మహబూబ్‌నగర్

అక్షయపాత్రతో అంగన్‌వాడీకు పౌష్టికాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 21: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో మ ద్యాహ్న భోజనం (అక్షయపాత్ర) ద్వారా ప్రతి పేదల పిల్లలకు పౌష్టికాహరం అందించే భాద్యత ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తపై, సిడిపిఓపై ఉందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని తన నూతన చాంబర్‌లో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ సిడిపిఓలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల విభజన త ర్వాత కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు మన జిల్లాలో కలవడం, మన జిల్లాలోని అంగన్‌వాడీ కేం ద్రాలు ఇతర జిల్లాల్లో కలవడం సరుకుల పంపిణీలో కొంత ఇబ్బందులు తలెత్తడవం వల్ల, పక్కా ప్రణాళికతో అంగన్‌వాడీ సెంటర్ నుండి సరుకుల పంపిణీ జరిగేవిధంగా సంబందిత అధికారులు పనిచేయాలని అన్నారు. జిల్లాలో సెక్టర్ ప్లాన్ తయా రు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి సూపర్‌వైజర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులపై అడిగి తెలుసుకున్నారు. నూతన జిల్లాలకు ఆర్‌ఓ రిలీజ్ చేయడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు. సరుకుల పంపిణీలో ఇబ్బందులు తొలగుతాయని, సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ సెంటర్ల విజిట్ రిపోర్టును తయారు చేయాలని తెలిపారు. సూపర్‌వైజర్ ఉన్న ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌కు కంప్యూటర్, ఇంటర్నెట్ సౌ కర్యం, విద్యుత్ సమకూరుస్తామని, సమర్థవంతంగా పనిచేయడానికి మీకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

ముగిసిన దివ్యాంగుల సదరం క్యాంపు

వనపర్తి, జనవరి21: వనపర్తి జిల్లాలో మొదటి సారిగా వనపర్తి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సదరన్ క్యాంపు శనివారంతో ముగిసింది. మొదట గురువారం జిల్లాలోని దివ్యాంగులందరికి సదరన్ సర్ట్ఫీకేట్లు ఇవ్వాలని భా వించిన అధికారులు ఒకే రోజు 14 మండలాలు, వనపర్తి పట్టణానికి చెందిన దివ్యాంగులకు సదరన్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడంతో వేలాధి మంది దివ్యాంగులు జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. వీరికి తగినంత మంది వైద్యం చేయడానికి డాక్టర్లు, వసతులు లేకపోవడం తో ఇబ్బందులకు గురయ్యారు. అది గమనించిన జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి గురువారం క్యాం పును వాయిదా వేసి వనపర్తి నియోజకవర్గ దివ్యాంగులకు శుక్రవారం క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో 1108 మందికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం పాన్‌గల్, వీపనగండ్ల, కొత్తకోట, ఆత్మకూరు, మదనాపురం, అమరచింత, చిన్నంబావి మండలాలకు చెందిన దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం కూడా సుమారు వేయ్యి మంది దాకా పరీక్షలు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని క్యాంపు ఏర్పాట్లను పరిశీలించారు. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు నిరంజన్‌రెడ్డితో పాటు కలెక్టర్, ఎస్పీలు క్యాంపులోనే భోజనం చేశారు.