మహబూబ్‌నగర్

చదువుకు పేదరికం అడ్డుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, డిసెంబర్2: విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని శాగాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ధినపత్రికలను విధిగా చదవాలని దీంతో విద్యార్థులకు పరిజ్ఞానం పొంది మెదోశక్తి పెంపోదించేందుకు ఉపకరిస్తుందన్నారు. గ్రామాలలో మహిళా సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి డిక్షనీరలను చదవడం నేర్చుకోవాలని అన్నారు. నేటి సమాజంలో ప్రతి విద్యార్థి ఆంగ్ల విద్యపై దృష్టి సారించాలని సూచించారు. దేశ రాష్ట్ర నాయకులను ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని ఎంచుకొని ప్రణాళికలు రచించుకొని కష్టపడి చదవాలన్నారు. సమయం వృధా చేయకుండా పరీక్షలకు సన్నదం కావాలని ఆయన సూచించారు. రాజకీయలకు అతీతంగా గ్రామాలలో విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నెలకు ఒకసారి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు ప్రశ్నలను అడిగారు. గణితం, సామాన్య శాస్త్రం, ఇంగ్లీష్ పుస్తకాలను విద్యార్థులతో చదివించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పిటిసి రవికుమార్, విండో వైస్ ఛైర్మన్ భాస్కర్‌యాదవ్, ఎస్‌ఎంసి ఛైర్మన్ కృష్ణ యాదవ్, నాయకులు తిరుపతయ్య సాగర్, బాలరాజు, బాలరాం నాయక్, తిరుపతయ్య, వెంకటేష్, గోపాల్‌రావు, వీరసాగర్, హెచ్‌ఎం అబ్దుల్ కవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత
మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్

మహబూబ్‌నగర్, జనవరి 2: ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, జీవిత లక్ష్యాన్ని పొందడానికి ప్రతి ఒక్క విద్యార్థి ధ్యానం తరగతులకు తప్పక హజరుకావాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. సోమవారం స్థానిక బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ధ్యాన తరగతులకు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని మానసిక ప్రశాంతతకొరకు, ఒత్తిడిని అదిగమించేందుకు ధ్యానం చేయాలని కళాశాల విద్యార్థిలకు సూచించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసిన విద్యార్థినిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విద్యార్థినిలకు కేక్‌ను తినిపించారు. ద్యాన తరగతులకు హజరైన విద్యార్థులకు సి ఈ సి రెండవ సంవత్సరం చదువుతున్న శిరీష, ఆశ్వినిలను కలెక్టర్ ద్యాన తరగతులలో పాల్గొన్న మీకు ఎలాంటి అనుభూతి కలిగిందని అడగగా, విద్యార్థినిలు మాకు ఎలాంటి బయట ఆలోచనలు రాలేదని, మనస్సు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉందని కలెక్టర్‌కు వివరించారు. కళాశాలకు తాగునీటి వసతి కోసం 5వేల లీటర్ల ట్యాంకును మంజూరు కొరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే మూత్రశాలలు, ఇతర వౌళిక వసతులపై కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృడత్వం, ప్రశాంతత కోసం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.