మహబూబ్‌నగర్

మహిళ కాంగ్రెస్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 19: నోట్ల రద్దును నిరసిస్తూ మహిళ కాంగ్రెస్ ఆద్వర్య ంలో మహబూబ్‌నగర్‌లో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లతో పాటు డి సిసి నేతలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యం నుండి నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలు చేతిలో గినె్న, గంటెను పట్టుకుని తాలిబజానా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ దుకాణాల దగ్గరకు వెళ్లి మహిళ కా ంగ్రెస్ నాయకురాళ్లు గినె్నను గరిటెతో కొడుతూ వినూత్న రితీలో నిరసన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైటాయించారు. రోడ్డుపై బైటాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దింతో పోలీసులు రంగంలోకి దిగి డిసిసి నేతలతో పాటు మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లను బలవంతంగా రోడ్డుపై నుండి బయటకు నెట్టివేసి ఆరెస్టు చేశారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలుమార్లు మహిళ పోలీసులతో కాంగ్రెస్ మహిళ నాయకురా ళ్లు వాగ్వివాదానికి దిగారు. అయినప్పటికిని బలవంతంగా ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనలక్ష్మీ మాట్లాడుతూ ప్రదానీ నరేంద్రమోది పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఇళ్లల్లోని గృహిణీలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో దేశంలోని మహిళలు కూడా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి తక్షణమే నైతిక భాద్యత వహించి పదవి నుండి దిగిపోవాలని ప్రశ్నించారు. డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధానమంత్రి నటేట ముంచారని ద్వజమెత్తారు. దేశం మరో 20 ఏళ్ల పాటు వెనక్కి నెట్టెయడం జరిగిందని ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు రేణుకా, లక్ష్మీ, బాలమ్మ, బాలమణి, చంద్రకుమార్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, బెనహర్, గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.