మహబూబ్‌నగర్

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, ఫిబ్రవరి 10: గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని నివారించి స్వచ్ఛ గ్రామాలు తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శాగాపూర్, గోప్లాపూర్, వెంగళాయపల్లి, కేతేపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే పారిశుద్ధ్యాన్ని సంపూర్ణంగా నివారించవచ్చన్నారు. రోడ్లపై మురుగునీరు పారుతుంటే రోగాల బారిన పడి ప్రజా జీవనానికి ఆటంకం కలిగి ఆనారోగ్యాల పాలవుతారన్నారు. గ్రామాలలో విద్యార్థులు, యువకులు, మేధావులు పారిశుద్ధ్యం నివారణపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి పనులను ఎక్కువగా చేయిస్తే గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరు కావడం జరుగుతుందని ఆ నిధులతో సిసి రోడ్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రతి కూలీకి పనులు కల్పించాలని, ఉపాధి పనుల పట్ల అలసత్వం వహించరాదని అన్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో కాలనీలలో ఆయన పర్యటించి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఇంటింటికి వెళ్లి ఇంటి యాజమానులతో మాట్లాడారు. వచ్చే మూడు నెలల్లోపు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లను వందశాతం పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో కార్యకర్తలతో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పీటిసి రవికుమార్, విండో వైస్‌చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు గోవర్ధన్ సాగర్, సుదర్శన్‌రెడ్డి, పుల్లారావు, రాజుగౌడ్, బాలరాజు, వీరసాగర్, కృష్ణయాదవ్, పెద్ద బాలరాజు, వెంకటేష్, రాముడు, బాలరాం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు నెలల్లోపు ప్రతి ఇంటికీ నల్లానీరు
మిషన్ భగీరథ ద్వారా ఆరు నెలల్లోపు ప్రతి ఇంటికి నల్లానీరు అందించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో విలేఖరులతో మాట్లాడారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 80శాతానికి పైగా రైతాంగానికి సాగునీరు అందించడం జరిగిందని, గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. హరితహారం ద్వారా నాటిన మొక్కలను బ్రతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పిటిసి రవి, విండో వైస్‌ఛైర్మన్ భాస్కర్‌యాదవ్, నాయకులు గోవర్ధన్‌సాగర్, వీరసాగర్, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.