మహబూబ్‌నగర్

సాదాబైనామాల ప్రక్రియకు ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 16: సాదాబైనామాలతో భూముల క్రమబద్దికరణలో అధికారులు వేగం పెంచారు. లింక్‌డాక్యుమెంట్లు లేకపోయిన సర్వే నంబర్‌లో పోరపాట్లు ఉన్న, క్షేత్రస్థాయిలో విచారించి క్రమబద్దికరణ చేస్తున్నారు. అధికారులు మేరుపువేగంతో సాదాబైనామాల ప్రక్రియను చేపట్టడంతో పేద రైతులకు న్యాయం జరుగుతుంది. సరైన రికార్డులు లేక పత్రాలు గందరగోళంలో ఉన్నటువంటి సాదాబైనామా భూములను క్రమబద్దికరణ చేసేందుకు గత ప్రభుత్వాలు రైట్‌ఆఫ్‌రికార్డ్స్ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాక్ట్‌లో సాదాబైనామాల ద్వారా భూముల కొనుగోళ్లు జరగొద్దని రిజిస్ట్రేషన్ల ద్వారానే క్రయవిక్రయాలు జరగాలని పలు అంశాలను పొందుపరిచారు. రైట్‌ఆఫ్‌రికార్డ్స్ యాక్ట్‌తో చాలా మంది రైతులు త మ భూములను రెవెన్యూ రికార్డులలో న మోదు చేసుకుని పట్టాదారులుగా పాసుపుస్తకాలు పొందారు. ఈ ప్రక్రియతో చాలా మంది పేద రైతులు ఆ భూములకు అధికారికంగా యజమానులను చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 2009 నుండి ఈ ప్రక్రియను నిలుపుదల చేశాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సాదాబైనామా భూములను క్రమబద్దికరణ చేసేందుకు అవకాశం కల్పించింది. దింతో మళ్లీ రైతుల్లో భూతగాదాలు తలెత్తాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం మళ్లీ సాదాబైనామాల ద్వారా భూములను క్రమబద్దికరించడానికి అనుమతులు జారీ చేసింది. ఇందులో బాగంగానే వివాదం లో ఉన్న భూములను సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్దికరించాలని ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామా మీద కొనుగోలు చేసిన భూములను క్రమబద్దికరించి వాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియతో రాష్ట్రంలో ఉన్న పేద, మద్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. జిల్లాల పునర్విభజన అ నంతరం కొంత ఆలస్యం జరిగింది. దినికితో డు సాదాబైనామాల ద్వారా చేసే రిజిస్ట్రేషన్‌లో పలు సందేహలు తలెత్తడంతో ప్రక్రియ ము ందుకు సాగలేదు. గణాంకాల ప్రకారం జిల్లా లో ఇప్పటివరకు 5676 సాదాబైనామా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని దరఖాస్తులు అందాయి. వాటిలో 1662దరాస్తులను నిశితం గా పరిశీలించిన అధికారులు సరైన పత్రాలు లేకపోవడంతో నిబందనాలను అనుసరించి 1551దరఖాస్తులను తిరస్కరించారు. అర్హత గల 111 దరఖాస్తులను అనుమతించి వాటిని రైట్‌ఆఫ్‌రికార్డ్స్ యాక్ట్ ద్వారా క్రమబద్దికరించారు. మిగిలిన 4014 దరఖాస్తులను పరిశీలించి ఈ ఏడాది మార్చిలోగా పూర్తి చేయనున్నారు. సాదాబైనామా భూములను రిజిస్ట్రేషన్ చేసే విషయంలో పలు సందేహాలు తలెత్తడంతో అధికారులు ఈ అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది డిసెంబర్ 14న ముఖ్యమంత్రి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సాదాబైనామాల్లో తలెత్తిన పలు అడ్డంకులపై చర్చించారు. వాటన్నింటికి పరిష్కారం చూపేవిధంగా అధికారులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూములను క్రమబద్దికరణ చేసేవిషయంలో స్థానిక తహశీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. ఒక వ్యక్తి అనుభవంలో ఉండి సాదాబైనామా లేకుంటే స్థానికంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునపే అధికారాన్ని తహశీల్దార్లకు ఇచ్చారు. పట్టాదారు, వారి వారసుల నుండి వచ్చే అభ్యంతరాలను స్థానికంగా విచారణ చేసి తుదినిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కూడా తహశీల్దార్లకు కల్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే సాదాబైనామాల పరిష్కారం విషయంలో తహశీల్దార్లకు అధికారం కల్పించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.