మహబూబ్‌నగర్

అ.ని.శా వలలో ఏఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబబూనగర్, డిసెంబర్ 22: జిల్లాలో తరచూ ఏసిబి దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరో అవినీతి చేప ఏసిబికి దొరికిపోయింది. ఓ రైతు నుండి రూ.15వేలు లం చం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసిబి అధికారులు పట్టుకుని ట్రాన్స్‌కో ఉద్యోగిని కటకటలాలకు ప ంపారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని అవంతి హోటల్‌లో రైతు నుండి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నవాబుపేట మండలానికి చెందిన ట్రాన్స్‌కో ఏఇ ఆశిర్వాదం ఏసిబి వలలో చిక్కారు. నవాబుపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే రైతు తమ వ్యవసాయ పొలాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు బిగించమని ట్రాన్స్‌కో ఏఇ ఆశీర్వాదంను విజ్ఞప్తి చేశా రు. అయితే గత పదిహేను రోజుల నుండి ట్రాన్స్‌కో ఏఇ ఆశీర్వాదం ట్రాన్స్‌ఫార్మర్లు బిగించకుండా రూ.20వేల లం చం అడిగాడు. గత రెండు మూడురోజుల క్రితం తన దగ్గర రూ.20వేలు లేవని రూ.15వేలను ఇస్తానని రైతు ప్రవీణ్ ఏఇకి తెలిపారు. అందుకు అంగికారం తెలిపిన ఏ ఇ గురువారం డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే రైతు ప్రవీణ్ మాత్రం ట్రాన్స్‌ఫార్మర్ బిగించిన రెండు మూడు రోజులకు డబ్బులు ఇస్తామని చెప్పాడు. డబ్బులు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తానని కరాఖండిగా ఏఇ ఆశీర్వాదం తెల్చి చెప్పడంతో రైతు ప్రవీణ్ ఏకంగా ఏసిబి అధికారులను ఆశ్రయించారు. ఏసిబి అధికారులకు సమాచారం అందడంతో పథకం ప్రకారంగా మహబూబ్‌నగర్‌లోని అవంతి హోటల్‌లో ప్రవీణ్ నుండి ట్రాన్స్‌కో ఏఇ ఆశీర్వాదం రూ.15వేల లంచం తీసుకుంటుండగా ఏసీబి మహబూబ్‌నగర్ రేంజ్ డిఎస్పీ రాందాస్‌తేజ్ దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా ఏసిబి అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో సైతం ఏఇ ఆశిర్వాదం తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఏసిబి అధికారులు ఆయనను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ట్రాన్స్‌కో ఏఇ ఆశీర్వాదంను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసిబి డిఎస్పీ రాందాస్‌తేజ్ వెల్లడించారు. నవాబుపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ నుండి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ట్రాన్స్‌కో ఏఇ ఆశిర్వాదంను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డిఎస్పీ రాందాస్ తేజ్ తెలిపారు.సఐ గోదాములు హమాలీలుగా పని చేస్తామని వారితో చెప్పడంతో అందుకు నిరాకరించారు. మదానపురం గ్రామానికి చెందిన యువకులు వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, హైద్రాబాద్ ప్రాంతాలకు వెళ్లి హమాలీలుగా పని చేస్తున్నారని, స్వంత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదాములో మాత్రమే అవకాశమివ్వాలని కోరారు. ఈ వివాదంతో మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. గురువారం ఇరు గ్రామాల హమాలీలను పిలిచి పెద్దలు పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీ మరో రెండు రోజులు పడుతుందని గ్రామస్తులు తెలిపారు. ధాన్యం తెచ్చిన రైతులు మాత్రంత ఇప్పటికే మూడురోజులు కావస్తున్నా హమాలీల సమస్యతో తమకు పెట్టుబడులు బారమయ్యాయని రైతులు వాపోయారు.