మహబూబ్‌నగర్

కమీషన్ల కోసం కక్కుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, ఫిబ్రవరి 6: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాలలో రాష్ట్ర వణ్యప్రాణుల బోర్డు యురేనియం తవ్వకాల సర్వేకోసం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణతోపాటు పలువురు నేతలు రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క హాజరై మాట్లాడారు. ఈ ప్రాంతంలోని యురేనియం తవ్వకాల ద్వారా ప్రజలకు అనేక రకాల వ్యాదులు వస్తాయన్నారు. ఇక్కడి అడవులతోపాటు రైతులు పండించే పంటలు కూడా కలుషితమవుతాయని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆలోచనలను, అవసరాలను గుర్తించకుండా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకోసమే వారి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ తరువాత టిఆర్‌ఎస్ ప్రభుత్వ బండారం బయటపెడుతామన్నారు. ఈ రెండేళ్లు కూడా తమ ఇష్టానుసారం పని చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం కొంతమంది పోలీస్ అధికారుల ద్వారా ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేసేవారిని అణచివేసి అక్రమ కేసులు పెట్టించాలని చూస్తున్నదని ఆరోపించారు. అలాంటి అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న బంగారు తెలంగాణ అంటే నల్లమల ప్రాంతాన్ని దొంగచాటుగా డిబీర్స్ కంపెనీకి తాకట్టు పెట్టడమేనా అని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఎన్నో హామిలు ఇచ్చిన సిఎం కెసిఆర్ వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇక్కడి ప్రజలు అధైర్యపడవద్దని, రాష్ట్రం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. ఇక్కడ దొరికే ఎలాంటి ఖనిజ నిక్షేపాలైన ఈ ప్రాంత ప్రజల ఆస్తి అని, వారికి చెందాలన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలు నల్లమలలో పోరాటానికి ఆరంభానికి సూచికమాత్రమేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ 2014 కంటే ముందు నల్లమల ప్రాంతానికి ప్రస్తుత ఎంపి కవితతోపాటు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివాసిల పక్షాన నిలబడిపోరాడుతామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. వణ్యప్రాణి బోర్డులో సభ్యునిగా ఉన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు యురేనియం తవ్వకాల అనుమతి తీర్మానంలో ఏవిధంగా సంతకం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అటవీశాఖ మంత్రి జోగురామన్నతో స్పష్టమైన ప్రకటన చేయించాలని లేనిచో ప్రజాక్షేత్రంలో ఆయనను దోషిగా నిలబెడుతామన్నారు. ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎమ్మెల్యే అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన ఆటలు సాగవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కూర్చున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద 10వేల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి కెవిఎన్‌రెడ్డి, ఎస్‌టి సెల్ జిల్లా అధ్యక్షుడు కిషన్‌నాయక్, జెఎసి నాయకులు నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.