మహబూబ్‌నగర్

పిహెచ్‌సి వైద్యాధికారి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మారుతి నందన్‌గౌడ్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు శుక్రవారం డిఎం అండ్ హెచ్‌ఓ మల్లిఖార్జునప్ప తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి హెల్త్ టీమ్‌లు పిహెచ్‌సిని సందర్శించినప్పుడు ఆసుపత్రిలో లేకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర కారణాలతో సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
పోలీస్ స్టేషనా పార్టీ కార్యాలయామా
* ఎమ్మెల్యే చిన్నారెడ్డి
ఖిల్లాగణపురం, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు టిఆర్‌ఎస్ పార్టీ కలర్ వేయడం ఏమిటని పోలీస్ స్టేషనా పార్టీ కార్యాలయామా అని ఎమ్మెల్యే చిన్నారెడ్డి శుక్రవారం పోలీస్ స్టేషన్ ఏదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిని టిఆర్‌ఎస్ కలర్‌తో నింపేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇది తగదన్నారు. కెసిఆర్ పాలన హీట్లర్‌ను తలపిస్తుందన్నారు. ఎస్‌ఐ గోపాల్ కలర్ మిక్సింగ్‌లో పోరపాటు జరిగిందని వారం రోజుల్లో స్టేషన్‌కు కలర్ వేయిస్తానని చెప్పడంతో శాంతించి ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్‌కుమార్, డీలర్ రమేష్, రామకృష్ణరెడ్డి, దేవుడు, గోవిందు, సర్పంచు మన్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.