మహబూబ్‌నగర్

గామ స్వరాజ్యానికి తూట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 18: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి రాష్ట్రంలో కెసిఆర్ తూట్లు పొడుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, కాంగ్రెస్ జడ్పీటిసిలు, ఎంపిపిలతో కలిసి డిసిసి కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తాను ఐదేళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేశానని అప్పటి సమావేశాలకు ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న సమావేశాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆసలు సమావేశాల పద్ధతినే కాలరాశారని ఆరోపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందనే సాకుతో జిల్లాకు చెందిన మంత్రులు, కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల కోడ్ ఉంటే విధానపరమైన నిర్ణయాలు కొత్త పనులు మంజూరు చేయడానికి వీలు ండదన్నారు. పాత పనులకు, కొన్ని అంశాలను చర్చించుకునే అవకాశం మాత్రం ఉంటుందని, అయితే సభ్యులను తప్పుదొవపట్టించి సాకులు చెప్పారని ఆరోపించారు. స్థానిక సంస్థలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యం చేస్తోందని ఆ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. జడ్పీటిసిలు, ఎంపిపిలు సమావేశంలో నిలదీస్తారనే భయంతోనే టిఆర్‌ఎస్ మంత్రులు ముఖం చాటేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖుని చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆగడాలు మితిమిరిపోయాయయని ఆరోపించారు. నాలుగు కొత్త జిల్లాల్లో పరిపాలన స్తంభించి పోయిందని ఎసిడిపి నిధులతో అభివృద్ధి పనులు చేపడితే ఇప్పటివరకు డబ్బులు రావడం లేదని, ప్రభుత్వం దివాలా తీసిందా అనే అనుమానం వ్యక్తం చేశారు. గతంలో పచ్చచొక్క అంటేనే పనులు అయ్యేవని, ప్రస్తుతం గులాబీ చొక్క అంటేనే నిధులు, పనులు జరుగుతున్నాయని ఇది రాజకీయంలో, ప్రజాస్వామ్యంలో మంచిపద్ధతి కాదని హితవు పలికారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించిందని ఆరోపించారు. జడ్పీ సమావేశానికి మంత్రులు రాకపోవడం సిగ్గుచేట్టన్నారు. జడ్పీ వైస్ చైర్మన్‌కు మాత్రం ఓ కల నెరవేరిందని ఒకరోజు సమావేశాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. అంతేకానీ జిల్లా అభివృద్ధి కోసం జడ్పీ సమావేశం జరగలేదని విమర్శించారు. అందుకే తాము జడ్పీ సమావేశాన్ని బహిష్కరించినట్లు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జడ్పీటిసి మణెమ్మ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం జడ్పీటిసి, ఎంపిపిల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఒకవేళ ప్రభుత్వానికి నచ్చకపోతే ఈ వ్యవస్థలను రద్దుచేసి మరింత నియంత పాలన చేసుకోవాలని హితవు పలికారు. జడ్పీసమావేశాల నిర్వహణ మహబూబ్‌నగర్ జిల్లాలో నిబంధనాలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

డిసిసి ప్రధాన కార్యదర్శిగా రాంచంద్రారెడ్డి
నవాబుపేట, ఫిబ్రవరి 18: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్‌ఎస్‌యూఐ మాజీ మండల అధ్యక్షుడు,రుక్కంపల్లి గ్రామానికి చెందిన నెత్తికొప్పుల రాంచంద్రయ్య నియమితులయ్యారు. హైద్రాబాద్ లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి నియామక పత్రాలను రాంచంద్రయ్యకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.