మహబూబ్‌నగర్

జనమైత్రితోనే శాంతి భద్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జనవరి 9: నిత్యం ప్రజల్లో ఉంటూ వారి శాంతి భద్రతలను కాపాడటం సులభతరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. సోమవారం వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనమైత్రి స్నేహ పూర్వక పోలీస్ క్రీడలు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంతక ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పోలీసులంటే ప్రజల్లో భయం ఉండేదని దానిని పోగొట్టెందుకు ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నదని అన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహాభావంతో ఉంటేనే ఆరాచక శక్తులను అణిచి వేసేందుకు సులభమవుతుందన్నారు. భయంతో కాకుండా ప్రేమతో శాంతి భద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారన్నారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ వనపర్తి నూతన జిల్లా ఏర్పడిన తరువాత శాంతి భద్రతలకు ఆనేక చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో పరిశుభ్రత ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణులతో స్నేహాభావంగా పోలీసులు మెలిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. జనమైత్రి కార్యక్రమాలను ఏర్పాటు చేసి పోలీసులకు, ప్రజలకు స్నేహాభావాన్ని పెంపోదిస్తున్నామని ఆమె చెప్పారు. షీటీమ్స్‌ను ఏర్పాటు చేసి ప్రధాన పట్టణాల్లో మహిళల పట్ల జరుగుతున్న ఆరాచాకాలను అరికట్టుతున్నామని ఆమె చెప్పారు. ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి రెండు రోజులకు ఒకసారి గ్రామంలో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనమైత్రి క్రీడల్లో భాగంగా ప్రతి టీమ్‌లో ఒకరిద్దరు పోలీసులు ఉంటూ పోలీసులను భాగస్వాములను చేస్తున్నామని ఆమె చెప్పారు. ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహాభావం ఏర్పడటం కోసమే ఈ క్రీడలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేష్‌గౌడ్, ఎంపిపి శంకర్‌నాయక్, కౌన్సిలర్లు జ్యోతి, వాకిటి శ్రీ్ధర్, ఆవుల రమేష్, రమేష్‌నాయక్, డీఎస్పీ జోగుల చెన్నయ్య, సిఐ షాకిర్ హుస్సేన్, జిల్లాలోని సిఐలు, ఎస్‌ఐలు, క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం సర్వీస్ చేసి వాలిబాల్ క్రీడను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు.