడుపునిండా బోజనం పెట్టావ్ చ ల్లగా ఉండూ అంటుంటే ఎమ్మెల్యే ఆశ్చర్యానకి గురయ్యారు. ఓ వృద్దురాలని ఆపి ఇంతమంచి బోజనం తిని ఎన్ని రోజులు అయిందని అడిగితే రెండు నె లలు అయిందని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా పేదలకు ఇలాంటి వారు ఇంకా సమాజంలో ఉన్నారని చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని ప్రసుత్తం క్రైస్తవులకు అత్యంత ఆరాదించే క్రిస్మస్ పండుగ అని ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అందరిలా ఈ మతస్తులను గౌరవించిందని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో దాదాపు రెండువేల పేద మహిళలకు చీరలు ఇవ్వడం జరిగిందని పేద క్రైస్తవులకు తమ ప్రభుత్వం చేయూతనిచ్చిందని అన్నారు. పట్టణంలో క్రైస్తవులకు స్మశానవాటిక ఇబ్బందిగా ఉందని ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని మతాల వారిగానే క్రైస్తవులకు సైతం దా దాపు మూడు ఎకరాల స్మశానవాటికను కేటాయించడం జరిగిందన్నారు. తమ ముఖ్యమంత్రి నిరంతరం పేదల గురింజచే ఆలోచిస్తుంటాడని రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి పథకం మైనారిటి వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అందులో క్రైస్తవులు కూడా జిల్లాలో చాలా మంది ల బ్దిపొందారని తెలిపారు. క్రిస్టియన్లు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పండుగకు కోట్ల రూపాయాలు కేటాయించిందని తెలిపారు. క్రైస్తవులు ప్రభుత్వ పథకాలను సద్వీనియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో మంచినీటి సమస్యను శాశ్వితంగా దూరంగా చేయడానికి మిషన్ భగీరథను మహబూబ్‌నగర్‌కే అ త్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వచ్చే సంవత్సరం పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీరు వచ్చేలా కృషి చేయడం జరుగుతుందని వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండుగ నాటికి మంచినీటి సమస్య ఉండదన్నారు. డిఆర్‌ఓ భాస్కర్, చర్చిల ఫాస్టర్లు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను అడ్డుకుంటే గుణపాఠమే

పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 18: రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని చంద్రకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు 9 గంటల విద్యుత్‌ను, సాగునీరు ఇప్పటికే రైతాంగానికి అందించామని, వచ్చే మే, జూన్ మాసాలలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయడంతో బిజెపి నాయకులు నాగం జనార్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డిలు కోర్టులో పిటిషన్ వేసి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రజలు సహించరని అన్నారు. పిఆర్‌ఎల్‌ఐలో 10లక్షల ఎకరాలకు సాగునీరు, కెఎల్‌ఐ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే, ఇట్టి నీరు రాకుండా అడ్డుకునే వారికి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్నీ ఆటంకాలేనని, ఇప్పుడు కూడా సీమాంధ్ర పార్టీలో ఉంటూ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రకాల పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని నాగంకు ఉస్మానియా యూనివర్సీటీలో విద్యార్థులు ఏవిధంగా బుద్ది చెప్పారో, అదేవిధంగా ప్రాజెక్టులకు అడ్డు తగిలేవారికి పాలమూరు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. ఎంజికెఎల్‌ఐ ప్రాజెక్టు వచ్చిందంటే టిఆర్‌ఎస్ పుణ్యమేనని అన్నారు. చంద్రకల్, ముష్టిపల్లి, మరికల్, ఆదిరాల, పెద్దకొత్తపల్లి గ్రామాలలో మంత్రి పర్యటించారు. అనంతరం కల్వకోలు గ్రామం లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పొయిన 22 మంది రైతులకు రూ.1,60,52,500 విలువ చేసే చెక్కులను అందచేశారు. 12ఏళ్లుగా స్పెర్ఫ్‌లో ఎన్‌పిఎంలో పని చేస్తున్న 650 మందిని రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌లో తొలగించిందని, తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బాల్ వెంకటయ్య, కార్యదర్శి షఫీ తదితరులు మంత్రికి వినతిపత్రాన్ని ఇచ్చారు. మంత్రి వారితో మాట్లాడుతూ ఈ విషయంపై సిఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపిపి వెంకటేశ్వరరావు, జడ్పీటిసి వెంకటయ్య, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విష్ణు, పాల్గొన్నారు