మహబూబ్‌నగర్

ఆసియాలోనే సరళసాగర్ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జనవరి 15: సరళసాగర్ జలాశయం ఆసియా ఖండంలోనే మొదటిది కాగా ప్రపంచంలోనే రెండవదని ఈ ఆటోమెటిక్ సైఫాన్‌గల జలాశయం గల సరళసాగర్ ప్రాజెక్టు ఖ్యాతీ గడించింది. ఆసియా ఖండంలోనే సరళసాగర్ ప్రాజెక్టు ఆద్భుత కట్టడంతో నిర్మాణం గావించింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని దంతనూరు గ్రామ పంచాయతి పరిధిలోని సరళసాగర్ గ్రామ సమీపంలో జలాశయం ఉన్నది. ఊకచెట్టు వాగుపై ఉన్న ఈ జలాశయం ఒకప్పుడు పెద్ద చెరువుగా ఉండేది. వర్షకాలం వచ్చిన వెంటనే నీటిని ఎక్కువగా నిల్వ ఉంచాలని ఉద్దేశంతో స్వతంత్య్రం అనంతరం వనపర్తి సంస్థానాదీశులు రాజా రామేశ్వర్ రావు మొదటి సారిగా ఎంపీగా అయిన తరువాత జలాశయంపై నిర్మాణం చేయుటకు అధికారులు ఇంజనీర్లతో చర్చీంచారు. ఊకచెట్టు వాగులో ప్రవహిస్తున్న నీటిని అడ్డుకట్ట వేస్తే వాగు పరివాహక గ్రామాలు ముంపు గురవుతాయని అప్పటి ఇంజనీర్లు రాజా వారికి వివరించారు. దీంతో ప్రత్యమ్నాయంగా ఆలోచించి రాజా రావు రామకృష్ణ రావు అనే ఇంజనీర్‌కు సూచించారు. దీంతో ఆయన వాగుపై ఆటోమెటిక్ సైఫాన్ పద్దతిన ప్రాజెక్టు నిర్మిస్తే బాగుంటుందని చెప్పారు.
నీరు నిండిన వెంటనే గాలిపీడన ద్వారా అధిక నీరు బయటికి వెళ్లె వీలుంటుందని చెప్పడంతో పూర్తి వివరాలపై అరా తీశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఇలాంటి ప్రాజెక్టు అక్కడ ఉందని ఇంజనీర్ రామకృష్ణ రాజు తెలుపడంతో రామకృష్ణ రాజు అక్కడ ఆరు నెలల పాటు అక్కడి ప్రాజెక్టు నిర్మాణ నమూనాలు పని తీరు వంటిపై ఆధ్యాయనం చేసి సరళసాగర్ వద్ద 1951న జలాశయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఆటోమెటిక్ సైఫాన్ సిస్టమ్ అంటే...
జలాశయంలోని పూర్తి స్థాయి నీరు చేరిన వెంటనే ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన హుడ్‌స్ట్రైమింగ్ సైఫన్ కవటాల ద్వారా నీరు ఎవ్వరికి ప్రమేయం లేకుండానే బయటకు రావడం విశేషం. నీటి సామార్థ్యం తగ్గిన వెంటనే కావటాలు దానంతటా అవే మూత పడిపోతాయి. ఇలా నిండిన నీటితో రైతులు పంటలు సాగు చేసుకుంటారు. ఊకచెట్టు వాగుకు నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షం కురిస్తే వరదనీరు సరళసాగర్‌కు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు సామార్థ్యం 0.5 టిఎంసి ఉంటుందని ఆసియాలోని మొట్టమొదటి సరళసాగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత వాసుల నిరీక్షణ.