మహబూబ్‌నగర్

మిషన్ కాకతీయ కాదు.. కమీషన్ల కాకతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, ఏప్రిల్ 7: మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో ఏడువేల చెరువులు ఉన్నాయని ఇది మంచి స్కీం అని, మిషన్ కాకతీయ నేడు కమీషన్ల కాకతీయలా మారుతోందని, కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ అన్నారు. గురువారం పట్టణంలోని సంతోష్‌నగర్‌కాలనీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు కరువు భయంకరంగా ఉందని, ఈ సంవత్సరం వర్షాలు కురువక పంటలన్ని ఎండిపోతున్నాయని, భూగర్భజలాలు 25 మీటర్ల లోతు పడిపోయాయన్నారు. జిల్లాలో దాదాపు 1200 గ్రామాలు మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, పశువుల మేత సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. గ్రామాలలో ప్రజలకు ఉపాధిపనులు లేక చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రైతులకు పంటనష్టపరిహారం ఇప్పటికి ఇవ్వడం లేదని, రుణమాఫీ సక్రమంగా అమలు జరుగలేదన్నారు. వడ్డి వ్యాపారస్థుల వేధింపులు రైతాంగంపై, ప్రజలపై పడి జిల్లాలో 330 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాలేదని, ప్రాజెక్టులకు తక్కువ నిధులు కేటాయించారని, రెండు వేల కోట్లు ప్రాజెక్టులకు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు ఖాదర్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు, వెంకట్రామిరెడ్డి, నాయకులు వెంకటస్వామి, దేవదాసు, రాజు, మహేష్ తదితరులు ఉన్నారు.
అలంపూర్‌కు చేరుకున్న బస్సుయాత్ర...
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సుజాత గురువారం అలంపూర్‌కు చేరుకుంది. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా నాయకులకు సిపిఎం రాష్ట్ర నాయకులు భూపాల్‌సాగర్, జిల్లా కార్యదర్శి జబ్బార్ దీక్షలో కూర్చున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు సాగర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా వలసల జిల్లాగా పనులు లేక వలసలకు వెళ్తున్నారని అన్నారు. వలసలు ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 64 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినా వారికి ఎటువంటి సహాయం అందలేదన్నారు.