మహబూబ్‌నగర్

సదరన్ క్యాంపులో దివ్యాంగుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జనవరి19: తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం జిల్లాల పునర్విభజన అనంతరం మొ దటి సారిగా దివ్యాంగులకు సర్ట్ట్ఫికేట్లు ఇవ్వాలని గురువారం వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సదరన్ క్యా ంపుకు వచ్చిన దివ్యాంగులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకు దివ్యాంగులు జిల్లా నలుమూలాల నుండి వేలాది మంది వస్తారని అధికారులు అంచనాలు వేయకపోవడంతో ఒక్క సారిగా క్యాంపులో గందరగోళం నెలకొంది. కనీసం నిలిచోని పరిస్థితిలో ఉన్న దివ్యాంగులను క్యూలైన్ల లో ఎండకు నిలబెట్టడంతో వారి పరిస్థితి దారుణంగా త యారైంది. ఉదయామే జిల్లా కలెక్టర్ శే్వతా మ హంతి సదరన్ క్యాంపును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అ నంతరం వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగులు సదరన్ క్యాం పుకు అధికంగా రావడంతో నీడను, కూర్చీలను, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోయారు. పోలీసు క్రీడలు, జాతీయ భద్రత వారోత్సవాల్లో పోలీసులు నిమగ్నం కాగా సదరన్ క్యాంపు వద్ద కొద్ది మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మాత్రమే ఉన్నారు. దీంతో వేలాధిగా వచ్చిన దివ్యాంగులు ఒకరినొకరు తోసుకునే పరిస్థితి వచ్చింది. అయితే గతంలో సర్ట్ఫీకేట్ లేని వారే ఈ క్యాంపుకు రావాలని అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో గతంలో సర్ట్ఫీకేట్లు తీసుకున్న వారు కొత్త వారు కూడా క్యాంపుకు తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. డీఎస్పీ జోగుల చె న్నయ్య కొంత మంది పోలీస్ సిబ్బందితో వచ్చి అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటి కి పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మధ్యాహ్నం వరకే క్యాంపు ముగిస్తునట్లు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని డీఎస్పీ చెప్పడంతో సూదుర ప్రాంతాల నుండి వచ్చిన దివ్యాంగులు ఆందోళన చెందారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి కనీసం వృద్ధులు మహిళలకైనా వచ్చిన వారందరికి పరిక్షించాలని చెప్పినప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సదరన్ క్యాంపును వాయిదా వేశారు. 2వేలకు పైగా దివ్యాంగులు సదరన్ క్యాంపుకు రా గా కేవలం 455 మందిని మాత్రమే పరిక్షించి డాక్టర్లు చే తులు దులుపుకున్నారు. అధికారుల ముందస్తు అంచనాలు లేకపోవడం వల్ల దివ్యాంగులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, తగినంత మంది డాక్టర్లను కూడా ఏర్పాటు చేయలేదని, దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు.

స్నేహభావాన్ని పెంచుకోవాలి

దేవరక్రద, జనవరి 19: క్రీడలతో స్నేహభావాన్ని పెంపొదిస్తాయని ప్రతి ఒక్కరు క్రీడ అభిలాషను అలవర్చుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర మండల పరిధిలోని మినుగోనిపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా రూ.1,116లు, రెండవ బహుమతిగా రూ.5,116లు అందజేశారు,. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రా మీణ ప్రాంతాల్లోని విద్యార్థులు క్రీడల్లో రాణించినప్పుడే గొప్ప గుర్తింపు వస్తుందని అన్నారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమిలు సమానంగా స్వీకరించాలన్నారు. అంతకు ముందు మండల పరిధిలోని గురకొండ గ్రామంలో సిఎం సహయనిధి కింద కుర్వ బాలప్పకు రూ.4లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని పేద ప్రజల కోసం ప్రతి నియోజకవర్గంలో 50పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కెసి ఆర్ అనేక సంక్షేమ పథకాలు చే పట్టారని అందులో ఒక్క గురకొండ గ్రామంలోనే 55మంది కళ్యాణలక్ష్మీ ప థకం కింద ఒక్కొక్కరికి రూ. 51వేలు ప్రభుత్వం నుండి లబ్దిపొందారని తెలిపారు. ఈ విధంగా పించన్లు, అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాగు,తాగునీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం వేల కోట్ల రుపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం యాసంగి సిజన్‌లో జూరాల లిఫ్ట్ నుండి కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నింపడం జరిగిందని ప్రాజెక్టు నుండే దాదాపు 9వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఎంపిపి ఇవి గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి నరసింహరెడ్డి, సర్పంచ్ బుచ్చన్న, నాయకులు రాజు, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, భాస్కర్‌రెడ్డి, వెంకటేష్, రాములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.