మహబూబ్‌నగర్

నల్లమల తెల్లపొడ పశువులు జిల్లాకే గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, డిసెంబర్ 27: నల్లమల ప్రాంతంలోని వివిధ మండలాలలో అత్యధికంగా ఉన్న తెల్లపొడ పశువుల ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాకే ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ఈ జాతి ఆవులను, దూడలను కాపాడుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ది సాధించాలని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని బికె లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి పురాతన ఆలయం వద్ద వాసన్, కోనేరు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తూర్పు జాతి పశువుల రాష్ట్ర స్థాయి మేళకు జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జాతి గిత్తల ద్వారా ఆ జిల్లాకు దేశవ్యాప్త గుర్తింపుతోపాటు అక్కడి రైతులు ఆర్థికంగా ఎంతో అభివృద్ది చెందారని అన్నారు. తూర్పు జాతి పశువుల ద్వారా కూడా ఈ ప్రాంతానికి కూడా అలాంటి గుర్తింపు, ఆదాయం వస్తుందన్నారు. ఈ పశువులు వర్షాలు వచ్చే విషయాన్ని ముందే పసిగట్టడంతోపాటు క్రూర మృగాల దాడుల నుంచి కూడా తప్పించుకోగలవనే విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇలాంటి పశువులను పెంచుతున్న రైతులు ధన్యులని, మరింత జాగ్రత్తగా పశుసంపదను అభివృద్ది చేసుకోవాలన్నారు. దే శంలో ఆవుల జాతి ఉన్న పటంలో నల్లమల ప్రాం తం కూడా ఉంటుందని, ఇందుకు ఇక్కడి రైతులు అభినందనీయులని కలెక్టర్ కొనియాడారు. పశుసంవర్ధక శాఖ నుంచి అధికారులు అన్నీ చర్యలు తీసుకుంటారని రైతులకు హామి ఇచ్చారు.
తూర్పుజాతి గిత్త బ్రీడు కోసం కృషి
నల్లమల తూర్పుజాతి గిత్త బ్రీడుకోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలంగాణ జీవ వైవిద్య మండలి కార్యదర్శి డాక్టర్ సువర్ణ తెలిపారు.
రాష్ట్రం విడిపోయిన తరువాత ఒంగోలు గిత్త తరహాలోనే ఈ ప్రా ంతంలో ఎంతో అందంగా తెల్లపొడలు, చిన్న గిట్టే లు కలిగి ఆహారం తక్కువగా తీసుకొని వ్యవసాయ పనులకు ఎక్కువగా ఉపయోగపడే ఈ జాతి పశువులను గుర్తించేందుకు గత రెండేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని లింగాల, అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాలలో ఉన్న వేలాది పశువులను ఇక్కడికి తీసుకొని రావడం సంతోషం కలిగించిందన్నారు. దేశంలోని రాజస్తాన్, కేరళ, కర్ణాటక, గుజరాత్ తరాహాలో తెలంగాణ ప్రభుత్వం సహాయంతో ఈ జాతి పశువులను అభివృద్ది పర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ పశువుల మేళకు దాదాపు రెండువేల పశువులను రైతులు తీసుకొచ్చారు. ఇందులో పశువులు ప్రత్యేకంగా ఉన్న ఏడుమంది రైతులకు ప్రోత్సాహ బహుమతులను చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిద్య మండలి నేషనల్ డైరక్టర్ డాక్టర్ అజనా శర్మ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప, డాక్టర్ సోరన్, వీరోజిరావు, స్థానిక సర్పంచ్ బోడమ్మ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఇంటి స్థలం పరిశీలిన
కల్వకుర్తి, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో శాసన సభ్యునికి అధికార నివాసం నిర్మించాడానికి గత రెండు సంవత్సరాలుగా తదితర స్థలాలను పరిశీలించడం జరుగుతుందని అందులో భాగంగానే మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రకరణ్ తహాశీల్దార్ కార్యాలయంలోని స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సురేంద్రకరణ్ విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంటి నిర్మాణానికి నియోజకవర్గ కేంద్రంలో స్థల ఎంపిక కోసం తదితర స్థలాలను పరిశీలించడం ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేష్‌కుమార్, తహాశీల్దార్ మంజుల, ఆర్‌ఐ నజీర్, విఆర్‌ఓ శశిధర్, మల్లేష్, శ్రీను, పుల్లయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య ఉన్నారు.
కెఎల్‌ఐ సాధనకు అఖిలపక్ష జెఎసి సమావేశం
కల్వకుర్తి, డిసెంబర్ 27: కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం ద్వారా సాగునీరు సా ధించేందుకు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలకు అతీయితంగా పలు పార్టీలకు చెందిన నాయకులు, రైతులు మంగళవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించుకున్నారు. కెఎల్‌ఐ ద్వారా కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఏక గ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. నగర పంచాయితీ చైర్మన్ శ్రీశైలం, గోలి సుదర్శన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రమణరెడ్డి, బాలస్వామిగౌడ్, రాజేందర్, భూపతిరెడ్డి, రామరాజు, జనార్థన్‌రెడ్డి, షాన్‌వాజ్‌ఖాన్, పవన్‌కుమార్‌రెడ్డి, యాదవ్, బంగారయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు.