మహబూబ్‌నగర్

శ్రీశైలంకు భక్తుల పాదయాత్ర షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 19: హరహర మహదేవ శంభోశంకర అనే నామస్మరణ శ్రీశైలం రహదారుల వెంట ఇక మారుమ్రోగుతుంది. వచ్చే ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి శ్రీశైలానికి భ క్తులు పాదయాత్రగా వెళ్తుంటారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ప్రధాన రహదారులన్ని శివస్వాములు, శివభక్తులే దర్శనమిస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్టల్ర నుండి వేలాది మంది భక్తులు వందల కిలో మీటర్ల మేర తమ గ్రామాల నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్ర ద్వారా బయలుదేరుతారు. అందులో భాగంగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు సంబందించిన శివభక్తులు గురుస్వామి గురుపాదయ్య ఆద్వర్యంలో దాదాపు 300 మంది భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పాదయాత్ర ద్వారా పయనం అ య్యారు. ప్రస్తుతం వారు చేపట్టిన శ్రీశైలం పుణ్యక్షేత్ర పాదయాత్ర 30వ సంవత్సరానికి చేరుకుంది. దాంతో వివిధ గ్రామాల ప్రజలు వారిని శ్రీశైలానికి పంపించేందుకు పెద్ద ఎత్తున హన్వాడ గ్రామానికి చేరుకుని వారి యాత్ర సజావుగా, ప్ర శాంతంగా జరగాలని మల్లికార్జునస్వామిని కోరుకున్నారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కషాయద్వజాలను చేతబూని గ్రామంలోని శివాలయాలు, ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పాదయాత్ర ద్వారా బయలుదేరారు. ఉదయం 8 గంటల వరకు మహబూబ్‌నగర్‌లోని ఆయోద్యనగర్‌కు చేరుకున్నారు. దాంతో వీరన్నస్వామి శ్రీశైలంకు పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు అల్పహారం ఏర్పాటు చేశారు. అయితే హన్వాడ భక్తులతో కలిసి పాలమూరు పట్టణానికి చెందిన మరో వందమంది భక్తులు శ్రీశైలం యాత్రకు బయలుదేరారు.
రాత్రికి పాలెం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు బస చేయనున్నారు. 30 ఏళ్ల పాటు హన్వాడకు సంబందించిన గురుస్వామి గురుపాదయ్య ఆద్వర్యంలో చేపడుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం పాదయాత్రకు ప్రతియేట భక్తుల నుండి అనూహ్య స్పందన లభించడమే కాకుండా ప్రతియేట భక్తుల సంఖ్య పెరుగుతుంది.