మహబూబ్‌నగర్

ఇది దుబారా ఖర్చు ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 18: ముఖ్యమంత్రి కెసిఆర్ హంగామాలు, ఆర్భాటాలకు వెళ్తూ దుబారా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ చిన్నారెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్పీ సమావేశాన్ని బైకాట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన విచిత్రంగా ఉందని, 31జిల్లాలు చేశాడు కానీ ఆయా జిల్లాల కార్యాలయాల్లో ఒక అధికారి ఉంటే పది కూర్చిలు ఖాళీగా ఉన్నాయని ఎద్దెవా చేశారు. రోజురోజుకు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని 2లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నెల 22న టిజెఎసి నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారన్నారు. టిజెఎసి నిర్వహించే నిరుద్యోగ ర్యాలీకి రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగ యువత తరలివచ్చి కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ధనవంతమైన రాష్ట్రంగా చెప్పుకున్న కెసిఆర్ ఇప్పుడు తెలంగాణను రూ.120లక్షలకోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని, రాష్ట్రానికి అప్పులు తెస్తూ అందులో వచ్చిన కమీషన్లు మాత్రం కెసిఆర్ ఇంటికి వెళ్తున్నాయని, రాష్ట్రంలో బంగారు బతుకుబతికేది మాత్రం కెసిఆర్ కుటుంబం మాత్రమేనని ఆరోపించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమ నిధుల నుండి చేసిన పనులకు కూడా నిధులు విడుదల కాకపోవడం దురదృష్టకరమని ఇలాంటి పరిస్థితి తెలంగాణకు రావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇలాంటి తెలంగాణను సోనియాగాంధీ ఇవ్వలేదని కెసిఆర్ బంగారు తెలంగాణకు బదులుగా అప్పుల తెలంగాణను తయారు చేస్తున్నారని విమర్శించారు.