మహబూబ్‌నగర్

టిఆర్‌ఎస్‌లో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21: కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జన ఆవేదన సభకు ప్రజల నుండి మంచి స్పందన రావడమే కాకుండా జనం తరలివస్తుండడాన్ని చూసి టిఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఆందోళన చెందుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీఅధికార ప్రతినిధి వినోద్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తన స్థాయి ఎమిటో గుర్తించుకోవాలని స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు. జైపాల్‌రెడ్డి, డికె అరుణ, చిన్నారెడ్డిలను విమర్శించే స్థాయి ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. రాజకీయ ఒనమాలు శివకుమార్ ఎక్కడి నుండి నేర్చుకున్నారో ఒక్కసారి గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జైపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి, డికె అరుణల చుట్టూ తిరిగిన విషయాన్ని కూడా అప్పుడు మరిచిపోతే ఎలా అని ఎద్దెవా చేశారు. టిఆర్‌ఎస్ పార్టీలోకి ఎదో ఆశించిపోతే ఆయనకు శృంగభంగమే మిగిలిందని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌లో ఎవరు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ బడానాయకులపై ఆరోపణలు చేస్తే అలానైన కెసిఆర్ గుర్తించి ఎదైన ఒక నామినేటేడ్ పదవి ఇస్తారనే ఆశతోనే కాంగ్రెస్ నాయకులపై శివకుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుందో ప్రజలందరికి తెలిసిపోయిందని నాలుగు దిక్కులు కెసిఆర్ కుటుంబమే పాలిస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీయే రైతుల బగోగులను చూసుకునే పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జన ఆవేదన సభలకు జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తుందని జనాలు స్వచ్చందంగా కాంగ్రెస్ సభలకు తరలివస్తుండడంతో టిఆర్‌ఎస్ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దెవా చేశారు. ముందుగా టిఆర్‌ఎస్ నాయకులు తమ స్థానం ఏమిటో గుర్తించుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీకి జిల్లాలో సొంత కార్యాలయం లేని దుస్థితి ఉందని అలాంటి పార్టీకి శివకుమార్ అధ్యక్షుడై ఆయన ఎక్కడ కూర్చోవాలో తెలియక తికమక పడుతున్నారని ఎద్దెవా చేశారు. పార్టీ మారిన నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు. జన ఆవేదన సభలు, చైతన్య సభలుగా మారుతున్నాయని దాంతో టిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కే రోజులు రానున్నాయని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు కట్ట రవికిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, విఠల్‌రెడ్డి, ఖాజాపాష, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
గోపాల్‌పేట, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని మున్ననూరు గ్రామంలోని ఉన్నత ప్రాథమికొన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను మంగళవారం వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు సస్పెండ్ చేశారు. మంగళవారం ఉదయం డిఇఓ సుశీందర్ రావు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 1,3,4,5,6, 7తరగతులకు చెందిన విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నించారు. 6,7 తరగతులకు చెందిన విద్యార్థులు ఆంగ్లంలో కనీస పరిజ్ఞానం లేకపోవడం, ఆంగ్లంలో వన్‌డే అనే పదాన్ని కూడా చదవకపోవడంతో ఆయన ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందుకు బాద్యులైన స్కూల్ అసిస్టెంట్ రాములును సస్పెండ్ చేశారు. అదే పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులు గణితంలో సరిగ్గా పరిజ్ఞానం లేకపోవడం, కనీసం 6వ ఏక్కాం చదవకపోవడంతో, చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేకపోవడంతో జి.నర్సింహులును కూడా సస్పెండ్ చేశారు. పాఠశాల తనిఖీ సమయంలో మండల విద్యాధికారి సి.ఎస్ రాజును అక్కడికి పిలిపించుకొని మీ పర్యవేక్షణ లోపం ఉన్నట్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలను తనిఖీ చేయాలని, పాఠశాలలో విద్యాప్రమాణాలు పెంచాలని ఆయన ఎంఇఓను ఆదేశించారు. తనిఖీ సమయంలోనే జిల్లా కార్యాలయానికి సమాచారం ఈ ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్ చేయడానికి ఆదేశాలను తయారు చేయాలని పాఠశాల నుండి ఆదేశించారు. గోపాల్‌పేట ఎంఇఓ కార్యాలయానికి ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు రావడంతో ఆ ఆదేశాలను ఎంఇఓ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు ఆర్డర్ కాపీలు ఇచ్చినట్లు ఎంఇఓ తెలిపారు.