మహబూబ్‌నగర్

కరివేనా రిజర్వాయర్ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించాక ముఖ్యమంత్రి మానసపుత్రికగా చెప్పుకునే వాటిలో ఒకటైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అయితే ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆరోపణలు, అడ్డంకులు వస్తున్నప్పటికిని ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతుంది. పాలమూరు ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ఉందనే దానికి ఈ ప్రాజెక్టు పరిధిలోని కరివెనా రిజర్వాయర్ పనులు ప్రారంభించిన కొద్దిరోజులకే పురోగతి కనబడుతుంది. పాలమూరు ప్రాజెక్టులో దాదాపు ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేకాకా అందుకు సంబందించిన భూసేకరణకు దాదాపు రూ.620 కోట్లు కేటాయించడం అందులో నేటి వరకు డిఆర్‌ఓ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం రూ.605 కోట్లు ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతాంగానికి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం జరిగిందని అందుకు సంబందించిన చెక్కులు రైతుల ఖాతాలో పడ్డాయని తెలిపారు. దినిని బట్టి చూస్తే రెండేళ్లలో రెండు మూడు రిజర్వాయర్లను పూర్తి చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాజలాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తుందని చెప్పవచ్చు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని కరివెనా రిజర్వాయర్ పనులు వేగవంతంగా పుంజుకున్నాయి. ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యేతో పాటు పలువురు టిఆర్‌ఎస్ నాయకులు కరివెనా రిజర్వాయర్ పనులు ఎలా జరుగుతున్నాయని పరిశీలించారు. రిజర్వాయర్‌కు వచ్చే కాలువల పనులు వేగవంతం జరుగుతున్న నేపథ్యంతో రెండేళ్ల లోపు నియోజకవర్గంలోని భూత్పూర్, అడ్డాకుల, ముసాపేట, మహబూబ్‌నగర్ నియోజకవర్గంతో పాటు జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్‌కు సైతం కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో వస్తాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అయితే వచ్చే ఖరీఫ్ నాటికి మాత్రం కొంత ఆయకట్టు సాగునీరు వచ్చేలా పనులు చేయిస్తామని కూడా ఆయన అన్నారు. కరివెనా రిజర్వాయర్‌కు సంబందించి దాదాపు 2500 ఎకరాలకు పైగా భూ సేకరణ సైతం పూర్తి కావడంతో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ప్రభుత్వం మాత్రం ఈ రిజర్వాయర్‌ను త్వరితగతినా పూర్తి చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం పురోగతిపై ప్రజలకు వివరించాలని చూస్తోంది. అయితే భూ సేకరణ విషయంలో విపక్షాలు ఓ సందర్భంగా కొన్ని ఆటంకాలు సృష్టించినప్పటికిని ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం రైతులను సముదాయించడంలో పురోగతి సాధించారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్ర స్తుతం జరుగుతున్న పనులు వేగవంతగా కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ పనులను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేతో పాటు పలువురు టిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేకంగా తరుచూ సంబందిత కాంట్రాక్టతో సంప్రదిస్తూ పనులు వేగవంతం చేసేలా అధికారులను సైతం ఎమ్మెల్యే పురమాయిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివేనా రిజర్వాయర్ పనుల వేగవంతంతో ఈ ప్రాంత రైతాంగంలో సైతం తమ పొలాలకు రెండేళ్లలోపు సాగునీరు వస్తుందని కొడంత ఆశతో ఉన్నారు. కానీ వచ్చే ఖరీఫ్‌కే సాగునీరు వచ్చేలా పనులు చేయిస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం ఇటీవల కలెక్టర్ల సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల పనుల విషయంపై జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో ప్రత్యేకంగా చర్చించారు. తాను శంకుస్థాపన చేసిన కరివేనా రిజర్వాయర్ పనులు ఏ మేరకు వచ్చాయని కూడా సిఎం ఆరా తీయడంతో ఆదివారం ఎమ్మెల్యే పనులను పరిశీలించి ఈ విషయాన్ని అక్కడ ఉన్న అధికారులకు తెలియజేశారు. సిఎం కెసిఆర్ ఈ రిజర్వాయర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అధికారులు కరివేనా రిజర్వాయర్ పనులు మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.