మహబూబ్‌నగర్

సిలిండర్ పేలి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, జనవరి 20: గ్యాస్ పొయ్యి వెలిగించి టీ వేడి చేయబోయి ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం జడ్చర్ల మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబందించిన వివరాలు ఎస్సై లక్ష్మినర్సింహా కథనం మేరకు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ(55) మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని గ్యాస్ పొయ్యిపై టీ వేడి చేస్తుండగా ఆకస్మాత్తుగా రెగ్యులేటర్ పేలడంతో పాటు సిలిండర్ కూడా పేలి మంటలు వ్యాపించడంతో తీవ్ర గాయాలపాలైన కృష్ణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి నలుగురు కుమారులు ఉన్నారు. కృష్ణమ్మ కుమారుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లక్ష్మినర్సింహా తెలిపారు.

గిట్టుబాటు ధరకే
కందులు కొనుగోలు చేస్తాం

* మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహా రెడ్డి
దేవరకద్ర, జనవరి 20: ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే కంది విత్తనాలు కొనుగోలు చేస్తామని దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి నరసింహా రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌లో కంది విత్తనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండించిన పంటలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని ఇందుకు క్వింటాల్‌కు రూ.5050 నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో పంటలు పండించిన ప్రతి రైతు దగ్గర విత్తనాలను కొనుగోలు చేస్తామని తొందరపడి మార్కెట్‌కు తీసుకురాకూడదని సూచించారు. వ్యవసాయ పొలం దగ్గరనే కళాల్లో ఆరబెట్టుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు.