మహబూబ్‌నగర్

కెసిఆర్‌ది దౌర్భాగ్యమైన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 11: తెలుగుదేశం పార్టీ ఊటబావిలాంటిదని తవ్వినకొద్ది స్వచ్చమైన నీరు వస్తుందని నీళ్లు తీసుకోనోడ్కే ఆలసిపోవాలే తప్పా. ఊటను ఆపేశక్తి దుర్మర్ఘుడు, సన్యాసి కెసిఆర్‌కు చేతకాదని టిటిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం కోసం టిడిపి ప్రజాపోరు బాటకు శ్రీకారం చుట్టిందని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఈ పోరుబాట కెసిఆర్ గదికి తగులుతుందని ఆయన హెచ్చరించారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ప్రజాపోరుబాటకు శ్రీకారం చుట్టారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు తరలిరావడంతో బహిరంగసభకు హజరైన నాయకులు కెసిఆర్‌పై, రాష్ట్ర మంత్రులపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజాపోరు బహిరంగసభలో టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో దౌర్భగ్యమైన పాలన కొనసాగుతుందని కెసిఆర్ మోసగాడిగా తయారు అయ్యారని తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నాడని ద్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే కొల్లాపూర్ నుండి ప్రజాపోరుబాటతో మరో పోరాటానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ వేదిక నుండి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేస్తున్నానని వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో పేదల డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు రూ.17వేల కోట్లు, దళిత గిరిజనుల భూపంపిణీకి రూ.20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం 12వందల మంది విద్యార్థులు, యువకులు బలిదానం చేసుకుంటే అలాంటి వారి కుటుంబాలను కెసిఆర్ అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ తెలంగాణ ఆమరవీరులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టిన తప్పులేదని రేవంత్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యాలు చేశారు. కెసిఆర్‌ను ప్రజలు పట్టుకుని చెంపలు వాసేలా కొట్టాలని పిలుపునిచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రెండు నెలల్లో తెరిపిస్తానన్న కెసిఆర్ రెండున్నర ఏళ్లు దాటిన ఆ ప్యాక్టరీని తెరిపించకుండా అసెంబ్లీలో నిజాం షుగర్ ప్యాక్టరీ ముగిసిన అద్యాయం అని చెప్పడం అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌తో బుద్ది ఉన్నోడు పొత్తుపెట్టుకోడని మనిషి అన్నోడు కెసిఆర్‌తో జతకట్టడని గతంలోనే 2004లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న కెసిఆర్ అప్పుడే కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడని 2009లో టిడిపితో పొత్తు పెట్టుకుని ఎంపిగా గెలిచిన తర్వాత టిడిపిని కూడా మోసం చేసిన ఘనుడని 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని సోనియాగాంధీని కూడా మోసం చేసిన దుర్మర్ఘుడితో పొత్తు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌తో టిడిపి భవిష్యత్తులో ఎప్పుడు పోత్తు పెట్టుకోదని కెసిఆర్ మరో కొత్త డ్రామాకు తెరలేపి తెలుగుదేశం కార్యకర్తలకు అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ గదిని కూల్చేవరకు నిద్రపోనని కార్యకర్తల అండతో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. నిరుద్యోగుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం ఆడుతున్నారని ఉద్యోగ నియమాకాల్లో డిగ్రీలో ఎక్కువ మార్కులు వచ్చిన వారే అర్హులని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అలా అయితే కెసి ఆర్ కొడుకు కెటి ఆర్ తెలంగాణలో మంత్రి పదవి చేయడానికే అర్హుడు కాడని ఆయన చదువుకున్నది గుంటూరు, పుణ్నె, ఆమెరికాలోనని అలాంటి వాడు రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. దేశంలోనే 3000వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్ర తెలంగాణ అని కెసిఆర్ అనే దుర్మర్ఘుడి పాలనలో రైతుల కష్టాలు మరింత పెరిగిపోయాయయని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రొడెంషియల్ బ్యాంకుకు రూ.20కోట్లు తొకారా పెడితే ఆయన కొడుకు అరుణ్ ఎస్‌బిఐ బ్యాంకుకు రూ.60కోట్లు మోసం చేశారని ఆరోపించారు. త్వరలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు సిబిసి ఐడి అదుపులోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంటే కెసిఆర్‌కు భయం పట్టుకుందని ఆయన ఆందోళన చెందుతున్నారని ఎద్దెవా చేశారు. ఈ బహిరంగసభలో టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రాజ్యసభ సభ్యుడు మోహన్‌రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి, ఎర్రశేఖర్, సీతమ్మ, కొల్లాపూర్ టిడిపి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్, ఉమ్మడి మహబూబ్‌నగర్ టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

19 నుంచి ప్రభుత్వంపై ఆందోళన

నవాబుపేట, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ మల్లురవి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మల్లురవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అధికారం చేజిక్కుంచుకోవడానికి టిఆర్‌ఎస్ పార్టీ అనేక హామీలను గుప్పించిందని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం ప్రజలకు అనేక హామీలను ప్రభుత్వం ఇచ్చిందని ఆయన పెర్కోన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నేరవేర్చలేక పోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 19 నుండి 22వ తేది వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జ రుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి వారిని రాబోయే ఎన్నికలకు కార్యోముఖులుగా తీర్చిదిద్దడం కోసమే ఈ ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వారు పాల్గొనేలా కృషి చేయాలని మల్లురవి కోరారు. అనంతరం నవాబుపేటలో నిర్వహిస్తున్న ఒపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్‌ను సందర్శించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లా రవి, పార్టీ నాయకులు మల్లేస్‌యాదవ్, రాములు, కొండల్ తదితరులు పాల్గొన్నారు.
17నుంచి పోలేపల్లి జాతర
కోస్గి, ఫిబ్రవరి 11: కోస్గి మండల పరిధిలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఈ నెల 17న జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వాయంభూగా వెలసిన పోలేపల్లి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను ప్రతియేట ఫిబ్రవరి మూడవ వారంలో నిర్వహిస్తామని అదేవిధంగా ఈ సంవత్సరం అ త్యంత వైభవంగా అమ్మవారి జాతర ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.

దుందుభి వాగులోకి
కెఎల్‌ఐ నీరు
తాడూరు, ఫిబ్రవరి 11: పాపగల్లు దుందుభీ వాగులోకి కెఎల్‌ఐ కాలువల ద్వారా వచ్చిన నీటిని శనివారం వదిలారు. దుందుబీవాగు శివారులో భూగర్భ జలాలు పెరగడంతోపాటు వాగులో ప్రవహిస్తున్న నీటితో యా సంగి పంటలకు నీరు అందించవచ్చ ని పలువురు రైతులు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకొని రాగా, ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ద తీసుకొని కెఎల్‌ఐ కా లువ పనులను యుద్దప్రాదిపతికన పూర్తి చేయించి, దుందుభీవాగులోకి నీరు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాపగల్లు సర్పంచ్ అనిల్‌కుమార్‌రెడ్డి, రైతులు ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

టిడిపికి పూర్వవైభవం తీసుకొస్తాం
పెద్దకొత్తపల్లి, ఫిబ్రవరి 11: టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు రమణ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్యకర్తలనుద్దేశించి రమణతోపాటు వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డిలు మాట్లాడుతూ గతంలో పార్టీ ఏవిధంగా ఉందో అదేస్థాయికి పార్టీని తీసుకొస్తామన్నారు. పార్టీ బలొపేతానికి ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలని పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రా వుల చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, కురుమూర్తి, స త్యం ఉన్నారు.

వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవండ

గద్వాల, ఫిబ్రవరి 11: కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరుపుకున్న దేవదేవుడైన శ్రీ చెన్నకేశవస్వామి ఉభయ దేవేరులతో కలిసి దివ్యరథాన్ని అదిష్ఠంచి కన్నులపండువగా గద్వాల తిరువీధులలో ఊరేగిన అపూర్వ ఘట్టం శుక్రవారం రాత్రి అందరిని తన్మయత్నంలో ముంచెత్తింది. రథోత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్నాటకకు చెందిన భక్తులతో గద్వాల పురవీధులు కిక్కిరిసి పోయాయి. రాఘవేంద్ర మఠం ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను శోభయమానంగా అలంకరించి మంగళవాయిద్యాల నడు మ పల్లకిలో ఊరేగిస్తూ మొదట రథం వద్దకు తీసుకవచ్చారు. మంగళవాయిద్యాల కోలాహలం, గోవిందనామ స్మరణల మధ్య రాత్రి 11.30 గంటలకు శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వా మి రథోత్సవాన్ని భక్తులు పోటీపడి లాగారు. పగ్గాలు చేతపట్టి రథాన్ని లాగేందుకు గోవిందనామస్మరణలతో ఉర్రూతలూగారు. రథోత్సవానికి ముందు స్థానిక రథశాల దగ్గర మంత్రాలయ మఠం పీఠాధిపతి శ్రీ 1008 సుబుదేంద్రశ్రీపార్థుల వారు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 50వేల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. రథోత్సవం రోజు చెన్నకేశవస్వామిని దర్శించుకుంటే పాపపరిహా రం అవుతుందని భక్తుల విశ్వాసం. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు గట్టిబందోబస్తును నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమం రాత్రి 12.30గంటల వరకు శోభయమానంగా కొనసాగింది. ప్రత్యేకంగా చేయించిన బాణసంచపేలుళ్లు పట్టణ ప్రజలను తన్మయత్నానానికి గురి చేశాయి. శనివారం ఉదయం స్వామివారి సన్నిదిలో నిత్యపూజా కార్యక్రమాలు వేదపండితులు కొనసాగించారు. సాయంత్రం గజవాహనసేవలో చెన్నకేశవుడు ఊరేగాడు. మంత్రాలయ మఠం అధికారులు, భక్తులకు ప్రసాదవితరణ చేశారు.

12న కార్మికుల సదస్సు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 11: పెంచిన లైసెన్స్ ఫిట్‌నెస్ సర్ట్ఫికేట్, కొత్త పనిష్‌మెంట్ విధానంపై ప్ర బుత్వం జారీ చేసిన జీవో 80ని రద్దు చేయాలని, రవాణా రంగ కార్మికులపై ఆర్టీవో వేధింపులను ఆపాలని కోరుతూ ఈనెల 12న రవాణా రంగ కార్మికుల రాష్ట్ర సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి పొదిల రామయ్య అన్నారు. ఈ సదస్సుకు సంబందించిన పోస్టర్‌ను ఆటో యూనియన్ కార్మికుల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ మోటారు వాహన రూల్స్ 45ఎలో పలు సవరణలు చేస్తూ జీవో 80ని తీసుకొనివ చ్చి రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించి రాష్ట్ర సదస్సుకు కార్మికులంతా విధిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

కలుషితాహారంతో చిన్నారులకు అస్వస్థత
దేవరకద్ర, ఫిబ్రవరి 11: కలుషిత ఆహారం తిని చిన్నారుల అస్వస్థతకు గురైన సంఘటన దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్‌సాగర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్‌సాగర్ గ్రామంలో మహముద్ హోటల్‌లో ఉగ్రాని (బోరుగుల అన్నం) తిన్న ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దింతో వారిని హుటాహుటిన దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపిపి ఇవి గోపాల్ చిన్నారుల తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల అస్వస్థతకు కారణం కలుషిత ఆహారమేనని వైద్యులు తెలిపారు. దింతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై శ్రద్ద వహించి కలుసిత ఆహారం తినకుండా చూడాలని వారిని వైద్యులు హెచ్చరించారు.
లక్ష్మీనారాయణస్వామి కల్యాణం

బాలానగర్, ఫిబ్రవరి 11: బాలానగర్ మండల పరిధిలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం లక్ష్మీనారాయణస్వామి క ళ్యాణం కమనీయంగా అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ డ్చర్ల నియోజకవర్గంలోని వివి గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కురుమూర్తి వేదపండితులు స్వామివారి కళ్యాణంలో మంత్రోచ్చరణ చేశా రు. ఈ సందర్భంగా దుశ్యంత్‌రెడ్డి, అనురుద్‌రెడ్డి భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. సుబ్రహ్మణ్య దిక్షితులు నిర్వహించిన అన్నమాచర్య కిర్తనలు భక్తులను ఆలరింపజేశాయి. దానగందర్వు లు, గిన్నిస్ రికార్డు పొందిన ఆయన, జనుంపల్లి వంశస్థులు దిలిప్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నల్గొండ జిల్లా సూర్యపేట బృందం ఆలయ ప్రాంగణంలో కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు ఆడిన ఆటపాటలతో భక్తులను కనువిందుచేశారు. జిల్లా స్థాయి భజన పోటిలను నిర్వహించారు. ఈ పోటీలు జనుంపల్లి సాకేత్‌రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించారు. దింతో పాటు రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలను అనురుద్‌రెడ్డి యువసేన ఆద్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలు ఇతేష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, ఎంపిటిసి శమంత, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 11: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన క్యాంపుకార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టుకాగా, హైకోర్టుతోపాటు ఇతర కోర్టులకు మాత్రం తాగునీటి ప్రాజెక్టులుగా చూపుతుందని, వాస్తవ పరిస్థితులను ఎందుకు కప్పిపుచ్చుతున్నారో అర్థంకావడంలేదన్నారు. కెఎల్‌ఐ ప్రాజెక్టులోని గుడిపల్లి లిప్టునుంచి నీటి పంపిణీ నిలిపివేశారని, దీనితో చాలా చెరువులు, కుంటలు నిండని పరిస్థితి ఏర్పడిందన్నారు. కెఎల్‌ఐ నుంచి సాగునీరు వస్తుందనే ఆశతో రైతులు యాసంగిలో వేరుశనగ, వరి పంటలను వేసుకున్నారని, అర్ధాంతరంగా మోటార్లను నడపకుండా ఆపుదల చేయడంతో చేతికివచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కెఎల్‌ఐ పరిధిలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి ని యోజకవర్గాలలోని ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉందని, ఇందుకోసం ఆయా ప్రాంతాలలో ఉన్న చెరువులు, కుంటలను కెఎల్‌ఐ నీటితో నింపి ఆయకట్టుకు నీరు అందిస్తామని అటు అధికారులు, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడంతో రైతులు చాలా మంది యా సంగిలో వివిధ పంటలను సాగు చేయడం జరిగిందన్నారు. ఈ పంటలను కాపాడేందుకు నిలిపివేసిన మోటార్లను వెంటనే నడిపించాలని నాగం శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థంరవి మాట్లాడుతూ రూ.29,500 కోట్లతో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు స్వయంగా సిఎం కేసిఆర్ కర్వెనలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రకటించడం జరిగిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తాగునీటి కోసమైతే రూ.6500 కోట్లతో మిషన్ భగీరథ ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. సింగిల్‌విండో అధ్యక్షులు బొల్లారం వెంకట్రాములు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాటప్రకారం ఈ ప్రాంతంలోని అన్నీ చెరువులను, కుంటలను కెఎల్‌ఐ నీటితో నింపాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు కాలువ పనులు చేయకపోతే రైతులు స్వయంగా తలాకొంత డబ్బులు వేసుకొని చెరువులకు నీరు వచ్చేందుకు కాలువలను తవ్వుకున్నారని తెలిపారు. గుడిపల్లికి దగ్గరలో ఉన్న అవురాసిపల్లి, నాగనూలు, నాగర్‌కర్నూల్, నల్లవెల్లి తదితర గ్రామాలలోని చెరువులు ఇంకా నిండనందున వెంటనే మోటార్లను నడిపించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. కాశన్న మాట్లాడుతూ కెఎల్‌ఐ మొదటి లిప్టు సమీపంలో పిఆర్‌ఎల్‌ఐ అండర్‌గ్రౌండ్ పంపుహౌజ్ నిర్మిస్తే ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. పావని, లక్ష్మ య్య, కుర్మయ్య, నసీర్, లక్ష్మీనారాయణ, రాంచంద్రారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.