మహబూబ్‌నగర్

బిసిలు ఐక్యతతో చైతన్యవంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 22: బిసిలు చైతన్యవంతులుగా తయారు కావాలని అందుకు చదువుకున్న వ్యక్తులు, మేదావులు ఐక్యంగా ఉంటూ ప్రజలను చైతన్య పరచాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం బిసి సంక్షేమ సంఘం కార్యాయలం, ఉపాధ్యాయ సంఘం కార్యాలయాలను ఆయన వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం పూలే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జనాబాలో అత్యంత సంఖ్య ఉన్న జాతి అని కానీ రాజ్యాధికారంలో మాత్రం వెనకంజలో ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో చూసిన జిల్లాలో చూసిన జనాభా లో బిసిలదే 60శాతం పైగా ఉన్నారని తెలిపారు. కానీ అన్ని రంగాలలో వెనుక వరుసలో ఉన్నామని తెలిపారు. బిసిలంతా ముందుగా ఐక్యతారాగాం పాడాలని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను చదివించాలని సూచించారు. చదువుతోనే సమాజంలో అన్ని విషయాలు తెలుస్తాయని దాంతో చైతన్యం వస్తుందని అన్నారు. బిసి సంఘాల నేతలు కూడా రాజకీయ నాయకుల మధ్య సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్

వనపర్తి, జనవరి22: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలు పెట్టడంతో ఇన్ని రోజులు ప్రజలు చిల్లర కష్టాలు ఎదుర్కొగా ప్ర స్తు తం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఎదుర్కొంటున్నారు. తెచ్చిన సరుకును విక్రయించినప్పటికి డబ్బులు చేతికి అందకా నానాతంటాలు పడుతున్నారు. సరుకులు అమ్మినా చేతికి నగదు అందకపోవడంతో అప్పులిచ్చిన వారు ఇంటి చుట్టు తిరుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌కు రైతులు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వేరుశనగలను తెస్తున్నారు. ప్ర భుత్వ నిబందనల ప్రకారం పండించిన పంటకు వచ్చిన డబ్బును రైతుల ఖాతల్లోకి జమ చేయాలని ఉండడం, ఖాతల్లో జమ అయిన వారానికి రూ.24 వేలు మాత్రమే చేతికి అందుతుండడంతో ఆ డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6, 7 మాసాలుగా పం టల కోసం చేసిన అప్పులు పంటలు విక్రయించిన తరువాత వాటిని చెల్లిస్తామని, ఒకేసారి డబ్బు చేతికి అందకపోవడంతో బాకీలు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. పంటలు విక్రయించిన తరువాత నెలల తరబడి డబ్బులను డ్రా చేసుకుంటూ బ్యాంకుల చుట్టు తిరగడం సరిపోతు ందని వచ్చిన డబ్బులు అప్పులు తీరకపోగా ఇతర ఖర్చులకు అయిపోతున్నాయని వారు అంటున్నారు. రైతులు పండించిన పంటకు అయిన నగదు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరుకు విక్రయి ంచామంటే అసాములు డబ్బులు కావాలని ఒత్తిడి తెస్తారని కానీ పంటలు విక్రయించినప్పటికి డ బ్బు లు చేతికి అందకపోవడంతో ఇంటి చుట్టు అప్పుల వారు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు విక్రయించిన పంటలకు వెంటనే డబ్బులిచ్చే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.