మహబూబ్‌నగర్

జిల్లాకు పేరుప్రఖ్యాతలు తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఫిబ్రవరి 7: నడిగడ్డ ఎన్నో కళలకు, కళాకారులకు పేరుప్రఖ్యాతి చెందినదని, విద్వద్గద్వాల జిల్లా పేరుప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలను సాధించాలని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఆకాంక్షించారు. మంగళవారం పట్టణంలోని ఎస్‌వి ఈవెంట్ హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్టులు గమనం, అబ్దుల్ సత్తార్‌లతో పాటు ఎమ్మెల్యే విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ గద్వాల జిల్లా ఉద్యమంలో ఈ ప్రాంత విద్యార్థుల పాత్ర మరువలేనిదని, అన్ని సందర్భాలలో వారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు కదిలామని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు చెందకుండా ఏకాగ్రతతో ఇష్టంగా చదివి రాష్టవ్య్రాప్తం గా ర్యాంకుల్లో జోగుళాంబ గద్వాల జిల్లా పేరు మారుమోగే విధంగా పట్టుసాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గద్వాల జిల్లా ఉద్యమం కోసం ఎన్నో ఉద్యమాలకు తలొగ్గి ఇచ్చారని, తాము పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించి మరోసారి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఇతరత్రా అలవాట్లను దూరంగా ఉంచి ఏకాగ్రతతో ఎలాంటి భయాందోళనలు చెందకుండా చదువుపై దృష్టి సారించి ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి అంశాన్ని మెదడుకు ఎక్కించాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా ఉద్యమంతో పాటు అనేక ఆటుపోట్లు, సైకాలజిస్టుల సూచనలు, సలహాలు, గీతాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వేణుగోపాల్, ప్రైవేట్ విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద ఆర్యా, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ఔషది నమోదులో జిల్లాకు ప్రథమ స్థానం
కలెక్టర్ శ్రీ్ధర్
బిజినేపల్లి, ఫిబ్రవరి 7: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-ఔషధి నమోదు ప్రక్రియలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్టస్థ్రాయిలో ప్రథమ స్థానం లభించడంపట్ల జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వైద్య సిబ్బందిని అభినందించారు. పాలెం పిహెచ్‌సిలో మంగళవారం ఫార్మసిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ-ఔషధిలో రోగుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసిన ఫార్మసిస్టులను అభినందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగి ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసి వైద్య చికిత్సలను అందించాలని, ఈ ఔషధిలో నమోదు చేసుకుంటే గతంలో ఏవిధమైన వైద్యం అందించారో, తిరిగి మళ్లీ వస్తే ఏవైద్యం అందించాలో తెలుస్తుందని, రోగి ప్రాథమిక సమాచారం పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండటంతో ఎంతోమేలు జరుగుతుందన్నారు. బిపిఎల్ దాటివెళ్లి ఆరోగ్యకారణాలతో తిరిగి వెనక్కిరావడం జరిగిందని, ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. వైద్య సిబ్బంది విధులను బాధ్యతతో నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు అందకపోవడంతోనే ఆరోగ్యశ్రీ రావడానికి కారణమైందన్నారు. ఈ ఔషధి ఆన్‌లైన్ నమోదు చేయడంలో వందశాతం పూర్తిచేసిన ఉప్పునుంతల ఫార్మసిస్టు శ్రీనివాసులు, కొల్లాపూర్ ఫార్మసిస్టు రవిలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌వో సుధాకర్‌లాల్, నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మాలతి, వైద్యాధికారులు సాయినాథ్‌రెడ్డి, రంగస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.