మహబూబ్‌నగర్

బలహీన వర్గాలకు కెసిఆర్ వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 22: ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగుబలహీన వర్గాలకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఒబిసి సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో బిసిల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు. రాష్ట్రంలోని బిసిల అభివృద్ధికై ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.4000 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేసి బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. బిసిలను ఆర్థికంగా ఎదగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం లో ఉపాధి కల్పనకై ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటివరకు రుణాలు ఇంకా అందించలేదని ఆరోపించారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న బ్యాంకర్లు రుణాలను గ్రౌండింగ్ చేయడంలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు తరహాలోనే బిసిలకు సైతం మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ముస్లీంలకు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలమేనని అయితే బిసిలకు అన్యాయం జరగకుండా వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రచారంలో మాత్రం అగ్రస్థానంలో ఉన్నారని సంక్షేమం అమలులో మా త్రం ముందడుగులేదన్నారు. ముఖ్యంగా బిసి విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయడంలో ప్రభుత్వం యోరంగా విఫలమయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కెజి నుండి పిజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి అందుకుగాను ఏ గ్రామంలో కూడా ఉచిత విద్యకు నాందిపలకలేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానివి అర్బాటాలు తప్పా అభివృద్ధి మాత్రం లేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రైతులను మోసం చేసిన వరాలో కెసిఆర్ ఒకరని రుణమాఫి ఏక కాలంలో చేసి రైతులను ఆదుకుంటామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరించిన ఘనుడని ఎద్ధే వా చేశారు. కెసిఆర్ నిర్ణయాల కారణంగా రైతులకు బ్యాంకుల్లో రుణాలు లబించడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చి న దాన్యం మార్కెట్‌లోకి తీసుకెళ్లినా వాటికి మద్దతు ధర లబించడంలేదని అంతేకాకుండా కంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రైతుకు చేతికి డబ్బురాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి మహిళలంటే గౌరవంలేదని ఆయన కెబినెట్‌లో ఒక మహిళకు కూడా స్థానం ఇవ్వలేదని ఆరోపించారు. ఏఐసిసి పిలుపు మేరకు సోమవారం జిల్లాలో సినియర్ కాంగ్రెస్ నేత విహెచ్ పర్యటించనున్నారని నోట్ల రద్దును నిరసిస్తూ జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణాల్లో ర్యాలీలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వత్తాసు పలుకుతున్న కెసిఆర్ సైతం నోట్ల రద్దుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నా యకులు వెంకటేష్, నరహారి, అజ్మాత్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.