మహబూబ్‌నగర్

వ్యాధుల పట్ల అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్‌టౌన్, జనవరి 6: ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అధికారులు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ ఆదేశించారు. జిల్లాలో ఒక వ్యక్తి స్వైన్‌ప్లూ వ్యాధి సోకిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత వ్యక్తికి ఈ వ్యాధి హైదరాబాద్ నుంచి సోకినట్లు విచారణలో తెలిసిందని, అతని కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల, నగరంలో పరీక్షలు నిర్వహించగా వారికి ఎవరికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నారు. ముందుగా జాగ్రత్త చర్యగా మరింత లోతుగా విచారణ జరపటానికి అరుగురు చొప్పున 23 టీములను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు కూడా వివరిస్తామన్నారు. జిల్లా అంతటా మున్సిపాలిటీలను, మేజర్ గ్రామ పంచాయతీలలోను, ఆస్పత్రులలోను అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఎక్కడ కూడా చెత్త చెదారం, అసహ్యకర వాతావరణం లేకుండా వీధులన్నీ శుభ్రం చేయించాలన్నారు. వీధులలో, మురుగు కాలువలలో బ్లీచింగ్ పౌడర్లు చల్లాలని సూచించారు. వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరు ఈ విషయంలో గాభరా పడవలసిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ స్థాయి అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుధాకర్‌లాల్,డిసిహెచ్ ఎస్ మాలతి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘రైతు బంధు’ సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ శే్వతా మహంతి
వనపర్తి, జనవరి 6: రైతు బందు పథకం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రైతు బందు పథకంపై వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యదర్శులు, తహశీల్ధార్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు బందు పథకం ద్వారా పండించిన మొత్తం పంట ఉత్పత్తులలో 75శాతం విలువను రుణంగా పొందవచ్చునని, 48 గంటల్లో ఈ రుణ సౌకర్యం అందుతుందని, రైతు పంటను నిల్వ చేసుకొని తనకు ఇష్టం వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చునని తెలిపారు. 180 రోజుల వరకు పంటను నిల్వ చేసుకోవచ్చునని ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని తరువాత చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ముందుగా కంది రైతులందరికి రైతు బందు పథకంపై సమాచారం అందించాలని కలెక్టర్ అధికారులను సూచించారు.
జిల్లాలో సుమారు 8,340 మంది రైతులు ఉన్నారని రైతు బందు పథకం కింద వీరందరిని కవర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రైతు బందు పథకం కింద కవరైన రైతులు తక్కువగా ఉన్నారని ముందుగా ఈ పథకంపై గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలని, ఇందుకుగాను గ్రామాలలో టాంటాం వేయించాలని సూచించారు. అందరూ రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకునేలా గ్రామాల వారిగా సమాచారం సేకరించాలని రైతు పేరు, బ్యాంకు ఖాత నెంబర్, పట్టాదారు పాసుపుస్తకం ప్రతి, ఫోటోలు, విఆర్‌ఓలు ఈ సమాచారాన్ని మార్కెట్ కార్యదర్శులకు పంపించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఎన్ని రైతు బందు కార్డులు జారీ అయ్యింది సంబందిత వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జనవరి 20 నాటికి ఈ పథకం కింద రైతులందరికి రైతు బందు కార్డులు అందజేయాలని ఆదేశించారు. నగదు రహీత లావాదేవిలపై కలెక్టర్ మాట్లాడుతూ తహశీల్దార్లు గ్రామాల వారిగా జనాభా లేక్కల ఆధారంగా అందరి సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఆధార్, బ్యాంకు ఖాత, మోబైల్ నెంబర్‌తో పాటు ఖాతలు లేని వారివి కూడా సేకరించాలని అన్నారు. ఇన్‌ఫుడ్ సబ్సిడిపై కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 15 నాటికి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతల్లోకి ఇన్‌ఫుడ్ సబ్సిడి వెళ్తుందని, ఇది వరకు అన్ని బ్యాంకులకు ఇన్‌ఫుడ్ సబ్సిడి పంపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిరంజన్, జిల్లా మార్కెట్ శాఖ ఎడి స్వరణ్‌సింగ్, వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, ఆర్డీ ఓ రాంచందర్, మండల వ్యవసాయ అధికారులు, మార్కెట్ కార్యదర్శులు పాల్గొన్నారు.