మహబూబ్‌నగర్

నేరరహిత జిల్లాగా మార్చేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 4: ఖైదిలలో మానసిక పరివర్తన పెంపొందించడమేకాక వారికి ఉపాధి అవకాశాలు కల్పించి నేరరహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని జైలుశాఖ సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జైలుశాక 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖైదిలకు ఉద్యోగమేళను నిర్వహించారు. ఈ సందర్భంగా జైలుశాఖ సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి మాట్లాడుతూ ఖైదిలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సుమారు 10 కంపెనీలతో ఉపాధి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా ఖైదిలు విడుదలైన తర్వాత మరోసారి నేరం చేయకూడదనే ఉద్దేశ్యంతోనే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సమాజంలో నేరాలు అనేది ఉండకూడదనే ఉద్దేశ్యంతో మహబూబ్‌నగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా జైలుశాఖ ఆద్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టెన్‌కే రన్ ఉద్దేశ్యం నేరరహిత జిల్లాగా మార్చేందుకేనని ఆయన పెర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వెంకటకృష్ణయ్య, వివిధ కంపెనీల యజమానులు తదితరులు పాల్గొన్నారు.