మహబూబ్‌నగర్

విద్యతోనే గిరిజనుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఫిబ్రవరి 18: గిరిజన విద్యార్థులు చక్కగా చదువుకుంటేనే ఆ కుంటుంబాల్లో అభివృద్ధి జరుగుతుందని, అందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని వెంగళ్‌రావునగర్ కాలనీ పార్కులో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్‌శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహరాజ్ 278వ జంతి ఉత్సావాలను ప్రభుత్వపరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు పాల్గొని మాట్లాడుతూ గిరిజనులు చిన్నపరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే 35 శాతం సబ్సిడీతో 65 శాతం రుణ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నదని, అందులో 9 శాతం వడ్డీలో కూడా రాయితీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి వర్గానికి ఉన్న విషిష్టత, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభుత్వం అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. తాండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసేందుకు 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వం చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. రాబోయే బడ్జట్‌లో గిరిజనుల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. సారా తయారీ, విక్రయాలను మానుకొని ఉపాధి కోసం వ్యాపారాలను ప్రారంభించే గిరిజనులకు లక్ష రూపాయల ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు గిరిజనులు మహా యజ్ఞం నిర్వహించారు. గిరిజన విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో ఎంపిపిలు శంకర్ నాయక్, కృష్ణా నాయక్, మున్సిఫల్ చైర్మెన్ రమేష్‌గౌడ్, డిఎస్పీ జోగుల చెన్నయ్య, గిరిజన సంఘాల నేతలు జాత్రునాయక్, శ్రీ్ధర్ నాయక్, చంద్రునాయక్, సక్రు నాయక్, చంద్రశేఖర్ నాయక్, బుచ్చానాయక్, వాల్యానాయక్, బాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో
ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరవు
* నిధుల దోపిడీపైనే పాలకుల ధ్యాస
* పాలమూరు-రంగారెడ్డిపై సవతిప్రేమ తగదు
* ఎమ్మెల్యే డికె అరుణ
గద్వాల, ఫిబ్రవరి 18: ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు, నియామకాలు, నీళ్లు పేరిట ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కారని, ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. శనివారం డికె సత్యారెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డికె అరుణ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై గ్రీన్‌ట్రిబ్యునల్ అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ప్రాజెక్టు ద్వారా నిధులు దోచుకునేందుకే ప్రయత్నాలు చేసిందని, జూరాల నుండి ప్రారంభించాల్సిన ప్రాజెక్టును శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద ప్రారంభించి అనుమానాలకు తావిచ్చారన్నారు. రైతులకు, నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరితే ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని వాపోయారు. అదే విధంగా గట్టు లిఫ్ట్, తుమ్మిళ్ల లిఫ్ట్‌ల విషయంలో మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభుత్వం డిపిఆర్‌ను కూడా వేయలేకపోయిందని ఆరోపించారు. కేవలం ప్రతిపక్షాలపై అభాండాలు మోపుతూ మోసపూరిత ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్న టిఆర్‌ఎస్‌కు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు, డిటిడిసి నర్సింహా, ఇంతియాజ్, బంగి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.