మహబూబ్‌నగర్

పువ్వు తీసుకో... భద్రంగా నడుపుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జనవరి 20: డ్రైవర్లకు, ప్రయాణికులకు ఇంటికి భద్రంగా చేరాలని వనపర్తి డిఎస్పీ జోగుల చెన్నయ్య పూలు ఇచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని మధర్ థెరిస్సా జంక్షన్ వద్ద 28వ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ప్రయాణికులకు ఆయన పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారు హెల్మెంట్ ధరించాలని, కారులో వెళ్తున్న వారు సీటు బెల్టు తప్పనిసరి అని, కొందరు సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్నారని అలా చేయడం వల్ల ప్రమాదాలు కొనితెచ్చుకుంటారని అన్నారు. మధ్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండి వాహనాలను నడపడం ద్వారా ప్రయాణికుల జీవితాలతో చెలగాడం ఆడవద్దన్నారు. నిద్ర వచ్చిన వెంటనే డ్రైవర్లు దాబాల వద్ద వెంటనే మొఖం కడుకోవాలని గంట ఆలస్యమైన పరువలేదని ప్రయాణిలను చేర్చడం సురక్షితమన్నారు. దూరం వెళ్తున్న ప్రయాణికులకు ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్టీసి వాహనాలను ఆపి పలు సూచనలు చేశారు. అందుకు డిఎస్పీ జోగుల చెన్నయ్యకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో చేపడుతున్న భద్రత వారోత్సవాలను ఇతర రాష్ట్రంలో కూడా తెలుపాలని ఆయన సూచించారు. అందుకు ప్రయాణికులు కృతజ్ఞతగా తిరిగి పూలు ఇచ్చారు. చిన్నారులకు కూడా తల్లిదండ్రులు వెళ్లెటప్పుడు లైసెన్సు, ఇన్సురెన్స్, హెల్మెంట్ ధరించే విధంగా తెలుపాలని చిన్నారులకు ఆయన పూలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు రవికాంత్ రావు, లెనిన్, ఎఎస్‌ఐ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభానికి నోచుకోని
మునిరాబాద్-సికింద్రాబాద్ రైలు
ధన్వాడ, జనవరి 20: మరికల్ మండల కేంద్రంలో మునిరాబాద్-సికింద్రాబాద్‌కు సంబంధించిన రైల్వేలేన్ పనులలో భాగంగా దేవరకద్ర నుండి మరికల్ నుండి జక్లేర్ వరకు రైల్వేలైన్ పనులు పూర్తిచేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రుపాయాలతో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటివల దేవరకద్ర నుండి మరికల్ వరకు డేమో రైలును రైల్వే అధికారులు ట్రైల్న్ చేయాడం జరిగింది. ట్రైల్ రన్ జరిగి నేటకి రెండు నెలలు గడుస్తున్న దేవకరద్ర నుండి మరికల్ మండలంకు రైలు నడవక పోవడంతో ప్రజలు నిరీక్షణలో ఉన్నారు. ప్రస్తుతం మరికల్ మండలం నుండి సికింద్రాబాద్ వరకు రైలు నడపడాని సౌకర్యం ఉంది. కాని సంబంధించిన జిల్లా ఎంపిగాని, రైల్వే అధికారులుగాని పట్టించుకోవడంలేదని మరికల్ మండల ప్రజలు వాపోతున్నారు. ఇకనైన రైల్వేశాఖ అధికారులు స్పందించి మరికల్ నుండి సికింద్రాబాద్ వరకు రైలును నడపాలని మరికల్, ధన్వాడ మండల ప్రజలు కోరుతున్నారు.