మహబూబ్‌నగర్

కెసిఆర్ మోసం చేస్తుండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు విభాగాలుగా విభజించాలని అప్పుడే అన్ని ప్రాంతాల రైతులకు మేలు జరుగుతుందని టిపిసిసి ఉపాధ్యక్షురాలు, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలో జాలీహిల్స్ మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డికె అరుణ మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే ప్రాజెక్టుకు ఎన్నో అవంతరాలు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడం లేదన్నారు. కాకాపోతే రైతుల పక్షాన మాత్రం వారికి అందిచాల్సిన పరిహారం అందివ్వాలనే డిమాండ్‌ను కూడా అడగకూడదంటే ఇది కెసిఆర్ నియంత పాలనకు నిదర్శనమని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు డిజైన్ మార్పు పెద్దతప్పిదమని అన్నారు. కెసిఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తూ పోతున్నారని దాంతో ప్రభుత్వంపై మరింత భారం పడటమే కాకుండా పనులు ఆలస్యంగా జరగనున్నాయని ఏళ్లు దాటిన ప్రాజెక్టులు పూర్తికావని అన్నారు. ముఖ్యమంత్రి పాలమూరు ప్రాజెక్టును రెండు విభాగాలుగా విభజించి జూరాల ప్రాజెక్టు నుండి కొన్ని నియోజకవర్గాలకు ఉపయోగపడేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగితే బాగుంటుందని సూచించారు. అదేవిధంగా మరో భాగం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నీటిని సేకరించినట్లైతే మరింత ప్రయోజనం ఉంటుందని అలా కాకుండా ముఖ్యమంత్రి తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని దాంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు శ్రీశైలం నుండి నీటిని తీసుకువస్తామని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. ప్రజలను ఇంకా కెసిఆర్ కల్లిబొల్లి మాటలతో మోసం చేస్తున్నారని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలని ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు చెప్పేమాటలు కేవలం వారి ప్రచారానికి మాత్రమే పనికి వ స్తున్నాయని ఎద్దేవా చేశారు. నయూం విషయంలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణకు ఇంకా కట్టుబడి ఉందని దమ్ముంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వం సిబిఐ విచారణ చేపడితే ఎవరి సంగతి ఎలా ఉంటుందో తేలిపోతుందని అన్నారు. గురుకుల నోటిఫికేషన్ విడుదల విషయంలో తప్పుడు నిర్ణయాల కారణంగా సమస్యలు తలెత్తాయని నిరుధ్యోగులు, యువత కెసిఆర్ తీసుకున్న నిర్ణయన్ని వ్యతిరేకించి ఉస్మానియ యూనివర్శీటీలో ఆయన దిష్ఠిబొమ్మను కాల్చితే తప్పా సోయిరాలేదని దుయ్యాబట్టారు. మాటల గారఢితో ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని కెసిఆర్ మాటలను నమ్మి ప్రజలు 2014 ఎన్నికల్లో మోసపోయారని ప్రస్తుతం అప్రమత్తం అవుతున్నారని కేవలం ఆయనకు కొన్ని సంస్థల ద్వారా తనకు అనుకూలంగా సర్వెలు చేయించుకుని వాటిని భయటపెట్టించుకుని ఆ తప్పుడు సర్వెలకు విపరీతమైన ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు ఆదరించేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని టిఆర్‌ఎస్ నాయకుల ఆటలు ఇకసాగవని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ విరారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ ఇంచార్జి పవన్‌కుమార్‌రెడ్డి, బిసిసెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన ఉద్ధృతం చేస్తాం
అమ్రాబాద్, ఫిబ్రవరి 12: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాలలో ప్రభుత్వం తక్షణమే యురేనియం తవ్వకాల సర్వేను రద్దు చేయకపోతే ప్రజాందోళనను ఉదృతం చేస్తామని అచ్చంపేట మాజి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. యురేనియం తవ్వకాలకోసం సర్వే నిర్వహించుచుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో ఈ ప్రాంతంలోని అన్నీ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే సర్వే అనుమతులను రద్దు చేయాలని, లేనిచో కాంగ్రెస్‌తోపాటు మిగతా రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి యురేనియం తవ్వకాల వ్యతిరేక జెఎసిగా ఏర్పడి ప్రజాందోళన కార్యక్రమాలాను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద 10వేల మందితో ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసేవరకు తెలంగాణ ఉద్యమం తరహాలో నల్లమలలో యురేనియం వ్యతిరేక ఉద్యమాన్ని చేపడుతామని అన్నారు.

2019 గెలుపే లక్ష్యం: డికె

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12: 2019 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని అందుకు ఇప్పటి నుండే గ్రామాలలో పార్టీ కార్యక్రమాలను విస్తరింపజేయాలని మాజీ మంత్రి డికె అరుణ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్ సమీపంలో గల జాలిహిల్స్‌లోని మీటింగ్‌హాల్‌లో నారాయణపేట, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ఎన్‌ఆర్‌ఐసెల్ టెక్నాలజీ లీడర్‌సీఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తునా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మాజీ మంత్రి డికె అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి భవిష్యత్ ఉందని అన్నారు. తెలంగాణ ఒక రాష్ట్రం ఇచ్చినందుకే దేశం మొత్తంమీద కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతనష్టం జరిగిన పర్వాలేదనే కచ్చితమైన నిర్ణయంతో సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని అధికారం తప్పకుండా మనకు వస్తుందని అన్నారు. నాయకులు కార్యకర్తల గురించి పట్టించుకోవాలని నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడిని ప్రజలు ఎల్లప్పుడు తమ నాయకుడంటూ గుర్తు చేసుకుంటారని ఎన్నికల సమయంలో అలాంటి నాయకులకు తప్పకుండా ప్రజలను అధికారాన్ని ఇస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఇక కార్యకర్తలు భయపడాల్సిన అవసరంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సహజమేనని వాటిని కార్యకర్తలు పట్టించుకోవద్దని ప్రజల మధ్యనే ఉంటూ కార్యకర్తల కోసం పని చేసే నాయకుడి వెంట ఉండాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ పత్రికలను, మిడియాను తన గుప్పెట్లో పెట్టుకుని వారిని కూడా నిర్భందంలోకి నెట్టారని ఆరోపించారు. కెసిఆర్ కళ్లు తెరవాలంటే మిడియాకు వేసిన సంకెళ్లు తెగాలంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున ప్రజాహిత కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే ఆందోళనలు కార్యక్రమాలు చూసి మిడియానే ఉరికివచ్చి కాంగ్రెస్ ప్రచారం చేసేలా ఉండాలి అన్నా రు. నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తప్పకుండా వస్తుందని 2019 ఎన్నికల్లో పే టపై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని అన్నారు. ఎన్‌ఆర్‌ఐ సెల్ వారు సోషల్ మిడియాపై కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కల్పిస్తున్న అవగాహన ఎంతగానో ఉపయోగపడనుందని వారిని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని 24 గంటలు జెండా మోసిన నాయకులకు, కార్యకర్తలకు ఎన్నికల సమయంలో మోసం జరుగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గ్రామ స్థాయిలో ఓట్లులేని నాయకులు కేవలం ఢిల్లీలో త మకు ఉన్నటువంటి పరిచయాల కారణంగా టికెట్లు తెచ్చుకుని కార్యకర్తలకు భారం అవుతున్నారని దాంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులే జరిగాయని గుర్తు చేశారు. గ్రూపు రాజకీయాలకు నాయకులు స్వస్తిపలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. డిసిసి అధ్యక్షుడు ఉబెద్దుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వినియోగించుకుంటే పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ కేవలం సోషల్ మిడియాను ఎంతగానో ఉపయోగించుకుని యువతను ఆకర్శించుకున్నారని అన్నారు. సోషల్ మిడియాను 10 శాతం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపయోగించుకుంటే దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. యువత పార్టీకి ఎంతో ముఖ్యమని ఇలాంటి కార్యక్రమాలతో యువతను ఆకట్టుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, రాజేందర్‌గౌడ్, వీరారెడ్డి, పటేల్ వెంకటేష్, షమీమ్, వినోద్, క్రిష్టకిషోర్, చైతన్య, హర్ష పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ ఆదర్శం

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12: మహబూబ్‌నగర్ పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనుగొండ దగ్గర రూ.32 లక్షలతో నూతనంగా నిర్మాణం చేస్తున్న సిసి రోడ్డుపనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణాన్ని గత పాలకులు విస్మరించారు. కేవలం జిల్లా కేంద్రంగా చెప్పుకున్నారే తప్పా ఇక్కడికి నిధులు తెచ్చి అభివృద్ధి చే యడం మరిచిపోయారని అన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడ్డాక మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మహార్ధశ తిరిగిందన్నారు. పాలమూరు పెద్ద చెరువును పట్టించుకున్న నాథుడులేరని ఆ చెరువు కట్ట తెగడానికి సిద్దంగా ఉండేదని అయితే ప్రభుత్వం తీ సుకున్న నిర్ణయంలో భాగంగా మినీ ట్యాంకుబండ్ నిర్మాణాలకు పెద్ద చెరువునుండే శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే రూ.10 కోట్ల నిధులు వ చ్చాయని వాటిని ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. చెరువుకు అనుకుని ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని దాదాపు ఆరు ఎకరాల భూమిలో సే టడియం నిర్మాణం జరగనుందన్నారు. కనివిని ఎరుగురని రీతిలో నక్షత్ర వనం, హరిత వనం మయూరి నర్సరీలో దాదాపు 200 ఎకరాల్లో ఆపనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. మార్చి చివరి నాటికి మన్యంకొండ గుట్టపై నుండి మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గ ప్రజలకు మంచినీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. దాదాపు వాటర్‌గ్రిడ్ మొదటి దశలోనే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని దాదాపు 65 గ్రామాలకు స్వచ్చమైన మంచినీటిని అందిస్తామని అన్నారు. మహబూబ్‌నగర్‌లో బైపాస్ రోడ్డు మ ంజూరు అయిందని అందుకుగాను రూ.90 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్వే పనులు పూర్తి అయ్యావని వెల్లడించారు. పట్టణంలో రూ.33 కోట్లతో రోడు వెడల్పు పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలలో సిసిరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. అందులో భాగంగా ఎనుగొండలో రూ.32 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. మరో రెండేళ్లలో మహబూబ్‌నగర్ పట్టణం సుందరవందనంగా తయారు అవుతుందని తెలిపారు. రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడ్డమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. పట్టణ అధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, కౌన్సిలర్ జ్యోతి, నాయకులు నర్సిములు, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థినే గెలిపించాలి

ధన్వాడ, ఫిబ్రవరి 12: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కటేపల్లి జనార్థన్‌రెడ్డికే ఉపాధ్యాయులు ఓటు వేసి గెలిపి ంచాలని నారాయణపేట ఎమ్మెల్యే రా జేంధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మరికల్ మండలంలోని జిల్లా పరిషత్ బా లుర ఉన్నత పాఠశాలలో పిఆర్‌టియు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేట ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల వౌళిక వసతులను కల్పించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పాఠశాలలకు నూతనంగా అదనపు భవనాలు అనేక స ంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ ప్రభు త్వం మంజూరు చేయాడం జరిగిందన్నారు. ధన్వాడ, మరికల్ మండలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కటేపల్లి జనార్థన్‌రెడ్డినే గెలించాలని ఆయన కోరారు. పిఆర్‌టియు అధ్యక్షులు తిమ్మరెడ్డి, నారాయణపేట మార్కెట్ క మిటి వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఎల్.బుచ్చప్ప, ఆశోక్‌కుమార్, రామస్వామి, నాగేశ్వర్‌రెడ్డి, రాజావర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సమసమాజ స్థాపనే సిపిఐ లక్ష్యం

మానవపాడు, ఫిబ్రవరి 12: సమ సమాజ స్థాపనే సిపిఐ లక్ష్యం అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉండవెల్లి మండల పరిధిలోని కంచుపాడు గ్రామంలో సిపిఐ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి మా ట్లాడుతూ సిపిఐ అనుబంధ సంస్థలైన విద్యార్థి, కా ర్మిక, వ్యవసాయ సంఘాలను బలోపేతం చేసి ఆ యా విభాగాలలో సమస్యలను పరిష్కరించి ప్రజా మన్ననలు పొందాలని సూచించారు. అన్ని వర్గాలతో సత్సంబంధాలు పెంపొందించుకొని సిపిఐ పార్టీ అందరివాడిగా ఉండాలని కోరారు. రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలపై కొరడా ఝలిపిస్తున్న సిపిఐ పార్టీకి నక్సలిజంతో సంబంధాలున్నాయని బూచిగా చూయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ రసాయనాలతో నష్టపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం ధారుణమన్నారు. అధికారం కోసం తహతహలాడుతున్న రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఐ అనుబంధ సంఘాలను గుర్తించటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుల మతాలకతీతంగా వ్యవసాయ, కార్మిక వర్గ సంక్షేమానికై సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఒక ఎకరా లేని పేద రైతులు అనేక మం ది ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి నుంచి పది ఎకరాలున్న రైతులు సాగునీరు లేక పంట నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారని ఆయన వివరించారు. ఏఐటియుసి జాతీయ అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సి పిఐ మండల అధ్యక్షులు పెద్దబాబు, కపిల్, బాబన్న, సత్యరాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేశ్‌బాబు, నర్సింహులు, సురేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టును విభజిస్తేనే సత్వర పరిష్కారం
వనపర్తి, ఫిబ్రవరి 12: ఉమ్మడి హైకోర్టును విభజిస్తేనే పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరం పరిష్కారమవుతాయని న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ్మరెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి శ్రీసరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు విభజనతో కేసులు సత్వరం పరిష్కారం కావడంతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. హైకోర్టులో 61 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా 22 మంది మాత్రమే ఉన్నారని దీంతో పెండింగ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కక్షిదారులు సంవత్సరాల కొలది కోర్టుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా కోర్టుల్లో కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు అంగీకరిస్తే ఆరు నెలల్లో హైకోర్టు విభజన జరిగిపోతుందని ఆయన అన్నారు. అందుకోసం న్యాయవాదుల సంఘం తరపున ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకోస్తున్నామని ఆయన వివరించారు.
సంత్ రవిదాస్ జయంతి వేడుకలు
ధన్వాడ. ఫిబ్రవరి 12: పాలమూరు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈనెల 14న సంత్వ్రిదాస్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా దళితమోర్చ అధ్యక్షుడు నారా కొండయ్య తెలిపారు. ఆదివారం విలేఖరుల సమావేశంలో కొండయ్య మాట్లాడుతూ పాలమూరు జిల్లా కేంద్రంలో 14న సంత్వ్రిదాస్ జయంతి వేడుకలు, సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్య అథితులుగా ఎమ్మెల్సీ రాంచంద్రరావు, రాష్టక్రోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షులు పద్మజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు, రాష్ట్ర కమిటి సభ్యులు రతంగ్‌పాండురెడ్డి హాజరవుతారని తెలిపారు.

వేరుశనగ, కంది కొనుగోలు కేంద్రాలను
పరిశీలించిన నిరంజన్‌రెడ్డి

పెబ్బేరు, ఫిబ్రవరి 12: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ, కంది కొనుగోలు జోరందుకోవడంతో ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్కెట్ యార్డులో నూతనంగా ప్రా రంభమైన గోదాములు, కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. మార్కెట్‌లోకి తమ ధన్యాన్ని అమ్ముడపోకుంటే గోదాములలో నిల్వ చేసుకోవచ్చునని రైతులకు తెలిపారు. లైటింగ్, డ్రింకింగ్ వాటార్ తదితర వసతులపై అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కు పాన్‌గల్, పెద్దమందడి, ఆత్మకూరు, వీపనగండ్ల మండలాల రైతులు పెబ్బేరు మార్కెట్ యార్డుకు వేరుశనగ, కందులు ఎక్కువగా తీసుకురావడంతో మార్కెట్‌లో ఎఫ్‌సిఐ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కు కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఈ మార్కెట్ యార్డుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో దళారి వ్యవస్థ, హమాలిలు, దడబాయి సమస్యలు లే వు. రైతులు అమ్మిన ధన్యానికి డబ్బు లు నేరుగా తమ ఖాతల్లో జమకావడం జరుగుతుంది. మార్కెట్‌కు ఆదివారం ధాన్యం ఎక్కువగా వచ్చింది. మార్కెట్‌లో వేరుశనగకు రూ.5512, కందులు మద్దతు ధర రూ.5050తో 488 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు హరిశంకర్ నాయుడు, రాంపూర్ సర్పంచు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.