మహబూబ్‌నగర్

మైనారిటీలకు విద్య, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం రూ. 1200కోట్లు బడ్జెట్‌లో కేటాయించి ఖర్చుచేయడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించి మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వెల్ఫెర్ సలహదారుడు ఎకె ఖాన్ తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మై నారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని గతంలో కన్న మూడింతలు అధికంగా నిధులు ఖర్చు చేసి అభివృద్ధికి తో డ్పాటును అందిస్తుందన్నారు. మైనారిటీల సం క్షేమం కోసం ఏకంగా రూ.1200కోట్లు బడ్జెట్ లో కేటాయించి ఖర్చుచేస్తుందన్నారు. మైనారిటీ వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్యా, ఉపాధి అవకాశాలే అవసరమని భావించిన ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కెజిటుపిజి విద్యను మైనారిటీలకు కూడా అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 201 గురుకులలను ఏర్పాటు చేయబోతుందన్నారు. 2016 -17 సంవత్సరంలో 71గురుకులాలు ప్రా రంభం జరుగుతుందని 2017-18 సంవత్సరానికి గాను 130 గురుకులలను ప్రారంభిస్తామన్నారు. 12 సోషల్ వెల్ఫెర్ హస్టళ్లను కూడా ఇందులో విలీనం చేయడం జరుగుతుందన్నారు. కొత్త ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కేవలం బాలికలకు ఇందులో 101 గురుకులలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలల్లో 640 మంది విద్యార్ధులు వారికి భోదించేందుకు 32 మంది ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ.28కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. యూనివర్సిటీల కన్న అత్యధిక సౌకర్యాలను కల్పించి పిల్లలకు విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గురుకులల్లో 7వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండగా అం దులో 2080మంది కేవలం మైనారిటీ గురుకులలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. సర్విస్ కమీషన్ ద్వారానే రిక్యూట్‌మెంట్ విధానం జరగనుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు 21 గురుకులల్లో మొదటి విడతలో రానున్నాయని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతారని తెలిపారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయ ఎంపికలో ము ందుగా, ప్రభుత్వం అనుకున్న విధంగా 60శాతానికి బదులు
50శాతానికి కుదించడం జరిగిందని ఇంకా స్పష్టత రావల్సి ఉందన్నారు. గురుకులల్లో చేరే విద్యార్థులకు, ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యేవారికి కోచింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ముందుగా రాష్ట్రంలో 12కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి కల్పన విషయానికి వస్తే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే సబ్సిడి రుణాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. అయితే బ్యాంకులలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అంశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. రాష్టస్థ్రాయి, జిల్లా స్థాయి కమిటీలతో చర్చించి ఉపాధి అవకాశాలకు సంబందించిన రుణాలను త్వరితగతిన ఇవ్వడానికి ప్రయత్నం కొనసాగుతుందన్నారు. విలేఖరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివకుమార్‌నాయుడు, ఆర్డిఓ లక్ష్మీనారాయణ, మైనారిటీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురుకుల పాఠశాల నిర్మాణానికి కావల్సిన స్థలాలను ఆల్‌మదిన కళాశాల సమీపంలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.