మహబూబ్‌నగర్

నిపుణులతో చర్చించాకే పాలమూరు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని తెలంగాణ ఏర్పాటు కోసం తెగించి పోరాటం చేశారని సకలజనుల సమ్మె దేశంలోనే చరిత్రలో నిలిచిపోయిందని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని సుదర్శన్ గార్డెన్ కనె్వక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన టిఎన్‌జిఓ 70వ వసంతల వేడుకల్లో భాగంగా జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వసంతాల వేడుకకు మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యే, పలువురు టిఎన్‌జిఓ కేంద్ర కమిటీ నాయకులు, రాష్ట్ర నాయకులు హజరయ్యారు. ఈ సందర్భంగా టిఎన్‌జిఓ 70 సంవత్సరాల పాటు నిర్వహించిన పాత్రపై టిఎన్‌జిఓ జిల్లా చైర్మన్ నివేదికను విడుదల చేసి అందరికి వినిపించారు. టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చరిత్రలో లిఖించదగ్గ విషయమని అందులో టిఎన్‌జిఓల పాత్ర ఎనలేనిదన్నారు. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవిర్భావం చెందాక ప్రెండ్లీ గవర్నమెంట్‌గా అభివర్ణించారని అదే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను దశల వారిగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆర్థికపరమైనటువంటి అంశాలపైన కూడా లోతుగా చర్చ జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలు ఏర్పాటు అయినందున ఉద్యోగులపై బారం ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలుసని ఏడాదిలోపు సమస్యలన్ని పరిష్కారం అవుతాయన్నారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఉద్యోగులు కష్టపడుతున్నారని అందరి లక్ష్యం తెలంగాణ అభివృద్ధి చెందాలనే భావనతో ముందుకెళ్తున్నామన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఉద్యోగులు మరింత కష్టపడాలని కోరారు. తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని హెల్త్‌కార్డుల ప్రక్రియను ప్రారంభించామని అన్ని కార్పోరేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని పాలమూరు ప్రాజెక్టు విషయంలో అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. పాలమూరు ప్రాజెక్టు డిజైన్ మార్పు నిపుణులతో సుదీర్ఘంగా చర్చించాకే శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మళ్లించడం జరిగిందని వెల్లడించారు. జూరాల నుండి పాలమూరు ప్రాజెక్టు నిర్మిస్తే అనుకున్న లక్ష్యాలు నేరవేరేవి కావని జూరాలకు వరదజలాలు తక్కువగా వస్తాయని తెలిపారు. ప్రస్తుతం జూరాల నుండి నీటిని ఎత్తిపోసే కోయిల్‌సాగర్ మోటర్లు బంద్ అయ్యాయని అదే కెఎల్‌ఐకి శ్రీశైలం నుండి తీసుకునే మోటర్లు నిరంతరంగా నడుస్తున్నాయని తెలిపారు. ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు నుండి తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 43టిఎంసిల నీటిని ఎత్తిపోసుకోవడం గొప్పవిషయమని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు కృష్ణానదిలో నారాయణపూర్ డ్యాంకు వరద వచ్చిన వెంటనే జూరాల నుండి నీటిని ఎత్తిపోయడంతో కోయిల్‌సాగర్, సంగంబండ, నెట్టెంపాడు, రామన్‌పాడు రిజర్వాయర్లు నింపడం జరిగిందని అదేవిధంగా 250 చెరువుల్లో కృష్ణానది జలాలను తొలిసారిగా నింపినఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి దిగిన కెసి ఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోంటూ నిత్యం తమతో సంప్రదింపులు జరిపేవారని తెలిపారు. ప్రీజోన్‌పై జరిగిన ఉద్యమం ఒక్కసారిగా ఉవ్విత్తున లేచిందని కొందరు తాము ఉద్యమం చేశామని చెప్పుకుంటున్నారు కానీ కెసిఆర్‌తో తాము కలిసి నేరుగా చర్చించి ప్రణాళికబద్దంగా ఆంద్రనాయకుల ఎత్తులను చిత్తుచేస్తూ ఉద్యమం చేయడంతోనే కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చిందని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలోనే ఉద్యోగులు కూడా నమ్మకంతో పనిచేశారని వెల్లడించారు. టిఎన్‌జిఓలు మాత్రమే కాకుండా వారికి అనుసందానంగా గజిటెడ్ అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని కూడా ఉద్యమంలో దింపి నిప్పురగిల్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జిఓ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్, అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, కార్యదర్శి రాజేందర్, జిల్లా నాయకులు శంకర్, బాలకిషన్, చంద్రనాయక్, అంజయ్య, ప్రబాకర్, చెన్నకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను వీడి ద్రోహం చేశారు
* రాజీనామా చేసి మళ్లి గెలవాలి
* డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14: రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు పార్టీని విడి నమ్మక ద్రోహం చేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ ఆరోపించారు. మంగళవారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్ ద్రోహం చేశారని ఆరోపించారు. పదవుల ఆకాంక్ష కోసం పార్టీని వీడడం దుర్మర్గమైన చర్య అని మండిపడ్డారు. రెండున్నర ఏళ్ల ఒప్పందానికి తూట్లు పొడిచి మాటతప్పారని దుయ్యబట్టారు. తానే పదవిలో ఉంటానని పదవిలో ఉంటానని తమ దగ్గర చెప్పి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ అదిష్టానం రెండున్నర ఏళ్ల తర్వాత పద్మజాయాదవ్‌కు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని మొదట్లోనే అంగీకారం కుదిరిందని ఈ విషయాన్ని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కోసం సహకరించిన బిజెపి, టిడిపి కౌన్సిలర్లు కూడా అదే ఒప్పందానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నారని పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ద్రోహం చేసి పదవిని కాపాడుకునేందుకు టిఆర్‌ఎస్‌లో చేరారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎంపి జితేందర్‌రెడ్డిలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫిరాయింపులను ప్రొత్సహిస్తూ రాజకీయాలకు విలువలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యవహరాలతో రాజకీయాల్లో రోజురోజుకు విలువలు తగ్గిపోయాయని కాంగ్రెస్ పార్టీ మాత్రం విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు రవికిషన్‌రెడ్డి, పాషలు మాట్లాడుతూ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి టి ఆర్ ఎస్‌లో కలిసి తిరిగి ఎన్నికలకు వెళ్లి ఉంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పేవారని పార్టీకి మోసం చేసిన వారిని ఎప్పుడు ప్రజలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు ముత్యాల ప్రకాష్, లక్ష్మణ్‌యాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు మరోషాక్
* తెరాసలో చేరిన మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్ పర్సన్
* పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతల చేరిక * ఖంగుతిన్న కాంగ్రెస్ నాయకులు * తెరాసలో మిన్నంటిన సంబరాలు

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14: కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మరోషాక్ తగిలింది. మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్‌తో పాటు నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి మంగళవారం తెరాస గూటికి చేరారు. గత రెండు నెలల నుండి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు, పదవిమార్పు వంటి అంశాలతో కాంగ్రెస్‌లో రాజకీయం వెడేక్కి ఉండేది. రెండున్నర ఏళ్ల ఒప్పందానికి ఇక స్వస్తి పలికారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్‌తో పాటు మరికొందరు చేరుతున్నారని జరుగుతున్న ప్రచారానికి కూడా తెర పడింది. మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్, కాంగ్రెస్ మహబూబ్‌నగర్ పట్టణ అధ్యక్షుడు ఆమరేందర్‌రాజు, కౌన్సిలర్లు శరత్, మహముద్, లింగంయాదవ్, మరో కౌన్సిలర్ భర్త, కాంగ్రెస్ సినియర్ నేత మక్బుల్‌తో పాటు మరో 200మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తెరాసలో చేరారు. వీరంత మహబూబ్‌నగర్ నుండి ఉదయం బయలుదేరి టి ఆర్ ఎస్ భవన్‌కు వెళ్లి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆద్వర్యంలో మంత్రులు హరీష్‌రావు, లక్ష్మారెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. వీరందరికి మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రాజకీయ పార్టీ నాయకులు తెరాసలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అభివృద్ధికి చేయూతను ఇవ్వడానికి తామంత టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెరాసలో చేరిన నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అందరు కలిసి రావడంతో మరింత అభివృద్ధి మహబూబ్‌నగర్ చెందుతుందని త్వరలోనే మహబూబ్‌నగర్‌కు మీషన్‌భగీరథ పథకం అంకీతం చేయబోతున్నామని ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వడానికి అన్ని విదాల కృషి చేయడం జరుగుతుందన్నారు. అందరి సహకారంతో మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధికి ఎంతో కృషిచేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో సినియర్‌నేతగా మలుమార్లు మహబూబ్‌నగర్ పట్టణంలో కౌన్సిలర్లుగా గెలిచి కాంగ్రెస్ అంటే ఆమరేందర్‌రాజు అనే ముద్ర వేసుకున్న నాయకుడు ఆ పార్టీని విడడంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు ఇలాంటి నాయకులను పార్టీలో ఉండకుండా చేస్తున్నాయని పలువురు సినియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఎమైనప్పటికిని ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డితో పాటు చాలా మంది జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు సైతం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తెరాసలో చేరడంతో ఇప్పటికే కొట్టుమిట్టడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ రాధ ఆమర్ పార్టీని విడడంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టమే జరిగిందని పలువురు సినియర్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ రెండున్నర ఏళ్ల పదవి ఒప్పందం కాంగ్రెస్‌లో గ్రూపుల కుంపటికి దారి తీయడమే కాకుండా ఏకంగా పార్టీని వీడే స్థితికి తీసుకువచ్చింది. రెండున్నర ఏళ్ల తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి తనకు దక్కుతుందంటున్న పద్మజాయాదవ్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక రాధ ఆమర్ మరో ఏడాదిన్నర పాటు మున్సిపల్ చైర్మన్ కొనసాగే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి. నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాతనే అవిశ్వాసానికి వీలు ఉండడంతో అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్న ఆశలు నేరవేరుతాయో లేదో వేచిచూడాల్సిందే...

జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
గద్వాలరూరల్, ఫిబ్రవరి 14: జములమ్మ జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి దర్శించుకున్నారు. ఉత్సవాల మొదటి మంగళవారం కావడంతో అమ్మవారిని మహారాష్ట్ర, కర్ణాటక తదితర సుదూర ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకున్నారు. రెండవ రైల్వేగేట్ దగ్గర గేట్ పడడంతో దాణఫ్యాక్టరీ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని ఉంటారని అధికారులు చెబుతున్నారు. గద్వాల పాత బస్టాండ్ నుండి జములమ్మ ఆలయం వరకు ఆర్‌టిసి వారు ప్రత్యేక బస్సులు నడిపారు. కాగా ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు కూడా ఏర్పాట్లు అంతగా చేయలేకపోయారు. దీంతో భక్తులు దూరం నుండే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోయారు. ఆలయం వద్ద కల్లు అమ్మకాలు విపరీతంగా జరిగాయి.

దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
వెల్దండ, ఫిబ్రవరి 14: వెల్దండ మండల కేంద్రంలోని సిందషావలి దర్గాకు మంగళవారం రాత్రి కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 128వ ఉర్సు ఉత్సవాల్లో బాగంగా ఎమ్మెల్యే దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కుబడులు చెల్లించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, హమీద్, సాయిబాబాగౌడ్, శేఖర్, ముస్లీం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హామీలను నెరవేర్చని కెసిఆర్
* బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి
చిన్నచింతకుంట, ఫిబ్రవరి 14: ఎన్నికల సమయంలో ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామిలిచ్చి నేటికి అట్టి హామిలను నెరవేర్చని కెసి ఆర్ ప్రభుత్వాన్ని రాబోయె రోజుల్లో రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లికొండి గ్రామంలో బిజెపి మండల కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగులు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలతో పాటు విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమిస్తే ఆ ఉద్యమ ఫలాలు అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్ అందించలేదని ఆమె విమర్శించారు. అధికారంలోకి రాగానే దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని హామి, దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ ఇప్పటికి సక్రమంగా అమలు చేయకపోవడం, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రారంభం కాలేదని అట్టడుగు స్థాయిలో ఉన్న విద్యార్థులు ఉన్నత చదువుకై ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రియంబర్స్‌మెంట్ ఇప్పటికి అందించకపోవడం ఈ ఆచరణకు సాధ్యం కానీ హామిలిస్తూ ప్రజలను మాయమాటలతో బొల్తాకొట్టిస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ ఒకేదఫాలో చేస్తానని హామి మరిచి విడుతలు వారిగా రుణమాఫీ అందించడంలో అట్టి మాఫీ డబ్బులు వడ్డీలకే సరిపోతుందని ఆమె తెలిపారు. నరేంద్ర మోడీ దేశంలోని అట్టడుగువర్గాల అభ్యున్నతికి ప్రస్తుత బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారని ఆడ బిడ్డలకు బేటి బచ్చావో బేటి పడావో దీంతో పాటుగా ఆడ పిల్లలకు పెళ్లి ఈడు వచ్చే వరకు రూ.6.50లక్షలు సుకన్య సంవృద్ది యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మోడీకే దక్కుతుందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు మోడీ సహోసాపేత నిర్ణయం తీసుకున్నారని తద్వారా దేశంలో నల్లధనం నిర్మూలన, అవినీతి అరికట్టడం, ఉగ్రవాదాన్ని పారదోలడానికే ఈ నోట్ల రద్దును చేపట్టడం జరిగిందని రాబోయె రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపెతం చేసేందుకు బూత్ కమిటిలు ప్రతిష్టాత్మకంగా పని చేయాలని ఆమె సూచించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు కార్యకర్త సైనికుల్లా పని చేయాలని ఆమె కోరారు.
మండల సమస్యలపై ఉద్యమిస్తాం
బిసి మోర్చ జిల్లా అధ్యక్షులు నంబిరాజు
మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు అధికారుల దృష్టికి తీసుకెళుతూ వాటి సాధనకు ఉద్యమబాట పడుతామని బిసిమోర్చ జిల్లా అధ్యక్షులు నంబిరాజు అన్నారు. మండలంలోని లాల్‌కోట చౌరస్తా నుంచి అల్లీపూర్ వరకు రూ.15కోట్లకుపైగా నిధులతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగడం, వ్యవసాయ గోదాంలు గ్రామంలో ఏర్పాటు చేయాలని అదే విధంగా మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు, ఊకచెట్టువాగుపై బ్రిడ్జి నిర్మాణంకై అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండాపోయిందని, బ్రిడ్జి నిర్మాణానికి ఢిల్లీలోని నితిల్ గడ్కారిని కలిసి సమస్యను వివరించి సహకరించాలని కోరుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవిందర్ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రాములు, రమేష్, అబ్దుల్ నబీ, వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్‌జీ, బాలరాజు, చిట్టెన్న, వెంకన్‌గౌడ్, లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన వర్కర్ల ఆందోళన
బాలానగర్, ఫిబ్రవరి 14: బాలానగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఎదుట మంగళవారం ఉదయం సిఐటియు డివిజన్ కార్యదర్శి డిప్యానాయక్ ఆద్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న బోజనం చేసే వంటవారికి ఉపాధి చూయించాలని డిప్యానాయక్ డిమాండ్ చేశారు. అక్షయ పాత్ర స్వచ్చంద సంస్థకు మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టు ఇవ్వడం వల్ల మహిళలు ఉపాధిని కొల్పోతున్నట్లు ఆయన వివరించారు. జడ్చర్ల రూరల్ సిఐ గిరిబాబు, టౌన్ సిఐ గంగాధర్, ఎస్సైలు మైనోద్దిన్, అశోక్‌కుమార్, సిఐటియు నాయకులను ఆరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి కురుమూర్తి, సిఐటియు నాయకులు అస్రీబేగం, నాగమణి, సుమలత, హైమావతి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
అద్దె బకాయిల షాపులు సీజ్
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 14: పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో గల వ్యాపార సముదాయాలను వ్యాపారులు సుదీర్ఘకాలంగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో మంగళవారం మున్సిపల్ అధికారులు దుకాణాలను సీజ్ చేశారు. దుకాణ యజమానులు అద్దెబకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరించడంతో మున్సిపల్ సిబ్బంది కోర్టులో వ్యజ్యం చేశారు. దింతో కోర్టు మున్సిపల్ సిబ్బందికి అనుగుణంగా తీర్పు ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు, దుకాణ వ్యాపారులు వాదోపవాదనలు విన్న కోర్టు మున్సిపాలిటీకి అద్దె బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయిన వ్యాపారులు అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి మున్సిపల్ అధికారులు కోర్టును ఆశ్రయించగా అద్దె బకాయిలు చెల్లించని దుకాణ వ్యాపారుల షాపులను సీజ్ చేయాలని ఆదేశించింది. దింతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు బకాయిలు చెల్లించని షాపులను సీజ్ చేశాయి. దింతో వ్యాపారులకు, మున్సిపల్ సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాల్యవివాహాన్ని అడ్డుకున్న తహశీల్దార్
భూత్పూర్, ఫిబ్రవరి 14: మండలంలోని అమిస్తాపూర్ గ్రామానికి చెందిన కుర్వ స్రవంతి అనే మైనర్ బాలికకు ఆమె బంధువులు పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. మంగళవారం గ్రామంలో స్రవంతిని ప్రతానం జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు భూత్పూర్ తహశీల్దార్ జ్యోతికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆమె పోలీసులతో కలిసి స్రవంతి ఇంటికి వెళ్లి అక్కడి నుండి స్రవంతిని తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. 18 సంవత్సరాలు దాటేవరకు బాలికలకు పెళ్లి చేయవద్దని ఆమె స్రవంతి బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను జిల్లా కేంద్రంలో గల స్టేట్ హోమ్‌కు తరలించారు. మండలంలోని ఏ గ్రామంలో కూడా మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ జ్యోతి హెచ్చరించారు.