మహబూబ్‌నగర్

మన్యంకొండ గుట్టలపై పోలీసుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 22: మన్యంకొండ గుట్టలపై పోలీసులు సందడి చేశారు. పర్వతారోహణ వ్యాయామం అంటూ పోలీసులు మహబూబ్‌నగర్ మండల పరిధిలోని మన్యంకొండ గుట్టదగ్గరకు ఉదయానే్న చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన పోలీసులు రోడ్డు మార్గం కాకుండా మధ్యలోనే గుట్టలపైకి ఎక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి స్పందిస్తూ శారిరక దృడత్వాన్ని పెంచడమే కాక మానసికంగా మనిషిని బలోపేతం చేసే అద్బుతమైన వ్యాయామం పర్వతారోహణమని వెల్లడించారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ గుట్టలపైకి పోలీసులు పర్వతారోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుట్టకింద నుండి కొండలపైకి రోడ్డుమార్గాన కాకుండా గుట్టలోన్ని రాళ్లు, రప్పలు, పేద్దపేద్ద గుండ్లుదాటుతూ కొండపైకి ఎక్కే కార్యాక్రమాన్ని నిర్వహించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట డిఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డిలు జెండాను ఊపి పర్వతారోహణ వ్యాయామంను ప్రారంభించారు. ఉదయం ఏడు గంటలకే మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన పోలీసులు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో గల మన్యకొండకు చేరుకున్నారు. మన్యంకొండ ముఖద్వారం నుండి రోడ్డు మార్గం కాకుండా గుట్టలపైకి పోలీసులు వా రితో పాటు కొందరు వారి పిల్లలు సేతం కొండలను ఎక్కారు. మ న్యంకొండలపై పోలీసుల సందడి నెలకొంది. ఎన్నడులేని విధంగా జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన యువకులు సైతం అక్కడికి చేరుకుని పోలీసులు నిర్వహించిన పర్వతారోహణ కార్యక్రమాన్ని తిలకించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు సైతం పోలీసులతో కలిసి కొండలను ఎక్కి వారితో కలిసి సందడి చేశారు. దాదాపు రెండు, మూడు గంటల పాటు ఎంతో ఉత్సహంగా, ఉ ల్లాసంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల సిఐలు సీతయ్య, రామకృష్ణ, రాజు, రామకృష్ణతో పాటు అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు. అయితే మన్యంకొండలను ఎక్కుతూ కొందరు పోలీసులు శిక్షణలో చేసిన వ్యాయామాలను గుర్తు చేసుకున్నారు. అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ శారిరక దృడత్వాన్ని పెంపొందించుకునేందుకు గాను, మానసికంగా మనిషిలో బలోపేతం చేసే అద్బుతమైన వ్యా యామం పర్వతారోహణమని తెలిపారు. పోలీసు వృత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు పోలీసులు నిరంతరంగా సాధకుడిగా ఉండాలని అన్నారు. సిబ్బంది ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్దతోనే ఇలాంటి పర్వతారోహణ కార్యక్రమం తీసుకున్నామని కొందరు సినియర్ అధికారులుకు వచ్చిన ఆలోచనలతో మన్యంకొండ గుట్టపై పర్వతారోహణ వ్యాయామం చేపట్టడం జరిగిందన్నారు. పోలీసులు సమాజంలో కిలకమైన వ్యక్తులో ఒకరని వారు శారీరకంగా బాగా ఉంటేనే సమాజానికి కూడా మంచిదని అన్నారు. ప్రతి వ్యక్తికి వ్యాయామం ఎంతో అవసరమని తెలిపారు. పర్వతారోహణ కార్యక్రమానికి వెళ్లిన పోలీసు సిబ్బందితో పాటు వారి పిల్లలను కూ డా తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. జిల్లాలో పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా మన కుటుంబం, మన ఆ రోగ్యం అనే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి వ్యాయామం నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసులతో కలిసి యువత కూడా ఇలాంటి వాటిలో కలిసి వస్తే ప్రెండ్లీ పోలీసింగ్ విధానం మరింత ముందుకు వెళ్తుందని అన్నారు. కాగా కొందరు సిఐలు, ఎస్సైలు ఇలాంటి వ్యాయామాలు చేసి చాలా రోజులు అయిందని నిరంతరంగా చేస్తే తమ సిబ్బంది ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారని ఈ పెద్ద ఎత్తునా కాకుండా నిరంతరంగా ఇలాంటి కార్యక్రమం ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేశారు.