మహబూబ్‌నగర్

గుర్తుతెలియని వాహనం ఢీ :గొర్రెల కాపరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, డిసెంమర్ 19: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో గొర్లకాపరి మృతి చెందిన సంఘటన మక్తల్ మండలం తిర్మలాపూర్ గ్రామ సివారులో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఎఎస్‌ఐ గోపాల్‌నాయక్ కథనం ప్రకారం వివలారు ఇలా ఉన్నాయి. చందాపూర్ గ్రామానికి చెందిన కుర్వ తాయప్ప (45) అనే గొర్రెల కాపరి మాగనూర్ మండలం నుండి కాలినడకన స్వగ్రామానికి వస్తున్నారు. వెనుకనుండి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లడంతో గొర్లకాపరి కుర్వ లింగప్ప శవం ముక్కలు ముక్కలుగా రోడ్డుపై పడిందని ఎఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య,కూతురు, కుమారులు, ఉన్నట్లు తెలిపారు. మృతుని భార్య పార్వతమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శివుడికి టిఆర్‌ఎస్ క్షీరాభిషేకం
నారాయణపేటటౌన్, డిసెంబర్ 19: పార్లమెంట్ సభ్యుడు ఎపి జితేందర్‌రెడ్డి 35వ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని టిఆర్‌ఎస్ మాజీ నియోజకవర్గ ఇంచార్జి నాగరాజ్ సరాఫ్ నేతృత్వంలో బారంబావి శివాలయంలో క్షీరాభిషేకం చేపట్టారు. సోమవారం ఉదయం స్థానిక బారంబావి శివాలయంలో రుధ్రాభిషేకం నిర్వహించి క్షీరాభిషేకం చేపట్టి ప్రత్యేక అలంకరణలు చేపట్టి, అర్చన, మహా మంగళహారతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఎంపి జితేందర్‌రెడ్డి దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టిఆర్‌ఎస్ శ్రేణులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు మారుతి, కనె్న జగదీశ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీహరి, భగవంతు, శ్రీహరి, జి.నారాయణ, కాకర్ల భీమయ్య, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ శే్వతా మహంతి
వనపర్తి, డిసెంబర్19: ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 136 పిర్యాదులు కలెక్టర్‌కు సమర్పించారు. పిర్యాదులను స్వీకరించడంతో పాటు తక్షణమే సంబంధిత అధికారులను తన వద్దకు పిలిపించుకొని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం స్వీకరించిన పిర్యాదుల్లో ఎక్కువగా రెవిన్యూ, పింఛన్లు, సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై కూడా దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిరంజన్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.