మహబూబ్‌నగర్

లాక్ అదాలత్‌తో కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 30: లోక్‌అదాలత్‌తో చట్టపరిధిలోని కేసుల పరిష్కారానికి అవకాశం కల్పించడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి సూర్యనారాయణమూర్తి వెల్లడించారు. సోమవారం సాయంత్రం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జడ్జి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇరు వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య ఉన్న పలు కేసులకు సంబందించి చట్ట ప్రకారం రాజీపడదగిన నేరాలకు సంబందించి ఇరు వర్గాల మధ్య కుదిరిన సమ్మతమైన రాజీ ద్వారా లోక్ ఆదాలత్‌లో కేసుల పరిష్కారానికి మంచి అవకాశం లబించిందన్నారు. ఫిబ్రవరి 11వ తేదిన దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమం ఉంటుందని అందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో కూడా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. న్యాయసేవ అధికార సంస్థ ద్వారా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫిబ్రవరిలో జరిగే లోక్ ఆదాలత్‌ను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. లోక్ ఆదాలత్‌లో ఇచ్చిన తీర్పు అన్ని రకాలుగా కోర్టు తీర్పులతో సమానమని అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఇరుపక్షాలకు తగు సమయం ఇచ్చి వారి సమ్మతి ప్రకారమే తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు ఇంకా కోర్టు వరకు రానీ కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ ఆదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకునేవారు ఏకపక్షం వారైన దిని కోరకు సంబందించిన కోర్టులో గానీ లేదా న్యాయసేవ సంస్థలో గానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 30: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసి ఆర్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాంచంద్రాపూర్, మాచన్‌పల్లి గ్రామాల్లో రూ.78లక్షలతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం వసతిని కల్పించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఏడాదిలో రెండు పంటలు పండించుకునేవిధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.