మహబూబ్‌నగర్

జానపద కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఫిబ్రవరి 18: జానపద కళాకారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు కెవి రమణాచారి అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అహోబిలమఠం శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కళాకారుల వైభవోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానపద కళాకారులలో పేదవారికి ప్రభుత్వం కల్పించే డబుల్‌బెడ్ రూం, కళ్యాణలక్ష్మి కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. త్వరలోనే కళాకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో 1200 మంది కళాకారులకు అదనంగా పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో కళాకారులను గుర్తించి వారికి కూడా పింఛన్లు అందించేందుకు ల కలెక్టర్ల ద్వారా మంజూరుకి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో తోలుబొమ్మల్లాట కళాకారులకు కులధ్రువీకరణ పత్రాలను జారీకి చర్యలు తీసుకుంటామని, కళాకారులకు బస్సులలో రాయితీపై ప్రయాణించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, ఏ జిల్లాకు చెందిన కళాకారులు ఆయా జిల్లాల్లోనే జానపద కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని, మహబూబ్‌నగర్ డిఆర్‌ఓగా, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల ఆర్డీఓగా పని చేశానని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ గ్రామాల్లోని జానపద కళలను ప్రోత్సహించాలని, కళాకారుల సమస్యల పరిష్కారానికి వారికి అండగా ఉండాలన్నారు. కళాకారులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, దేవాలయాల్లో చక్క పనులు చేసే కళాకారులకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని, పింఛన్లతో పాటు హెల్త్‌కార్డులు, గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు. పట్టణంలోని ఆడిటోరియం నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా అహోబిల మఠంలో లక్ష్మి నర్సింహాస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందుగా రాజీవ్‌చౌరస్తా నుండి జానపద కళాకారులు ర్యాలీ నిర్వహించి అతిథులకు స్వాగతం పలికారు. వైభవోత్సవం సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన కళాకారులు యక్షగానం, తోలుబొమ్మలాట, డప్పునృత్యం, చక్క భజన, ఏకపాత్రాభినయం తదితర కళారూపాల ద్వారా ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి, వైస్ చైర్మన్ శంకర్, కళాకారుల సంఘం అధ్యక్షుడు వంగవీటి శ్రీనివాస్‌గౌడ్, లింగయ్య, కవిత, ప్రసాదచారి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మఠం అధ్యక్షుడు రాజగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.