మహబూబ్‌నగర్

ఉల్లాసంగా...ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 19: ఉల్లాసంగా ఉత్సహంగా కైట్ ఫెస్టివల్ వేడుకలు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ పతంగుల పండుగను పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంబించారు. 20 దేశాలకు సంబందించిన విదేశీయులు ఆయా దేశాల్లోని పతంగులను ఇక్కడికి తీసుకువచ్చి ఆకాశంలోకి ఎగురవేశారు. దాంతో మహబూబ్‌నగర్ పట్టణంలో పతంగుల పండుగను తిలకించేందుకు పట్టణ ప్రజలు తరలివచ్చారు. ఆకాశంలోకి రకరకాల పతంగులు ఎగురుతుండడంతో ప్రజలు కేరింతలు, ఈలలు కొడుతూ తమ సంతోషాన్ని వెలిబుచ్చా రు. కొన్ని పతంగులు ఆకర్షణీయంగా ఉండడంతో వాటిని చూసిన జనం ఇంకేప్పుడు ఇలాంటి పతంగులను చూ స్తామో లేదో అనే విధంగా చర్చించుకున్నారు. ముఖ్యంగా పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్ వేడుకలను తిలకించేందుకు ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి చేరుకున్నారు. విదేశీయులు ప్రజలను ఉత్సహ పరిచేందుకు పతంగుల పండుగలో సందడి చేసి శభాష్ అనిపించుకున్నారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జాయింట్ కలెక్టర్ శివకుమార్‌నాయుడు, పర్యాటక శాఖ జిల్లా అధికారి పాండురంగం, నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదిత్యతో పాటు మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి విదేశీ కైటర్లతో కలిసి సందడి చేస్తూ పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రజలు పతంగులు ఎగురవేసుకుని పండుగను జరుపుకుంటారని తెలిపారు. అదే ఆంద్రలో సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించుకుంటారని వెల్లడించారు. అంతర్జాతీయ పతంగుల పండుగకు మహబూబ్‌నగర్‌ను ఎంపిక చేయడం పట్ల మహబూబ్‌నగర్ ఖ్యాతి ప్రపంచస్థాయికి ఎదిగిందని అన్నారు. ఇలాంటి ఫెస్టివల్స్‌ను నిర్వహించడం వల్ల యువతలో ఉత్సహాన్ని రెక్కెతిస్తుందన్నారు. పతంగుల పోటీలు ఉల్లాసాన్ని కలిగిస్తాయని పతంగులు ఎంత ఎత్తుకు ఎగిరితే అంత పోటీతత్వం పెరుగుతుందన్నారు. 20దేశాలకు సంబందించిన కైటర్లు మహబూబ్‌నగర్‌కు వచ్చి పతంగులు ఎగురవేసి ప్రజలను ఉత్సహపరిచారని తెలిపారు.
విదేశాలకు సంబందించిన రంగురంగుల, వివిధ ఆకృతుల పతంగులు ఎగిరాయని ఎమ్మెల్యే తెలిపారు. తొలిసారిగా ప్రభుత్వ ఆద్వర్యంలో నిర్వహించడం గొప్పవిషయమని తెలంగాణ ప్రజలు తమ నిజజీవితంలో జరుపుకునే పండుగలను ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రత్యేకంగా నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అంతర్జాతీయ ఫెస్టివల్‌కు మహబూబ్‌నగర్‌ను ఎంపిక చేయడం పట్ల ప్రత్యేకంగా ఆయనకు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.