మహబూబ్‌నగర్

సంక్రాంతి ముగ్గులు సంప్రదాయానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జనవరి 13: ప్రతి ఏటా నిర్వహించుకునే సంక్రాంతి ముగ్గులు భారతీయ సాంప్రదాయానికి ప్రతీక అని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. శుక్రవారం సాయంత్రం తేరుమైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందించిన అనంతరం మాట్లాడుతూ నూతనంగా వ్యవసాయ ఉత్పత్తులు ఇంటికి చేరినవేళ రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు ఉత్సాహంగా జరుపుకుంటున్నారన్నారు. నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రైతులు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నారని, జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో ఈ ప్రాంత బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయన్నారు. మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ మహిళలు మకర సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు రంగవల్లులు వేసి గొబ్బెమ్మలతో ఆహ్వానం పలుకుతారని గుర్తుచేశారు. తేరుమైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు పెద్దసంఖ్యలో మహిళలు తరలిరావడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా డి.కె. అరుణ మొదటి విజేత స్వప్న, రెండవ విజేత మాధవి, మూడవ విజేత అరుణలకు గద్వాల చీరలను బహుకరించారు. అదేవిధంగా రెండున్నరేళ్లపాటు మున్సిపల్ చైర్మన్‌గా పాలన సాగించి అందరిచేత అభినందనలు పొందిన బండల పద్మావతికి పట్టణ మహిళా సంఘం సభ్యులు ఎమ్మెల్యే చేతులమీదుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్ శంకర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు, జి.వేణుగోపాల్, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని 5వ వార్డులో కౌన్సిలర్ త్యాగరాజు ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో మహిళలు హాజరై ముగ్గులు వేశారు.
అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
జడ్చర్ల, జనవరి 13: జడ్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కావేరమ్మపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్,టిడిపి నాయకుల మోపతయ్య, కరాటేశ్రీను, యాదయ్య, వెంకటయ్య, పార్శివెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.