మహబూబ్‌నగర్

మండలానికో క్రీడా ప్రాంగణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాబుపేట, ఫిబ్రవరి 10: రాష్ట్రంలోని అన్ని మండలాల కేంద్రాల్లో మినీ స్టేడియం గ్రౌండ్లు నిర్మించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఉపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్‌ను మంత్రి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు క్రీడాభిలాషను కలిగి ఉండాలని, క్రీడలను అబివృద్ధి పరిచేందుకే ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం మినీ స్టేడియం గ్రౌండ్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతుందని పెర్కోన్నారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశ పేరు ప్రఖ్యాతలను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేస్తాయని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించినప్పుడే వారు క్రీడల్లో రాణించగలుగుతారని అందుకే ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీఠ వేస్తుందని అన్నారు. విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల అభివృద్ధిని పెంపొందించుకోవాలని, విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన ఉద్బోదించారు. క్రీడాకారులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వాటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లోని విద్యార్థిని, విద్యార్థులు కూడా తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా క్రీడలకు, విద్యాభ్యాసానికి కేటాయించాలని ఆయన పెర్కోన్నారు. నవాబుపేట వాలీబాల్ అసోసియేషన్ జాతీయ స్థాయి క్రీడాకారులతో ఒపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని క్రీడాకారులంతా మంచ వాతావరణంలో క్రీడల్లో పాల్గొనాలని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో జాతీయస్థాయిలో తెలంగాణ క్రీడారంగాన్ని మొదటిస్థానంలో ఉంచుతుందని ఆయన పెర్కోన్నారు. ఈ అవకాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఇందిరాదేవి, ఎంపిపి శ్రీనయ్య, గ్రామసర్పంచ్ వీరప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహచారి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.