మహబూబ్‌నగర్

ప్రజలపై ట్యాక్స్‌ల భారం తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జనవరి 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణల పేరుతో పేద ప్రజలపై ధరల పెంపు, ట్యాక్సిల భారం తగదని డిసిసి అధికార ప్రతినిధి గంగాధర్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణల పేరుతో పక్షం రోజులలోనే అనేక మార్లు పెట్రోల్, డిజిల్ ధరలను పెంచడం తగదని, గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డిజిల్ ధరలను పెంచుతున్నాయని ప్రజలు అధికారం బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలకు ఇచ్చారని ప్రస్తుతం పేద ప్రజలపై అనేక రూపాలలో ట్యాక్సి, సంస్కరణ ల పేరుతో భారం వేయడం బావ్యం కాదని, వెంటనే పెంచిన పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షుడు షాకీర్, జిల్లా నాయకులు నిజామొద్దీన్, గణేష్ తదితరులు ఉన్నారు.

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 16: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఆంద్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ దన్‌రాజ్ అన్నారు. సోమవారం మెట్టుగడ్డలోని ఆంద్రాబ్యాంకు జోనల్ కార్యాలయంలో నూతనంగా పదవి భాద్యతలు చేపట్టారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఢిల్లీ, కల్‌కత్తా, ఆంద్ర, రాయలసీమతో పాటు హైదరాబాద్‌లోని వివిధ పదవుల్లో పని చేసిన అనుభావం ఉందని అన్నారు. ఎక్కడ పని చేశామన్నది ముఖ్యం కాదని, ఖాతాదారులకు, బ్యాంకు వినియోగదారులకు సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏటి ఎం సెంటర్లలో 24గంటల పాటు నగదు ఉండేలా చూస్తామన్నారు.
తమ పరిధిలోని 89శాఖల బ్యాంకుల్లో నగదు సమస్య లేదని నూ తన జిల్లాల సర్వతోముఖాబివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. మొత్తం 107 ఏటి ఎం, క్యాష్ రిసైకిలర్లతో రూ.5420కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నామని మహబూబ్‌నగర్ పరిధిలో మొత్తం డిపాజిట్లు రూ. 2536కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.685కోట్లు ఒకేరంగానికి రుణాలు అందిస్తూ గత 84 ఏళ్లుగా ఆంద్రాబ్యాంకు సేవలు పొందుతూ ప్రొత్సహిస్తున్న ఖాతాదారులకు ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్‌ఎఎస్‌ఎన్‌రెడ్డి, చీఫ్ మేనేజర్ పరందాములు, శ్యాంముల్, తిలక్ తదితరులు పాల్గొన్నారు.